S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/08/2016 - 17:25

కడప: ఎపి ప్రభుత్వం చేపట్టిన నవ నిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం కడప మున్సిపల్ మైదానంలో మహాసంకల్ప సభ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి వర్షం తెరిపి ఇవ్వడంతో సభ సజావుగానే మొదలైంది. ఎపి సిఎం చంద్రబాబు, టిడిపి యువనేత నారా లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సభకు హాజరయ్యారు.

06/08/2016 - 15:59

కాకినాడ: రామవరం సమీపంలోని జాజిగెడ్డ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ మావోయిస్టులకు చెందిన డంప్‌ను గుర్తించారు. డంప్‌లో నుంచి భారీగా ఆయుధాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

06/08/2016 - 15:59

రాజమండ్రి: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తుని వద్ద జరిగిన విధ్వంసకాండను నేరంగా చూడరాదని, అది జనసమూహం చేసిన చర్య అని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ ఉద్యమానికి జనం మద్దతు ఉందన్నారు. వైకాపాను లక్ష్యంగా చేసుకుని తుని విధ్వంసకాండలో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

06/08/2016 - 15:58

విజయవాడ: ప్రతి నియోజకవర్గానికీ నిర్దిష్టమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందించి వార్షిక లక్ష్యాలను సాధించాలని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించారు. మహాసంకల్పం సందర్భంగా ఆయన బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

06/08/2016 - 15:58

విశాఖ: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. పట్ట్భా గార్డెన్స్ ఏరియాలో గోడకూలి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పెనుగాలుల ధాటికి మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి.

06/08/2016 - 15:57

చిత్తూరు: కార్ల లోడుతో వెళుతున్న ఓ కంటైనర్ వాహనం కరంటు తీగలు తగిలి మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. యాదమరి మండలం ఇరువారం బైపాస్ రోడ్డులో బుధవారం ఈ ఘటన జరిగింది. మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించగా మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

06/08/2016 - 15:56

కడప: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను దారుణంగా మోసగించారంటూ ఎపి సిఎం చంద్రబాబుపై కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.

06/08/2016 - 13:08

అమలాపురం: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఖరితో కాపు కులస్థులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందని డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప బుధవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. వైకాపా అధినేత జగన్, ముద్రగడ కలిసి ఈ నాటకం ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. తుని విధ్వంసకాండకు సంబంధించి ఎవరినీ విడిచిపెట్టేది లేదని నిందితులందర్నీ పోలీసులు అరెస్టు చేసి కేసులు పెడతారని అన్నారు.

06/08/2016 - 13:05

తిరుపతి: తిరుమలకు నడకదారిన వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని టిటిడి సభ్యుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అరికెల నర్సారెడ్డి తెలిపారు. టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు ఆయన చేత ప్రమాణం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నర్సారెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఆయనను టిటిడి సభ్యుడిగా ఎపి సర్కారు ఇటీవల నియమించింది.

06/08/2016 - 13:05

ఒంగోలు: కుటుంబ కలహాల పర్యవసానంగా ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. కొత్తపట్నం మండలం అల్లూరులో కన్నతండ్రినే రోకలిబండతో మోదీ కుమారుడు హత్య చేశాడు. సమాచారం అందడంతో పోలీసులు అల్లూరు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Pages