S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/20/2019 - 23:54

హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణ రాష్ట్రంలో 2019-20 సంవత్సరానికి సంబంధించి సోయాబీన్, ఉలువల ఉత్పత్తులను రైతుల నుండి కొనుగోలు చేసే బాధ్యతను టీఎస్ మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు సోయాబీన్, ఉలువలను కొనుగోలు చేస్తారు.

08/20/2019 - 23:28

ముంబయి, ఆగస్టు 20: బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల వత్తిడికి గురవడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. అయితే వాహన, ఐటీ స్టాక్స్ లాభాల్లోనే సాగాయి. కాగా వరుసగా మూడు రోజులపాటు లాభాల బాట పట్టిన అనంతరం సూచీలు తాజాగా మళ్లీ నష్టాలను నమోదు చేయడం గమనార్హం.

08/20/2019 - 23:28

న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారం ధరలు మంగళవారం ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల (తులం) బంగారంపై రూ. 200 పెరిగి మొత్తం ధర రూ. 38,770 పలికింది. అటు అంతర్జాతీయంగా బంగారం వ్యాపారం ప్రస్తుతం నష్టదాయకంగానే ఉన్నా దేశీయంగా పసిడి వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని స్ధాయికి చేరుకున్నాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

08/20/2019 - 23:27

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రుణ వాణిజ్యాన్ని విస్తరించుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్తగా ‘పీఎస్‌బీలోన్స్‌ఇన్ 59 మినిట్స్’ పోర్టల్‌లో గృహ, వాహన రుణాలతో సహా రీటైల్ ఉత్పాదనలను ప్రవేశపెట్టనున్నాయి. ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా ఒక కోటి రూపాయల పరిమితి వరకు ఉన్న రుణాలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలకు) మంజూరు చేసేందుకు ఆమోదం తెలపడం జరుగుతోంది.

08/20/2019 - 05:27

న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొనడం తీవ్ర ఆందోళనకర పరిణామమని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సోమవారం నాడిక్కడ పేర్కొన్నారు. ప్రధానంగా విద్యుత్, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

08/20/2019 - 00:50

విశాఖపట్నం, ఆగస్టు 19: గిరిజన యువత వలసలు తగ్గించడం, ఉన్నచోటే ఉపాధి కల్పించడం, వినియోగదారులకు అందుబాటులో పెట్రోల్‌ను ఉంచడం, తద్వారా సంస్థకు తగినంత ఆదాయాన్ని సమకూర్చడం ప్రధాన లక్ష్యాలుగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పని చేస్తోంది. పెట్రోల్ బంక్‌ల నిర్వహణ విజయవంతం కావడంతో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బంక్‌ల సంఖ్య 25కు పెంచుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది.

08/19/2019 - 22:30

ముంబయి, ఆగస్టు 19: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెషన్ ఆరంభంలో లాభాల బాట పట్టిన సూచీలు చివరి గంటల్లో ఫైనాన్షియల్, వాహన రంగ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల వత్తిడితో స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం వివిధ రంగాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపట్టవచ్చన్న అంచనాల నడుమ మదుపర్లు ఆచితూచి అడుగేశారు.

08/19/2019 - 22:28

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వినియోగదారులకు నాణ్యతతో కూడిన గృహ సముదాయాలను నిర్దేశిత సమయానికే నిర్మించి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా స్ధిరాస్తి వ్యాపారులకు సూచించారు. స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందితే దేశ ఆర్ధికాభివృద్ధి వేగవంతానికి, ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.

08/19/2019 - 22:26

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వడాఫోన్ ఐడియా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి బాలేష్ శర్మ వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని దిగ్గజ మొబైల్ ఆపరేటర్ సంస్ధ సోమవారం నాడిక్కడ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

08/19/2019 - 06:26

విజయవాడ : పరిశ్రమల్లో ఇంధన పొదుపుపై దృష్టి సారించాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. ఏపీ ట్రాన్స్‌కో, తూర్పు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమలు ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయని, ఈ రంగంలో ఇంధన పొదుపుపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) దృష్టి సారించిందని చెప్పారు.

Pages