S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/26/2019 - 01:00

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విడిగా పన్ను రాయితీలు ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

07/25/2019 - 23:03

ముంబయి, జూలై 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరోరోజైన గురువారం సైతం నష్టాలను చవిచూశాయి. సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. జూలై డెరివేటివ్ కాంట్రాక్టుల గడువుముగిసిపోతున్న దృష్ట్యా మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంభించారు. దీంతో బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 16.67 పాయింట్లు కోల్పోయి 0.04 శాతం నష్టాలతో 37,830.98 పాయింట్ల దిగువన స్థిరపడింది.

07/25/2019 - 23:01

ముంబయి, జూలై 25: బ్యాంకుల మోసాలు, దివాళా నియంత్రణ చట్టం (ఐబీసీ)కి తలపెట్టిన ఏడు సవరణలు భవిష్యత్‌లో మంచి ఫలితాలిచ్చే అవకాశాలున్నాయని గురువారం నాడిక్కడ విడుదల చేసిన అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి బ్యాంకులు రుణాలు తీసుకున్న వారిపై మరింతగా అధికారాలను చెలాయించేందుకు దోహదం కలుగుతుందని తెలిపింది.

07/25/2019 - 23:00

ముంబయి, జూలై 25: ప్రభుత్వ రంగ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) నుంచి కొనుగోలు చేసే ఆస్తులపై ప్రభుత్వం పాక్షిక రుణ హామీ ఇవ్వడం నిధులకు సంబంధించిన ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగజేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘్ఫట్చ్’ అధ్యయన నివేదిక తెలిపింది. ఐతే ఈ ఉపశమనం కేవలం స్వల్పకాలానికే పరిమితం అవుతుందని తేల్చింది.

07/25/2019 - 04:26

ముంబయి : అంతర్జాతీయ సూచికలు ప్రతికూల ధోరణులను ప్రదర్శించడంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ బుధవారం నష్టాల్లో ముగిసింది. ఉదయం లావాదేవీలు ప్రారంభమైన వెంటనే ఆరంభమైన మొదటి గంటలో సెనె్సక్స్ 38,125 పాయింట్లకు పెరిగింది. అయితే, అంతర్జాతీయ సూచీలతోపాటు దేశీయ మదుపరుల నిరాసక్తత కూడా జతకట్టడంతో మధ్యాహ్నం నాటికి సుమారుగా 37,650 పాయింట్ల వరకు పడిపోయింది.

07/25/2019 - 01:52

విజయవాడ (క్రైం), జూలై 24: ఇక మళ్లీ అర్ధరాత్రి సందడి కానరానుంది. కమిషనరేట్ పరిధిలో నైట్‌లైఫ్‌కు మళ్లీ తెర లేచింది. హోటళ్ళు, రెస్టారెంట్లు యధావిధిగా తెల్లవారేవరకు కొనసాగనున్నాయి. అయితే భద్రతా ప్రమాణాలు పాటిస్తే చాలు. నైట్ విక్రయాలు చేసుకోవచ్చని ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. క్షేత్ర స్ధాయిలో పోలీసు అనుమతి ఉండాల్సిందే.

07/25/2019 - 00:56

హైదరాబాద్, జూలై 24: పారిశ్రామికంగా బలమైన రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ దిశగా విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికను ఇచ్చే బాధ్యతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి అప్పగించనున్నారు.

07/24/2019 - 23:22

న్యూఢిల్లీ, జూలై 24: వాహన తయారీ పరిశ్రమ మొత్తానికి ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని, ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని అందరికీ 18 శాతంగా నిర్థారించాలని ‘జాతీయ వాహన విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) బుధవారం నాడిక్కడ ప్రభుత్వాన్ని కోరింది.

07/24/2019 - 23:21

న్యూఢిల్లీ, జూలై 24: కరూర్ వైశ్యా బ్యాంకు త్రైమాసిక లాభాల్లో 59 శాతం వృద్ధి నమోదైంది. గత జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను ఆ బ్యాంకు బుధవారం నాడిక్కడ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. రూ. 72.92 కోట్ల నికర లాభాలు వచ్చిందని ఆ బ్యాంకు తెలిపింది.

07/24/2019 - 23:20

న్యూఢిల్లీ, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలోని విద్యుదుత్పాదక పరిశ్రమ (జన్‌కో)లకు సరికొత్త ‘భద్రతా నిధి చెల్లింపుల’ విధానం వర్తించదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ బుధవారం నాడిక్కడ స్పష్టం చేసింది. ఈ విధానంలో డిస్ట్రిబూషన్ కంపెనీలు విద్యుదుత్పాక పరిశ్రమలకు ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ కింద ముందస్తుగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

Pages