S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/08/2016 - 12:21

కడప: కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఇక్కడి మున్సిపల్ మైదానంలో ఈరోజు సాయంత్రం ఎపి ప్రభుత్వం నిర్వహించే మహాసంకల్ప సభకు అధికారులు విస్తృత సన్నాహాలు చేయగా, సభా ప్రాంగణంలోకి వర్షపునీరు చేరింది. పొద్దుటూరు, పులివెందులలోనూ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

06/08/2016 - 12:20

ఏలూరు: కాపుఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైకాపా అధినేత జగన్ చేతిలో కీలుబొమ్మలా మారి, ఆయన చెప్పినట్లు ఆడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. జగన్ ప్రాపకం కోసం ముద్రగడ వంటి సీనియర్ నాయకుడు పరితపించడం వింతగా ఉందన్నారు. తుని విధ్వంసకాండకు సంబంధించి రౌడీషీటర్లను, నేరస్థులను పోలీసులు అరెస్టు చేస్తుంటే ముద్రగడ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

06/08/2016 - 12:19

కడప: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో పాల్గొన్న విద్రోహశక్తులకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అండగా నిలుస్తున్నారని ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఆరోపించారు. విధ్వంసకాండకు బాధ్యులెవరో ముద్రగడ బహిర్గతం చేయాలన్నారు. అరెస్టులను అడ్డుకోవడం ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని తాపత్రయ పడడం సరికాదన్నారు.

06/08/2016 - 12:18

కడప: ఎపి సర్కారు చేపట్టిన నవ నిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా కడపలో బుధవారం సాయంత్రం జరిగే మహాసంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడి మున్సిపల్ మైదానంలో ప్రధాన వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు.

06/08/2016 - 11:20

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు చివరి మలుపు వద్ద బుధవారం ఉదయం భక్తులు ప్రయాణిస్తున్న టెంపో పిట్టగోడను ఢీకొట్టింది. కర్ణాటకకు చెందిన నలుగురు చిన్నారులతో సహా 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

06/08/2016 - 08:31

విశాఖపట్నం, జూన్ 7: అప్పు చేసైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కష్టాలను ఎదుర్కొంటూ బాధ్యతలను మరవకుండా రాష్ట్భ్రావృద్ధికి దృఢసంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని వైవిఆర్ మూర్తి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

06/08/2016 - 08:30

ఆదోని, జూన్ 7: వర్షాలు కురుస్తుండడంతో సీమలో వజ్రాల వేట ప్రారంభమైంది. వజ్రం దొరికితే తమ ఆదృష్టమే మారిపోతుందని జనం పొలాల వెంట పరుగులు తీస్తున్నారు. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని జొన్నగిరి, తుగ్గలి, రాతన పెరవలి గ్రామాల్లో వజ్రాల వేట ముమ్మరమైంది. సూదూర ప్రాంతాల నుంచి కుటుంబాలకు కుటుంబాలు వలస వచ్చి ఇక్కడే మకాం వేసి వజ్రాల కోసం కళ్లు చాటంత చేసుకుని మరీ వెతుకుతున్నాయి.

06/08/2016 - 08:30

విజయవాడ , జూన్ 7: వెనకబడిన వర్గాల వారికి రాజకీయ నాయకత్వం అప్ప చెప్తానని, అగ్ర వర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

06/08/2016 - 08:29

విజయవాడ, జూన్ 7: దశాబ్దకాలం పాటు అవినీతి.. కుటుంబ పాలన.. స్వప్రయోజనలతో దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పాలన నుండి నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా బిజెపి ప్రభుత్వం పటిష్ఠ అవినీతి రహిత పాలనను అందిస్తోందని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీఇరానీ పేర్కొన్నారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతీ పైసా పేదవాడి దరి చేరేందుకు గాను కేంద్రం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు పోతోందన్నారు.

06/08/2016 - 08:18

తిరుపతి, జూన్ 7: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మే నెలలో రికార్డు స్థాయిలో కోటికి పైగా లడ్డూలు తయారుచేసిన పోటు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2500 ప్రోత్సాహక బహుమానం ఇవ్వాలని టిటిడి ఇఒ సాంబశివరావు నిర్ణయించారు. ఈక్రమంలో కొత్త మైలురాయిని చేరుకున్న పోటు, అదనపు పోటులోని 482 మంది కార్మికులు, 16 మంది సహాయకుల సేవలను ఇఒ ప్రశంసించారు.

Pages