S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/02/2019 - 05:28

న్యూఢిల్లీ : వాణిజ్యపరమైన వైఫల్యాలకు భయపడి ప్రాణత్యాగం లాంటి దౌర్బల్య మనస్తత్వ చర్యలకు దిగడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హితవుపలికారు. కేఫ్ కాఫీడే అధినేత వీజీ సిద్ధార్థ ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆమె ఉదహరించారు. దివాళా, బ్యాంకుల మోసాల నియంత్రణ చట్టం (ఐబీసీ)పై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగించారు.

08/01/2019 - 23:51

పనాజి, ఆగస్టు 1: పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న మహిళలు రాత్రి వేళల్లోనూ పని చేయడానికి వీలు కల్పిస్తున్న ఒక బిల్లును గోవా అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ యాక్ట్‌కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్‌లేకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు.

08/01/2019 - 23:24

ముంబయి, ఆగస్టు 1: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ భారీ నష్టాలపాలై ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. బుధవారం స్వల్పలాభాల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ నష్టాల పరంపరలోకి దిగజారడం ఆందోళనకర పరిణామం.

08/01/2019 - 23:23

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ పదవికి అర్హులైనవారు దరఖాస్తులు పంపాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. విరాల్ ఆచార్య ఆ పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంటోంది. పదవీ కాలం ఇంకా ఆరు నెలలు ఉండగానే విరాల్ ఆచార్య వైదొలిగిన సంగతి తెలిసిందే.

08/01/2019 - 23:22

న్యూఢిల్లీ, ఆగస్టు 1: మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘రెలిగేర్’ మాజీ యజమానులు, సోదరులు మల్వీందర్ మోహన్ సింగ్, శివీందర్ మోహన్ సింగ్, వారి అనుచరులకు చెందిన పలు నివాస స్థలాలు, ఆస్తులపై ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం విస్తృత దాడులు నిర్వహించింది.

08/01/2019 - 05:49

న్యూఢిల్లీ : ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో 1.2 శాతం తగ్గుదల నెలకొంది. గడచిన జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా 360 మిలియన్ యూనిట్ల ఎగుమతులు జరిగింది. ఈక్రమంలో వరుసగా ఏడు త్రైమాసికాలుగా ఈ రవాణాలో తగ్గుదల చోటుచేసుకుందని బుధవారం ఇక్కడ విడుదలైన అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ‘కౌటర్‌పార్ట్’ అధ్యయన నివేదిక వెల్లడించింది.

08/01/2019 - 05:40

హైదరాబాద్, జూలై 31: దేశంలో గణనీయంగా ఆదాయాన్ని సంపాధిస్తున్న రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) జోన్ మరోసారి రికార్డులు సృష్టించింది. జోన్ చరిత్రలో అన్ని విభాగాల్లో పనితీరును మెరుగుపర్చుకుని తన ప్రగతిని చాటుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరం అఖిల భారత స్థాయిలో తన జోన్ పరిధిలో పనితీరును శభాష్ అంటూ ప్రశంసలతో నాలుగు అవార్డులను దక్కించుకుంది.

07/31/2019 - 22:21

ముంబయి, జూలై 31: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో బుధవారంనాడు లావాదేవీలు సానుకూల వాతావరణంలో జరగడంతో సెనె్సక్స్ స్వల్ప లాభాలను ఆర్జించగలిగింది. ఆరంభంలో నష్టాల పరంపర కొనసాగినప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో సెనె్సక్స్ లాభాల బాట పట్టింది. 83.88 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 37,481.12 పాయింట్ల వద్ద ముగిసింది.

07/31/2019 - 22:18

చిత్రం...న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని మార్కెట్‌లో విడుదల చేస్తున్న హువాహై హోల్డింగ్ గ్రూప్ డైరెక్టర్ కేథరిన్ జింగ్, కేఎస్‌ఎల్ క్లీన్‌టెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ధీరజ్ భాగ్‌చంద్ర

07/31/2019 - 22:14

బెల్‌ఫాస్ట్, జూలై 31: బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక వర్గాల మల్లగుల్లాలు పడుతున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, నార్తర్న్ ఐర్లాండ్ నేతలతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. యూ రోపియన్ యూనియన్ నుంచి వైదొలగుతామన్న ఐరిస్ నాయకులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జాన్సన్ బెల్‌ఫాస్ట్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Pages