S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/04/2019 - 04:35

విజయనగరం : రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామంగా విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామాన్ని, తొలి డిజిటల్ జిల్లాగా విజయనగరాన్ని ఎంపిక చేసినట్టు ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వేశన్ చెప్పారు. శనివారం మండలంలోని గుంకలాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంకు రాష్ట్రంలో విజయనగరం జిల్లాను డిజిటల్ జిల్లాగా ఎంపిక చేసిందని వివరించారు.

08/04/2019 - 04:09

భూపాలపల్లి, ఆగస్టు 3: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కేటీకే ఓసీటూ గనిలో గత వారం రోజులుగా భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గత వారంలో ఒక్క రోజు మాత్రమే వెయ్యి టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. మిగిలిన రోజుల్లో భారీ వర్షాలతో యంత్రాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

08/04/2019 - 04:07

హైదరాబాద్, ఆగస్టు 3: దేశీయంగా ఉన్న మినరల్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని జాతీయ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్‌దుబీ తెలిపారు. జాతీయ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్‌లో వాటాదారులు చూపిన ప్రత్యేక శ్రద్ధతో సంస్థకు ప్రతిష్టాత్మకమైన ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో అవార్డు ప్రదానోత్సవం జరిగిందన్నారు.

08/04/2019 - 04:07

హైదరాబాద్, ఆగస్టు 3: లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను ఆదివారం రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ఉన్న యాకుత్‌పురా-ఫలక్‌నుమా రైల్వే ష్టేషన్ల మధ్య వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దీంతో తాత్కాలికంగా ఆదివారం ఈ మార్గంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు వారు తెలిపారు. ఈ మార్గంలో రద్దు చేసిన రైళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి.

08/04/2019 - 04:05

విశాఖపట్నం, ఆగస్టు 3: ఆధునిక వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ, నర్సింగ్ వృత్తి నైపుణ్యం, జియోమోటిక్స్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ వంటి అంశాల్లో ప్రపంచ ఖ్యాతినార్జించిన జర్మనీకి చెందిన యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైనె్సస్ న్యూ బ్రాండెన్ బర్గ్‌తో గీతం డీమ్డ్ యూనివర్శిటీ అవగాహన కుదుర్చుకుంది. గీతంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ, ప్రో వైస్‌ఛాన్స్‌లర్ కె.

08/02/2019 - 23:43

అనంతపురం, ఆగస్టు 2: భారతదేశంలో మొట్టమొదటి సారిగా తయారైన కియా సెల్టోస్ ఎస్‌యూవీ కారు ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద హ్యూందయ్ భాగస్వామ్యంతో ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’ ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ఇండియా(కేఎంఐ) నుంచి నూతన సెల్టోస్ కారు ఈనెల 22న లాంచ్ కానుంది. అత్యంత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా, హూందాతనం ఉట్టి పడే కారు పలు రంగుల్లో అందుబాటులోకి రానుంది.

08/02/2019 - 21:51

ముంబయి, ఆగస్టు 2: వాణిజ్య వారం ముగింపు రోజైన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. బీఎస్‌ఈలోప్రధానంగా వాహన, ఐటీ, ఫైనాన్స్ రంగాల స్టాక్స్ అథికంగా లాభపడ్డాయి. మరోవైపు చైనా వస్తువుల దిగుమతులపై తాజా సుంకాలను అమెరికాప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి.

08/02/2019 - 21:50

న్యూఢిల్లీ, ఆగస్టు 2: కేఫ్ కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ గడచిన నాలుగు రోజుల్లో భారీ నష్టాలపాలయ్యాయి. వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ అదృశ్యమై, కర్నాటకలోని మంగళూరుకు సమీపంలో గల నేత్రావతీ నదీతీరంలో శవమై కనిపించడంతో స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ వాటాలు ఎన్నడూ లేనంతంగా తీవ్ర అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో నాలుగు రోజులుగా కంపెనీ మార్కెట్ విలువ సైతం రూ.

08/02/2019 - 21:46

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ ‘్ఫ్లప్‌కార్ట్’ నిర్వహణలోని ‘్ఫన్‌పే’ మొత్తం 95 బిలియన్ డాలర్ల వార్షిక చెల్లింపుల విలువ (టీపీవీ) రన్ రేటును సాధించినట్టు శుక్రవారం నాడిక్కడ తెలిపింది. కేవలం జూలై నెలలోనే 335 మిలియన్ల లావాదేవీలు ‘్ఫన్‌పే’ ద్వారా జరిగాయని వెల్లడించింది.

08/02/2019 - 21:44

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దిగుమమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువుల సంస్థ ‘టీసీఎల్ ఎలక్ట్రానిక్స్’ శుక్రవారం విజ్ఞప్తి చేసింది. తిరుపతిలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులతో సరికొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Pages