S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/28/2019 - 04:08

భూపాలపల్లి, జూలై 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓసీ గనుల్లో భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఓసీ పని స్థలాల్లో వర్షపు నీరు నిలువడంతో యంత్రాలు నడిచే పరిస్థితి లేక ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. శనివారం కూడా వర్షం ఉండడంతో సుమారు 7వేల టన్నులకు పైగా బొగ్గు రవాణాకు ఆటంకం కలిగింది.

07/28/2019 - 03:59

విజయవాడ(సిటీ), జూలై 27: జిల్లా వ్యాప్తంగా రబీ పంటకాలంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలు మరో 15 రోజులపాటు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ధాన్యాన్ని రైతుల నుండి సేకరిస్తున్నట్లు తెలిపారు. 2018- 19 పంట కాలంలో ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 181 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

07/26/2019 - 23:52

హైదరాబాద్, జూలై 26: బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగులకు బోనస్ ఇవ్వబోతున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ శ్రీ్ధర్ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవనంలో ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పాటు అమ్మకాలు, రవాణాలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి కార్మికులు చేసిన కృషిని ఆయన కొనియాడారు.

07/26/2019 - 23:07

ముంబయి, జూలై 26: ఎట్టకేలకు వాణిజ్య వారం ముగింపురోజైన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట నుంచి బయటకు వచ్చాయి. సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. కొన్ని ఎంపిక చేసిన ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకుల స్టాక్స్ మంచి లాభాలను అందుకోవడంతో ఆరు రోజులపాటు వరుస నష్టాలతో సతమతమైన సూచీలు కోలుకున్నాయి.

07/26/2019 - 23:06

న్యూఢిల్లీ, జూలై 26: బజాజ్ ఫైనాన్స్ వాటాలు శుక్రవారం 7 శాతం అదనంగా లాభపడ్డాయి. ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో ఇదివరకెన్నడూ లేనంత అధిక స్థాయి నికర లాభాన్ని నమోదు చేయడమే ఇందుకు కారణం. జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి సంబంధించిన ఫలితాలు వెలువడిన వెంటనే వాటాలకు ఊపువచ్చింది. 7.20 శాతం లాభపడిన ఈ వాటాలు బీఎస్‌ఈలో ఒక్కోవాటా రూ. 3,266.65 వంతున ట్రేడయ్యాయి.

07/26/2019 - 23:04

ముంబయి, జూలై 26: జాతీయ పెట్టుబడులు, వౌలిక వసతుల నిధి (ఎన్‌ఐఐఎఫ్) ద్వారా తాజా రౌండ్‌లో మరో బిలియన్ డాలర్లు అదనంగా సమీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నిధులను విదేశీ పెట్టుబడిదారుల నుంచి సమీకరించాలని నిర్ణయించినట్టు ఎన్‌ఐఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకాష్ రావు శుక్రవారం నాడిక్కడ తెలిపారు. వౌలిక వసతులతోబాటు ఇతర కీలక రంగాలకు పెట్టుబడులు సమీకరించడంలో ఎన్‌ఐఐఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

07/26/2019 - 23:03

ఇస్లామాబాద్, జూలై 26: దాదాపు 36 మిలియన్ డాలర్ల విలువైన యాంటీ ర్యాబీస్, యాంటీ వెనోమ్ (విష విరుగుడు) వ్యాక్సిన్లను పాకిస్తాన్ భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. దేశానికి అవసరమైన మేర ఈ వ్యాక్సిన్లను తయారీ చేసే సామర్థ్యం స్థానికంగా లేకపోవడం వల్లే పాకిస్తాన్ ఈ వ్యాక్సిన్ల కోసం భారత్‌పై ఆధారపడాల్సి వచ్చిందని శుక్రవారం ఇక్కడ వెలువడిన జాతీయ వార్తాపత్రిక కధనాన్నిబట్టి తెలిసింది.

07/26/2019 - 22:50

విజయవాడ, జూలై 26: గత ఐదేళ్ల పాలనలో ఐటీ రంగానికి ఎంతో అనువైన విశాఖ నగరాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు అణగదొక్కారని శాసనసభలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రులు సమాధానమిచ్చారు.

07/26/2019 - 21:55

న్యూఢిల్లీ, జూలై 26: కంపెనీల చట్టం సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. డొల్ల కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైన అన్ని అంశాలను ఈ సవరణ బిల్లులో చేర్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అదే విధంగా కార్పొరేట్ రంగ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)ను కఠిన తరంగా అమలు చేసేలా ఈ సవరణలో కొన్ని అంశాలను చేర్చడం జరిగిందన్నారు.

07/26/2019 - 04:21

న్యూఢిల్లీ : విద్యుత్ వాహనాలపై పన్ను రేటును తగ్గించేందుకు గురువారం జరగాల్సిన వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం వాయిదాపడింది. 36వ జీఎస్‌టీ మండలి సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగాల్సిఉండగా ఇందులో కేవలం ఒకే అంశాన్ని పొందుపరిచారు.

Pages