S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/07/2019 - 22:37

ముంబయి, ఆగస్టు 7: స్వల్ప ఆర్థిక మాంద్య పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేట్లను మరోసారి తగ్గించింది. బేసిక్ పాయింట్స్ (బీపీఎస్) ఏకంగా 35 పాయింట్లు తగ్గడంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఆర్‌బీఐ రెపో రేట్లను తగ్గించడం ఈ ఆర్థిక సంవత్సరం ఇది నాలుగోసారి.

08/07/2019 - 21:27

వాషింగ్టన్, ఆగస్టు 7: హవాయ్‌కు చెందిన 5జీ వౌలిక పరికరాలను వినియోగించుకోవాల్సిందిగా భారత్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని అమెరికన్ కాంగ్రెస్ ప్రముఖుడు జిమ్‌బ్యాంక్స్ ఇక్కడ ఆరోపించారు. అలాగే ఈ విషయంలో అమెరికా వత్తిడులను భారత్ ఖాతరు చేయదన్న విశ్వాసం సైతం చైనా పెద్దలకు ఉందని ఆ అధికారి మంగళవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు.

08/07/2019 - 21:25

ముంబయి, ఆగస్టు 7: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో బుధవారం సెనె్సక్స్ 286.35 పాయింట్లు పతనమైంది. కాశ్మీర్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత వివిధ దేశాల ప్రతిస్పందన భారత స్టాక్ మార్కెట్‌లో ప్రభావం చూపింది. దీనికి తోడు అంతర్జాతీయ సూచీలు కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంతో బీఎస్‌ఈలో సెనె్సక్స్, అదేవిధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ నష్టాలు చవిచూశాయి.

08/07/2019 - 21:23

షాంఘై, ఆగస్టు 7: చైనా మరోసారి బుధవారం తన కరెన్సీ అయిన యువాన్ డెయిలీ రెఫరెన్స్ రేట్‌ను తగ్గించింది. దీంతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే యువాన్ మారకం విలువ మరింత బలహీనపడింది. చైనా, అమెరికా మధ్య కరెన్సీ వివాదం తీవ్రమయిన నేపథ్యంలో చైనా కేంద్ర బ్యాంకు తన కరెన్సీ విలువను తగ్గించింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా బుధవారం అమెరికన్ డాలర్‌తో యువాన్ సెంట్రల్ ప్యారిటి రేట్‌ను 6.9996గా ఖరారు చేసింది.

08/07/2019 - 21:23

ప్రధానంగా వాణిజ్యపరమైన సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలి
అమెరికాలో భారత దౌత్యవేత్త ష్రింగ్లా సూచన
భారత వాణిజ్య మంత్రితో అమెరికా వాణిజ్య ప్రతినిధి భేటీ అవుతారని వెల్లడి

08/07/2019 - 21:22

జేరూసలేం, ఆగస్టు 7: ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి 5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని భారత దేశం బుధవారం అందజేసింది. ఆ ఏజెన్సీ చేపడుతున్న సహాయక చర్యలకు తదుపరి కూడా స్థిరమైన ఆర్థిక సాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చింది.

08/07/2019 - 05:15

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఖర్చులను నియంత్రించే విషయంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఔట్‌సోర్సింగ్’ విధానాన్ని మరింతగా బలోపేతం చేసి విస్తరించాలని, తద్వారా ప్రతిఏటా కనీసం రూ.200 కోట్లు ఆదా చేయాలని భావిస్తోంది.

08/06/2019 - 22:59

ముంబయి, ఆగస్టు 6: బ్యాంకింగ్, వాహన రంగాల స్టాక్స్ లాభాలు పండించడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రధానంగా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణాయ కమిటీ (సీఎంపీ) బుధవారం మరో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విదించే అవకాశాలున్నాయన్న వార్తలు పై రెండు రంగాల వృద్ధిపై మదుపర్లలో నమ్మకం పెరిగింది.

08/06/2019 - 22:57

బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో విద్యార్థులతో సెల్ఫీ దిగుతున్న గూగుల్ సర్చి ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ బెన్ గోమ్స్. వ్యాపార పనుల నిమిత్తం ఆయన బెంగళూరుకు వచ్చారు.

08/06/2019 - 06:16

న్యూఢిల్లీ : బాంబే డైయింగ్ అండ్ మానుఫాక్చురింగ్ కో లిమిటెడ్ సోమవారం నాడిక్కడ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గత జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో రూ. 27.65 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు ఆ కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే కాలానికి ఈ కంపెనీ రూ. 93.70 కోట్ల నష్టాన్ని చూపింది. కాగా కంపెనీ మొత్తం ఆదాయం 64.09 శాతం వృద్ధిచెంది ఈ మూడు నెలల కాలంలో 673.30 కోట్లకు చేరిందని తెలిపింది.

Pages