S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/16/2019 - 23:46

విశాఖపట్నం, ఆగస్టు 16: కేంద్రం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తెచ్చిన తరువాత 2017-18 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి రిటర్న్స్ దాఖలు చేయని వారు ఈ నెల 31లోగా జీఎస్టీ సేవాకేంద్రాల్లో దాఖలు చేయాలని జీఎస్టీ ఏపీ సర్కిల్ చీఫ్ కమిషనర్ నరేష్‌కుమార్ పెనుమాక స్పష్టం చేశారు.

08/16/2019 - 23:44

ముంబయి, ఆగస్టు 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్య వారం చివరి రోజైన శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐతే వారం మొత్తం పరిగణనలోకి తీసుకుంటే రెండు సూచీలు నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఈవారం సెనె్సక్స్ 231.58 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 61.85 పాయింట్లు కోల్పోయింది.

08/16/2019 - 23:43

న్యూఢిల్లీ, ఆగస్టు 16: సంప్రదాయేతర ఇంధన వనరులు (సౌర శక్తి) పరికరాల దిగుమతి సమస్యలపై ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యూటీవో)కు చెందిన వివాదాల పరిష్కార కమిటీ భారత్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమెరికా సవాల్ చేసింది. డబ్ల్యూటీవోకు చెందిన మరో ఉన్నత స్థాయి కమిటీకి అమెరికా తన పిటిషన్‌ను శుక్రవారం సమర్పించింది.

08/16/2019 - 23:42

జమ్మలమడుగు, ఆగస్టు 16: కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద ఉన్న బ్రహ్మణీ పరిశ్రమను శుక్రవారం చైనాకు చెందిన థెయాంగ్ హోల్డింగ్స్ కంపెనీ ప్రతినిథుల బృందం పరిశీలించింది. నలుగురు సభ్యుల బృందం బ్ర హ్మణీ పరిశ్రమలో పర్యటించింది. బ్రహ్మణీ కా ర్యాలయంలో ఆర్డీవో నాగన్న, జిల్లా అధికారులు ప్రతినిథుల బృందానికి బ్రహ్మణీకి సంబంధించిన పలు వివరాలను వివరించారు.

08/16/2019 - 23:40

న్యూఢిల్లీ, ఆగస్టు 16: టీవీఎస్ గ్రూప్‌లో అంతర్భాగమైన వాహన పరికరాల తయారీ సంస్థ ‘సుందరం క్లైటాన్ లిమిటెడ్’ (ఎస్‌సీఎల్) తమిళనాడు పాడిలోని తన కర్మాగారంలో ఉత్పత్తిని రెండు రోజులపాటు నిలిపేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. వాహన రంగంలో తలెత్తిన మాంద్యం నేపథ్యంలో ద్విచక్ర వాహనాల సంస్ధ హీరో మోటోకార్ప్ బాటలోనే తమ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని ఎస్‌సీఎల్ వెల్లడించింది.

08/16/2019 - 05:52

న్యూఢిల్లీ : ప్రభుత్వ నిర్వహణలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)కు చెందిన 54 బొగ్గు గనుల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేసుకుంటోంది. కాంట్రాక్టుల పరంగా, హరిత క్లియరెన్సుల పరంగా ఇబ్బందులు తలెత్తడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గుగనుల సంస్థ వెల్లడించింది. రూ.

08/16/2019 - 04:20

న్యూఢిల్లీ, ఆగస్టు 15: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో ఈశాన్య రాష్ట్రాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల కాలానికి సంబంధించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. అత్యధిక తయారీ వ్యవస్థతో కూడిన పలు ప్రముఖ రాష్ట్రాల జీఎస్‌టీ వసూళ్ల వృద్ధితో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలదే పైచేయిగా ఉంది.

08/16/2019 - 04:18

న్యూఢిల్లీ, ఆగస్టు 15: జీవిత బీమా సంస్థలకు కొత్త ప్రీమియం ద్వారా గడచిన జూలై నెల ఆదాయం 6 శాతం పెరిగింది. ఆ నెలలో మొత్తం రూ. 21,509.25 కోట్ల ఆదాయం సమకూరిందని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఇక్రా) గణాంకాల మేరకు వెల్లడైంది. దేశంలోని మొత్తం 24 జీవిత బీమా సంస్థలు 2018 జూలైలో రూ. 20,219.26 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది.

08/16/2019 - 05:53

హైదరాబాద్, ఆగస్టు 15: గత ఐదేళ్ల చరిత్రలో సింగరేణి అన్ని విభాగాల్లో పైచేయి సాధించిందని సింగరేణి సీఎండీ శ్రీధర్ అన్నారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవనంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 25.822 కోట్ల టర్నోవర్ సాధించడంతో పాటు రూ. 1766 కోట్ల లాభాలను కూడా ఆర్జించిందన్నారు. మరో ఐదేళ్లలో 50 వేల కోట్ల టర్నోవర్ సాధించి, రూ.

08/15/2019 - 06:47

ముంబయి : టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ తగ్గుముఖం పట్టింది. తాజాగా గడచిన జూలైలో ఈ ద్రవ్యోల్బణ స్థాయి 25 నెలల కనిష్టం 1.08 శాతానికి చేరడం విశేషం. ప్రధానంగా ఆహార వస్తువులు, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు దగ్గడం ద్వారా ఈ ద్రవ్యోల్బణ సరళీకరణ జరిగిందని బుధవారం నాడిక్కడ విడుదలైన ప్రభుత్వ గణాంకాలనుబట్టి తేటతెల్లం అవుతోంది.

Pages