S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/11/2019 - 23:46

సిద్దిపేట అర్బన్, ఆగస్టు 11: దేశవిదేశాలకు మాంసకృత్తుల ఉత్పత్తులను ఎగుమతి చేసేలా ఆర్డర్లు తెచ్చుకునేలా ఇర్కోడ్‌లో మాంసం పరిశ్రమ నెలకొల్పోతున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు సగం మాంసం తింటే .. మిగత సగం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో తింటున్నారని ఆయన వెల్లడించారు.

08/10/2019 - 00:14

విజయవాడ, ఆగస్టు 9: వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గ్ధామంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు.

08/09/2019 - 22:29

న్యూఢిల్లీ, ఆగస్టు 9: డిబెంచర్ ట్రస్టీ మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల సెబీ నమోదు చేసిన కేసును యాక్సిస్ బ్యాంక్ శుక్రవారం పరిష్కరించుకుంది. ఇందుకు సంబంధించి రూ. 2.43 కోట్ల రూపాయలు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం సెటిల్మెంట్ చార్జీల కింద చెల్లించింది. ఆ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు యాక్సిస్ బ్యాంకు సెబీ రిజిస్ట్రేషన్ కలిగిన డిబెంచర్ ట్రస్టీ.

08/09/2019 - 22:28

ముంబయి, ఆగస్టు 9: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజైన శుక్రవారం సైతం లాభాల బాటలో నడిచాయి. ప్రధానంగా దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు కేంద్రం చేపట్టడం, అలాగే పెట్టుబడిదారులకు పన్నులపరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తుండటం సానుకూలంగా మారాయి.

08/09/2019 - 22:26

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశీయ విఫణిలో బంగారం ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. రికార్డు స్థాయి గరిష్ట ధరలను అందుకున్న ఒక్క రోజు వ్యవధిలో వరలక్ష్మీ వ్రతం రోజున ఈ మార్పు చోటుచేసుకోవడం విశేషం. దేశ రాజధానిలో 10 గ్రాములు (తులం) బంగారంపై రూ. 140 తగ్గింది. అయినప్పటికీ రూ. 38,000 స్థాయిని మించే 38,330గా ట్రేడైంది.

08/09/2019 - 22:26

విజయవాడ, ఆగస్టు 9: పెట్టుబడులను స్వాగతించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన అవుట్‌రీచ్ సదస్సులో సీఎస్ మాట్లాడుతూ ఇది పెట్టుబడులను ప్రోత్సహించే మొట్టమొదటి అత్యున్నత సమావేశమన్నారు.

08/08/2019 - 23:51

అనంతపురం, ఆగస్టు 8: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’ సంస్థ అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ఇండియా తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన మొట్టమొదటి కారును గురువారం ప్రారంభించింది. తద్వారా ఈ కేంద్రం నుంచి భారీ స్థాయిలో సెల్టోస్ కార్ల తయారీని కియా ప్రారంభించినట్లయింది.

08/08/2019 - 22:26

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఎయిర్‌టెల్‌లో అంతర్భాగమైన భారతి టెలికాంలో పెట్టుబడుల వాటాను పెంచుకునేందుకు సింగపూర్‌కు చెందిన టెలికం దిగ్గజం ‘సింగ్‌టెల్’ సంసిద్ధతను వ్యక్తం చేస్తోం ది. దేశంలో మొత్తం టెలికాం మార్కెట్లో 50 శాతానికి మించిన భాగస్వామ్యం ఉన్న ఎయిర్‌టెల్‌లో ప్రాముఖ్యతను పెంచుకునే దిశగా సింగ్‌టెల్ కృషి చేస్తోంది. ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌లో 41 శాతం వాటాలు ‘్భరతి టెలికాం’కు ఉన్నాయి.

08/08/2019 - 22:24

ముంబయి, ఆగస్టు 8: విదేశీ పెట్టుబడిదారుల పన్ను విధానాన్ని సరళతరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుందన్న వార్తలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఒక్కసారిగా అమిత బలాన్నిచ్చాయి. గురువారం బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 737 పాయింట్లు ఎగబాకగా, బ్రాడర్ నిఫ్టీ సైతం 11.000 మార్కును మళ్లీ అధిగమించింది.

08/08/2019 - 22:23

న్యూఢిల్లీ, ఆగస్టు 8: హైరిస్క్ మ్యూచువల్ ఫండ్లలో మదుపుచేసిన వారి ప్రయోజనాలు రక్షించే నిమిత్తం సెబీ సరికొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫండ్ హౌస్‌లు తమ పెట్టుబడులన్నింటినీ లిస్టెడ్ (అధికారిక జాబితాలో ఉన్న) లేదా త్వరలో లిస్టెడ్ కానున్న ఈక్విటీలు, రుణ సెకూరిటీల్లోకి మార్చు కోవాల్సిందిగా ఆదేశించింది. దశల వారీగా ఈ పెట్టుబడుల మార్పు చేసుకోవచ్చని సూచింది.

Pages