S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/31/2019 - 22:12

న్యూఢిల్లీ, జూలై 31: అపోలో టైర్స్ నికర లాభాల్లో తాజాత్రైమాసికంలో 43.77 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. గత జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు రూ.141.6 కోట్లకు తగ్గాయని ఆ కంపెనీ పేర్కొంది. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 251.84 కోట్ల రూపాయల నికర లాభం సమకూరిందని వివరించింది. అలాగే మొత్తం ఆదాయంలో మాత్రం స్వల్పంగా వృద్ధి చోటుచేసుకుని రూ. 4,356.78 కోట్లకు పెరిగిందని కంపెనీ వివరించింది.

07/31/2019 - 05:38

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పూరీకి చెందిన సుమారు రూ. 254 కోట్ల విలువైన బినామీ వాటాలను సోమవారం నాడు ఆదాయ పన్నుల శాఖ అటాచ్ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ (చాపర్) కుంభకోణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి డొల్ల కంపెనీ ద్వారా ఆ సొమ్ము వాటాల రూపంలో రతుల్‌పూరీకి అందినట్టు ఆరోపణలున్నాయి.

07/30/2019 - 23:37

న్యూఢిల్లీ, జూలై 30: కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన వాటాలు మంగళవారం 20 శాతం నష్టపోయాయి. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 813 కోట్లకు చేరింది. ఆ కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలోని ఆ కంపెనీ వాటాలపై ప్రభా వం పడింది. ఈ వాటాలు మొత్తం 19.99 శాతం నష్టపోయి ఒక్కో వాటా విలువ రూ.154.05కు చేరింది.

07/30/2019 - 23:35

ముంబయి, జూలై 30: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలతో కుదేలవుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, వాహన, విద్యుత్ రంగ స్టాక్స్‌లో భారీగా అమ్మకాల వత్తిడి నెలకొనడంతో మంగళవారం సూచీలు పెద్దమొత్తాల్లో నష్టాలను నమోదు చేశాయి. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడం, మోటారు వాహన రంగంలో ఒడిదుడుకులు ప్రధానంగా మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని విశే్లషకులు పేర్కొంటున్నారు.

07/30/2019 - 23:09

సత్యవేడు, జూలై 30: తైవాన్ దేశానికి చెందిన సీఎన్‌సీ మెషీన్ టూల్స్ తయారీ రంగానికి చెందిన 14 మంది వ్యాపారవేత్తల ప్రతినిధుల బృందం టీజేఆర్ ప్రెషిషన్ టెక్నాలజీ సీఈఓ చెన్‌ఇంగ్‌షూ నేతృత్వంలో శ్రీసిటీలో మంగళవారం పర్యటించారు. వీరికి ఫౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం స్వాగతం పలుకగా శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ పారిశ్రామిక ప్రగతి, వౌళిక వసతుల ప్రత్యేకతలను వివరించారు.

07/30/2019 - 23:05

విజయవాడ, జూలై 30: రాష్ట్రంలో విమాన సర్వీసులు గణనీయంగా తగ్గిపోతున్నాయని దీని వలన పెట్టుబడిదారులు వెనక్కిపోయే ప్రమాదం ఉందంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

07/30/2019 - 04:17

న్యూఢిల్లీ : పేద, మధ్యతరగతి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి సొమ్ములు కూడబెడుతున్న గొలుసు స్కీంలకు(పోంజీ పథకాలు) కేంద్రం చెక్‌పెట్టింది. అలాంటి పథకాలను నిషేధిస్తూ తీసుకొచ్చిన ‘అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ బిల్లు-2019’ను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

07/30/2019 - 04:14

న్యూఢిల్లీ : దేశంలోని 65 నగరాల్లో నడిపేందుకు 5,645 విద్యుత్ బస్సులను కేంద్ర విద్యుత్ వాహనాల విభాగం ఇంటర్ మినీస్టీరియల్ కమిటీ మంజూరు చేసిందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ సోమవారం నాడిక్కడ తెలిపారు. వాతావరణ కాలుష్య నివారణకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.

07/30/2019 - 04:29

అమరావతి, జూలై 29: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పరస్పర వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు జపాన్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరా ఉచియామా సామవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు.

07/29/2019 - 23:22

న్యూఢిల్లీ, జూలై 29: సంప్రదాయేతర ఇంధనం (పునరుర్పాదక విద్యుత్)ను అతి స్వల్ప ధరలకే అందించడంలో ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ మార్కెట్ అగ్రగామిగా నిలిచిందని సోమవారం నాడిక్కడ విడుదలైన అంతర్జాతీయ పరిశోధన, కన్సల్టెన్సీ సంస్థ ‘ఉడ్ మెకెన్జీ’ అధ్యయన నివేదిక వెల్లడించింది.

Pages