S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/29/2019 - 23:20

న్యూఢిల్లీ, జూలై 29: ‘వొడాఫోన్ ఐడియా’ లిమిటెడ్ వాటాలు సోమవారం 27 శాతం పతనమయ్యాయి. కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటంతో మదుపర్లు ఆసక్తి చూపకపోవడంతోబాటు ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 7,126 కోట్లకు తగ్గిపోవడం సోమవారం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బీఎస్‌ఈలో ఈ సంయుక్త కంపెనీ వాటా ధర 26.81 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 6.75కు చేరింది.

07/29/2019 - 23:19

ముంబయి, జూలై 29: గత వాణిజ్య వారం ముగింపు రోజైన శుక్రవారం కొంత ఊపిరిపోసుకు న్న దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ వారారంభ రోజైన సోమవారం నష్టాల బాటలోకి మళ్లాయి. దీం తో రెండు నెలల క్రితంనాటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆసియా దేశాల మార్కెట్ల నుంచి విదేశీ నిధులు భారీగా వెనక్కు వెళుతుండటం దేశీయం గా మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభా వం చూపిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

07/29/2019 - 03:40

లక్నో : భారత్ అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గం ఉత్తర్‌ప్రదేశ్ మీదుగా వెళ్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఇక్కడ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ద్వారా దేశం తన లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రూ.

07/29/2019 - 01:56

న్యూఢిల్లీ : దిగ్గజ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అమెరికన్ ఫెడరేషన్ పన్ను రేట్ల కోత నిర్ణయం వంటి అంశాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వాణిజ్య రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. గత వాణిజ్య వారం చివరి రోజైన శుక్రవారం నాడు ఎట్టకేలకు ఆరు రోజుల నష్టాలను అధిగమించిన సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

07/29/2019 - 01:54

న్యూఢిల్లీ, జూలై 28: జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) ‘సెక్యూరిటీ కన్‌స్ట్రెయిన్డ్ ఎకనమిక్ డిస్పాచ్’ (ఎస్‌సీఈడీ) విధానం ద్వారా ప్రాధాన్యతా ప్రాతిపదికన తక్కువ ధరలకే చేస్తున్న విద్యుత్ సరఫరాతో పలు డిస్కంలు లబ్ధిపొందుతున్నాయి. ఎస్‌సీఈడీ విధానం దాదాపు ఏడాది క్రితం అమలులోకి వచ్చింది.

07/29/2019 - 01:53

న్యూఢిల్లీ, జూలై 28: సుమారు ఐదు నెలలపాటు దేశీయ స్టాక్ మార్కెట్లలో వాటాలు కొనుగోళ్లు చేసిన విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈనెలలో పూర్తి విరుద్ధ వైఖరిని అవలంభిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 3,758 కోట్ల రూపాయలు దేశీయ కేపిటల్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు వివిధ కారణాలతో ఉపసంహరించుకోవడం జరిగింది.

07/29/2019 - 01:52

బెల్జియం సర్కారు అనుసరిస్తున్న విధానాల వల్ల బీఫ్ పరిశ్రమ దారుణంగా దెబ్బతింటున్నదని, వ్యవసాయ వ్యయం అనూహ్యంగా పెరిగి, రైతులు నష్టాలపాలవుతున్నారని విమర్శిస్తూ లిబ్రావౌంట్‌లో దర్శనమిస్తున్న బ్యానర్లు. దేశ వ్యాప్తంగా రైతులు, వ్యాపారులు చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సత్వర చర్యలు తీసుకోకపోతే బెల్జియం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరిస్తున్నారు.

07/28/2019 - 04:16

అహమ్మదాబాద్ : విద్యుత్ వాహనాలు (ఎలక్ట్రిక్ వెహికల్స్), వాటి అనుబంధ ఉపకరణాలైన బ్యాటరీలు వంటి వాటి వినియోగం ద్వారా స్వచ్ఛ నగరాలుగా తీర్చిదిద్దడంతోపాటు ఆయిల్ దిగుమతులు తగ్గించడం, సోలార్ పవర్‌ను వినియోగించుకునేందుకు భారత్ కార్యాచరణను చేపట్టిందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ అన్నారు. శనివారంనాడు ఇక్కడ జరిగిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.

07/28/2019 - 04:13

గాజువాక, జూలై 27: దేశీయ స్థూల ఉత్పత్తిలో ఔషధ రంగం పరుగులు పెడుతోందని రాంకీ ఫార్మా ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పీపీ లాల్‌కృష్ణ అన్నారు. విశాఖపట్నం జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కమర్షియల్ హబ్‌లో ‘ఆంధ్రభూమి’తో శనివారం ఆయన మాట్లాడారు. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఔషధ రంగం 13 శాతానికి పెరిగిందన్నారు. భారత ఔషధ రంగంపై గతంలో చైనా దేశం ప్రభావం అధికంగా ఉండేదన్నారు.

07/28/2019 - 04:11

న్యూఢిల్లీ, జూలై 27: కాలుష్య రహిత విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ వాహనాలపై ఇప్పటివరకు ఉన్న 12 శాతం వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)ని ఇకముందు 5 శాతంగా వసూలు చేయనుంది. విద్యుత్ వాహనాలపై తగ్గించిన పన్నుపై జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.

Pages