S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/08/2016 - 18:17

విశాఖ: రోలుగుంట మండలం వడ్డిపాలో సోమవారం పాత ఇంటిని కూలగొడుతుండగా ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

08/08/2016 - 17:31

విజయవాడ: 2017 జూన్‌ 2లోపు ఏపీకి వచ్చినవారికి స్థానికత వర్తింపు చేస్తామని ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినవారికే స్థానికత వర్తింపు ఇస్తామని సర్కారు స్పష్టం చేసింది. స్థానికత ధ్రువీకరకణ పత్రం కావాల్సినవారు మూడు ఫారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని చెప్పింది.

08/08/2016 - 17:21

హైదరాబాద్: తెలుగు భాషా పీఠాన్ని మైసూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తామని, తెలుగు భాషకు ప్రాచీనహోదా వల్ల ఏడాదికి రూ.100 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తెలుగు భాషకు ప్రాచీనహోదా వద్దని దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

08/08/2016 - 17:06

తిరుపతి: ఎర్రచందనం డంప్‌ను పోలీసులు కరకంబాడి రోడ్డులో సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం విలువ 40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో డెంటల్‌ డాక్టర్‌ శక్తివేలుకు చెన్నైలో డెంటల్‌ ఆస్పత్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై రెడ్‌హిల్స్‌లో బినామీ పేర్లతో ఆరు భవనాలు ఉన్నాయి. శక్తివేలు తమ్ముడు మనోహర్‌ పరారయ్యాడు.

08/08/2016 - 15:01

రాజమహేంద్రవరం: వరదనీటితో రాజమహేంద్రవరం వద్ద గోదావరి, కోనసీమలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధ గౌతమి, కోరంగి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు పోటెత్తడంతో సుమారు 10 లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పి.గన్నవరం మండలంలోని కనకాయలంక వద్ద కాజ్‌వే నీట మునిగి ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

08/08/2016 - 11:53

విజయవాడ: రాష్ట్రాన్ని కరవుఛాయలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎపి సిఎం చంద్రబాబు సోమవారం నీరు-ప్రగతి కార్యక్రమం సమీక్ష సందర్భంగా జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. నీరు-ప్రగతి అమలులో అలసత్వం పనికిరాదని, జలవనరులు అందరికీ దక్కాలని, పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా ఎపిని మార్చాలన్నారు.

08/08/2016 - 11:53

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ వైకాపా అధినేత జగన్ రాష్టప్రతితో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర పార్టీల నేతలను కలిసేందుకు రెండురోజులపాటు దిల్లీలో ఉంటారు. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీని కలుస్తారు.

08/08/2016 - 11:53

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో కలిశారు. ఈనెల 12 నుంచి ఎపిలో జరిగే కృష్ణా పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా గవర్నర్‌ను ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా, కేంద్రం నిధులు తదితర అంశాలు కూడా వీరిమధ్య ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

08/08/2016 - 08:25

హైదరాబాద్, ఆగస్టు 7: నందమూరి తారక రామారావు పేరున ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ట్రస్టీ నారా లోకేష్ తెలిపారు. ఆదివారం కాకతీయ హోటల్‌లో మెంటర్ ది హీరో పేరుతో చిత్రకారుడు హరి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996వ సంవత్సరంలో నాన్న చంద్రబాబు పేదలకు సేవలందించే సంకల్పంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు.

08/08/2016 - 07:47

కర్నూలు, ఆగస్టు 7: రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 9 అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో ఆదివారం డిప్యూటీ సిఎం కెఇ తహశీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా ప్రజా సమస్యల పరిష్కార సమయం గణనీయంగా తగ్గిందన్నారు.

Pages