S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/21/2018 - 23:57

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో బీసీవర్గాలెప్పుడూ తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు.

09/21/2018 - 23:57

గుంటూరు, సెప్టెంబర్ 21: శాసనసభ ఆమోదించిన కాపు రిజర్వేషన్ బిల్లు చట్టప్రకారం చెల్లదని, కర్ణాటక బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ద్వారకానాథ్ ఇటీవల రాజమండ్రిలో తెలిపారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక అరండల్‌పేటలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/21/2018 - 23:56

విజయవాడ, సెప్టెంబర్ 21: సకాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి.. పంచాయతీలను రక్షించాలనే డిమాండ్‌పై అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి అమరావతిలో గ్రామ స్వరాజ్య దీక్ష ద్వారా ప్రత్యక్ష పోరుకు సమయాత్తమవుతున్నట్లు ఆయన తెలిపారు.

09/21/2018 - 23:55

విజయవాడ (పాయకాపురం), సెప్టెంబర్ 21: విద్యా రంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పాటిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు ఇచ్చింది. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరిక అశోక్ మాట్లాడుతూ జ్ఞానభేరి పేరుతో ప్రభుత్వం ప్రచారభేరి ప్రారంభించిందన్నారు.

09/21/2018 - 23:55

గుంటూరు, సెప్టెంబర్ 21: పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి రానురాను బుద్ధి మందగిస్తోందని, వాస్తవాలు చెప్తున్నా పదే పదే పోలవరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ ఫైర్ అయ్యారు.

09/21/2018 - 23:53

అమరావతి, సెప్టెంబర్ 21: తెలుగు సాహితీలోకంలో మహాకవి గురజాడ అప్పారావు ఓ ధృవతారగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. శుక్రవారం గురజాడ జయంతి సందర్భంగా ఉండవల్లి గ్రీవెన్స్‌హాలులో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడికి గురజాడ నాంది పలికారన్నారు.

09/21/2018 - 23:52

అమరావతి, సెప్టెంబర్ 21: తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన యువనేస్తం పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. శుక్రవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.

09/21/2018 - 17:05

అనంతపురం:జిల్లాలోని తాడిపత్రి మండలం తలారిచెరువులో పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పెన్నా సిమెంట్స్ పక్కన మద్యం దుకాణం సమీపంలో వెంకటరమణ, తలారి రంగడు నిలబడి ఉండగా కొందరు వ్యక్తులు హఠాత్తుగా కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరమణ అక్కడికక్కడే చనిపోగా, రంగయ్య మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ ఘటనలో పదిమందికి పైగా గాయపడ్డారు.

09/21/2018 - 13:08

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు దయె అని పేరు పెట్టారు. ఇది తీరం దాటింది. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోల్లంగా మారింది. శుక్రవారం నాడు దీని ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరందాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.

09/21/2018 - 04:50

విజయవాడ, సెప్టెంబర్ 20: పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం దొంగే దొంగ అని ఇల్లెక్కి అరుస్తున్నట్లు ఉందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుపై రూ. 14,781 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రూ.

Pages