S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/15/2019 - 06:39

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో లేఅవుట్లు, భవనాల నిర్మాణాలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ (రేరా) మొదటిసారిగా మూడు భవనాల విషయంలో అధికారికంగా ప్రకటన చేసింది. కూకట్‌పల్లి విలేజ్‌లోని సర్వేనెంబర్ 477 లోని 13, 14, 15 ప్లాట్లలో భవనాలను బి.

08/14/2019 - 23:43

ముంబయి, ఆగస్టు 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. హెవీ వెయిట్స్ సూచీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడం మార్కెట్లకు సానుకూలంగా మారింది. అంతేకాకుండా ఆసియా మార్కెట్లు సైతం బుధవారం కోలుకుని లాభాల బాట పట్టడం మన స్టాక్ మార్కెట్లకు అనువుగా మారింది.

08/14/2019 - 23:40

న్యూఢిల్లీ, ఆగస్టు 14: కనె్వన్షనల్ ఇంజన్, విద్యుత్ వాహనాలు వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీని భారత ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. ఆటో మొబైల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనివార్యమని, దాని కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఇటీవల ప్రధాని ప్రకటించారు. దీన్ని ఆటో పరిశ్రమ హర్షిస్తోంది.

08/14/2019 - 23:20

విశాఖపట్నం, ఆగస్టు 14: దేశంలోని స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా వివిధ కంపెనీల్లో మదుపు చేసే ఇనె్వస్టర్ల భద్రతకు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధిక ప్రాధాన్యం ఇస్తుందని జనరల్ మేనేజర్ కృష్ణానంద్ రాఘవన్ పేర్కొన్నారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్స్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

08/14/2019 - 06:11

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) వాటాలు మంగళవారం భారీ స్ధాయిలో 10 శాతం లాభపడ్డాయి. రూ. 71,638 కోట్ల రూపాయల అదనపుమార్కెట్ విలువను ఆ కంపెనీ సంతరించుకుంది. వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కంపెనీ పెట్టుబడిదారులకు అనువైన నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణమని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. తాజా దూకుడుతో ఈ బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్ వాటాలు 9.72 శాతం ఎగబాకి ఒక్కోవాటా రూ. 1,275 వంతున ట్రేడైంది.

08/14/2019 - 05:15

ముంబయి, ఆగస్టు 13: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల పాలయ్యాయి. ప్రధానంగా హెవీ వెయిట్స్ సూచీ, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీ బ్యాంక్ వాటాలు పెద్దయెత్తున అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వాటాల విక్రయ వెల్లువ సైతం దీనికి తోడైంది. దాదాపుగా మొత్తం దేశీయ మార్కెట్లపై ఈ ప్రభావం పడింది.

08/14/2019 - 05:14

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ వాహన రంగం తీవ్ర ఇక్కట్లలో కూరుకుపోతోంది. గడచిన జూలై మాసంలో 19 ఏళ్ల కనిష్టానికి ఈ రంగంలో విక్రయాలు చేరడం ఉద్యోగుల ఉనికికి సైతం విఘాతంగా మారింది. జూలై విక్రయాల్లో 18.71 శాతం తగ్గుదల నెలకొంది. మూడు నెల్ల కాలంగా పరిస్థితి అద్వాన్నంగా మారడంతో దాదాపు 15 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.

08/13/2019 - 06:31

ముంబయి : కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న రిలయన్స్ సంస్థ దేశ ప్రజలకు మరింత అద్భుతమైన సేవలను అందించబోతోంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి జియో గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తెస్తామని సోమవారం ఇక్కడ జరిగిన 42వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. గిగా ఫైబర్ ద్వారా ల్యాండ్ లైన్ ఫోన్లనుంచి ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలుంటుంది.

08/12/2019 - 00:11

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఆగస్టు నెలలోనూ విక్రయాలను కొనసాగించారు. ఆగస్టు నెలలోని ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే వారు నికరంగా రూ. 9,197 కోట్ల నిధులను భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. దేశీయ, ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వారు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించడం ద్వారా నిధులను ఉపసంహరించుకున్నారు.

08/12/2019 - 00:10

న్యూఢిల్లీ, ఆగస్టు 11: రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలను త్వరలో పరిష్కరించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సంస్థలు, ఇళ్ల కొనుగోలుదారులు ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ద్రవ్యలభ్యత కొరత, డిమాండ్ మందగించడం, ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి సమస్యలను వివరించారు.

Pages