S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/19/2019 - 06:09

విజయవాడ : వినాయక చవితికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ల రేట్లను మూడువారాల ముందు నుంచే అడ్డగోలుగా పెంచేస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. ఏ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఆర్టీసీతో సమాంతరంగా స్టేజీ క్యారియర్‌గా నడిపే అవకాశం లేనప్పటికీ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు సాగిపోతున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడ నుండి బెంగళూరుకు రూ. 900ల నుంచి వెయ్యి రూపాయలు, స్లీపర్ అయితే రూ.

08/19/2019 - 06:00

న్యూఢిల్లీ : దేశీయంగా అనుకూలించే అంశాలేవీ లేకపోవడం వల్ల ఈ వారం స్టాక్ మార్కెట్లు ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్య తీరుతెన్నులపైనే ప్రభావితం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్య స్థిగతులు, విదేశీ పోర్టుపోలియో పెట్టుబడులు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, చమురు, రూపాయి ధరల తీరుతెన్నులపైనే దేశీయ మార్కెట్లు ప్రభావితం కానున్నాయని అంటున్నారు.

08/19/2019 - 05:44

న్యూఢిల్లీ, ఆగస్టు 18: చమురు సహజ వాయుల కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ద్వారా 2040 నాటికి ఉత్పత్తులు దిగుణీకృతం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆ సంస్థ చైర్మన్ శశిశంకర్ ఆదివారం నాడిక్కడ తెలిపారు.
దేశీయంగానూ, విదేశాల్లోనూ ఉన్న సంస్థకు చెందిన క్షేత్రాల రీఫైనింగ్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో కూడిన కొత్త ‘విజన్ డాక్యుమెంట్ 2040’ని రూపొందించడం జరిగిందన్నారు.

08/19/2019 - 01:21

విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తుండటంతో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పైనా పడింది. గత నాలుగు నెలల్లో చూస్తే రెండు నెలలు కనీస నెలవారీ రక్షిత ఆదాయాన్ని రాష్ట్రం పొందలేకపోయింది. ప్రధానంగా ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణించటం, స్టీల్, సిమెంట్, ఎరువుల ధరలు తగ్గడంతో కనీస నెలవారీ నిర్దేశిత రక్షిత ఆదాయ లక్ష్యానికి రాష్ట్రం చేరుకోలేకపోతోంది.

08/18/2019 - 23:53

అహ్మదాబాద్, ఆగస్టు 18: రిజర్వు బ్యాంకు ‘ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్’ (పీసీఏ) నుంచి తమ బ్యాంకు వచ్చే ఏడాదిలోగా బయటపడే అవకాశాలున్నాయని యూకో బ్యాంక్ ఎండీ, సీఈవో అతుల్ కుమార్ గోయెల్ ఆదివారం నాడిక్కడ ధీమా వ్యక్తం చేశారు. అన్ని శాఖా కార్యాలయాల ఉన్నతాధికాలతో జరిగిన సమావేశానంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. 2020 చివరి త్రైమాసికానికల్లా తమ బ్యాంకు లాభాల్లోకి వస్తుందని ఆయన అన్నారు.

08/18/2019 - 23:52

న్యూఢిల్లీ, ఆగస్టు 18: హైబ్రీడ్, సీఎన్‌జీ కార్లకు విద్యుత్ వాహనాలకంటే అధికంగా పన్ను రాయితీలు కల్పించాలని దేశీయంగా అతిపెద్ద కార్ల మార్కెట్ కలిగిన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) కోరుతోంది. అలా జరిగితే దేశంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఎంఎస్‌ఐ చైర్మన్ ఆర్‌సీ భార్గవ ఆదివారం నాడిక్కడ పేర్కొన్నారు.

08/18/2019 - 06:48

భూపాలపల్లి/గణపురం: కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) మొదటి దశను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో సుమారు పది సార్లు వివిధ కారణాలతో ప్లాంటు నిలిచిపోయింది. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో తగ్గడంతో శుక్రవారం కేటీపీపీ అధికారులు ప్లాంటును అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

08/18/2019 - 02:25

తిరుపతి, ఆగస్టు 17: టీటీడీకి రానున్న మూడు నెలల కాలానికి సరఫరా చేసే బియ్యానికి కిలోకు ఒక్క రూపాయి చొప్పున తగ్గించి రూ. 37కే అందించేందుకు అఖిల భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అంగీకరించిందని తిరుమల ప్రత్యేకాధికారి ఎ.వి.్ధర్మారెడ్డి చెప్పారు. శనివారం ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో అఖిల భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఏపీ రైస్ మిల్లర్స్, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

08/17/2019 - 23:15

ముంబయి, ఆగస్టు 17: దీపావళినాటికి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని, 10 గ్రాములు 40 వేల రూపాయలకు చేరుకుంటుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశే్లషకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బంగారం ధర అమాంతం పెరిగిపోవడంతో అసలు ఇది సామాన్యులకు అందుబాటులో ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

08/17/2019 - 23:14

న్యూఢిల్లీ, ఆగస్టు 17: కేఫ్ చైన్ ఆపరేటర్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ తాను చెల్లించవలసిన రుణాల మొత్తం సుమారు రూ. 1,000 కోట్లకు తగ్గుతుందని అంచనా వేసినట్టు శనివారం తెలిపింది. బెంగళూరులోని తన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు అమ్మడం వల్ల సమకూరే విక్రయ ధనాన్ని సర్దుబాటు చేసిన తరువాత తన రుణాల మొత్తం భారీగా తగ్గుతుందని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.

Pages