S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/10/2016 - 06:12

విశాఖపట్నం, ఆగస్టు 9: గిరిజనుల సంప్రదాయ నృత్యం ‘్థంసా’కు కూచిపూడి తరహాలో ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా అరుకులో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

08/10/2016 - 06:10

రాజమహేంద్రవరం/్భద్రాచలం, ఆగస్టు 9: జీవనది గోదావరి అంత్య పుష్కర క్రతువు చివరి ఘట్టానికి చేరింది. ఇక కేవలం 48 గంటలు మాత్రమే గోదావరి నదిలో పుష్కర ప్రభావం ఉండనుండటంతో స్నానాలకు భక్త జనం తహతహలాడుతున్నారు. చివరి రెండు రోజుల్లో గోదావరి నది అంత్య పుష్కర స్నానం ముగించుకుని 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు భక్తులు వెళ్ళే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనావేస్తున్నారు.

08/10/2016 - 06:08

విజయవాడ, ఆగస్టు 9: కృష్ణా నదిలో పుష్కరుడు ప్రవేశించే ముహూర్తాన్ని ప్రకటించడానికి ప్రభుత్వం వెనకాడుతోంది. సాధారణంగా పుష్కరాల ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ఈ ముహూర్త సమయాన్ని ప్రభుత్వ ఆస్థాన పురోహితులు ప్రకటించాల్సి ఉంది. అలా కాకుంటే పండిత శ్రేష్ఠులైనా ఇందుకు ముందుకు రావల్సి ఉంది. కానీ ఈసారి కృష్ణా పుష్కరాల్లో ముహూర్తాన్ని ప్రకటించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

08/10/2016 - 06:07

చిత్తూరు, ఆగస్టు 9: కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసి స్మార్ట్ కుప్పంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కుప్పంలోని రోడ్లు భవనాలశాఖ అతిథి గృహంలో పలు అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. కుప్పం కోర్ కమిటీ సభ్యులతో పాటు స్మార్ట్ కుప్పం ప్రతినిధులతోను ముఖ్యమంత్రి చర్చించారు.

08/10/2016 - 06:07

అనంతపురం టౌన్, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రవేశపెట్టిన ప్రైవేట్‌బిల్లును మనీబిల్లు పేరుతో పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సిఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలను వంచించి ప్రజాద్రోహులుగా మారారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.

08/10/2016 - 06:06

ఆత్మకూరు, అగస్టు 9: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమేశ్వరాలయం మంగళవారం పూర్తిగా నీట మునిగింది. సాయంత్రం చివరిసారిగా శిఖర దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడంతో ఆలయం క్రమంగా నీటిమునిగింది. ప్రస్తుతం ఆలయ శిఖరంపై ఉన్న ధ్వజం మాత్రమే కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో అదికూడా మునిగిపోతుందని భావిస్తున్నారు.

08/10/2016 - 06:06

విశాఖపట్నం, ఆగస్టు 9: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. పశ్చిమ దిశగా పయనిస్తూ తీరాన్ని దాటవచ్చని పేర్కొన్నారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేనప్పటికీ రుతుపవనాలు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు.

08/10/2016 - 05:10

విజయవాడ, ఆగస్టు 9: మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న కృష్ణ పుష్కరాలకు ఏర్పాట్లు దాదాపూ పూర్తయ్యాయని పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ తెలియచేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 11వ తేదీన ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమంలో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమవుతాయని తెలిపారు.

08/10/2016 - 05:12

విజయవాడ, ఆగస్టు 9:ప్రకాశం బ్యారేజి వద్ద జలకళ సంతరించుకుంది. ఏడాది పొడవునా 12 అడుగుల నీటి మట్టంతో కళకళలాడుతూ ఉండాల్సిన ప్రకాశం బ్యారేజి దగ్గర నీటి మట్టం ఇటీవల రెండడుగులకు పరిమితమైపోయింది. పట్టిసీమనుంచి గోదారి జలాలను తరలించాక మట్టం కాస్త పెరిగినా, అవి కృష్ణా జలాలు కావన్న నిస్పృహ భక్తుల్లో గూడుకట్టుకుందనే విషయం నిజం.

08/10/2016 - 05:05

శ్రీకాకుళం, ఆగస్టు 9: తెలుగు ప్రాచీన భాషగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని కథానిలయం వ్యవస్థాపకులు కారా మాస్టారు (కాళీపట్నం రామారావు) పేర్కొన్నారు.

Pages