S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/24/2019 - 23:19

న్యూఢిల్లీ, జూలై 24: సెబీలో నమోదైన 254 స్టార్టప్ కంపెనీలకు 1,700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఆల్టర్‌నేటివ్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్), కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) సంయుక్తంగా ఈ పెట్టుబడులను అందించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

07/24/2019 - 04:32

న్యూఢిల్లీ : పరోక్ష పన్నులకు సంబంధించిన అప్పీళ్లపై అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య 61 శాతం తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం రాజ్యసభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు.

07/24/2019 - 04:26

విశాఖపట్నం, జూలై 23: అటవీ ఉత్పత్తులకు విశేష ఆదరణ తెచ్చిపెడుతున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇపుడు సరికొత్త పంథాను అనుసరిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగించడంపైనే వ్యక్తిగత శ్రద్ధ చూపుతున్న మానవాళి ఇపుడు సహజ సిద్ధమైన చిరుధాన్యాలవైపు చూస్తోంది. దీనిని జీసీసీ అవకాశంగా చేసుకుంటోంది. ప్రతిఒక్కరూ కోరుకునే చిరుధాన్యాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

07/24/2019 - 04:13

రేణిగుంట, జూలై 23: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియా దేశానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు యత్నిస్తున్నామని మలేషియా బృందం వెల్లడించింది. మంగళవారం మలేషియా బృందం శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో విమానాశ్రయ అధికారులతో మలేషియాకు విమాన సర్వీసులు నడిపే విషయమై సమావేశం నిర్వహించారు.

07/23/2019 - 23:10

న్యూఢిల్లీ, జూలై 23: ఉన్నత విద్యనభ్యసించేందుకు వివిధ విశ్వ విద్యాలయాల్లో చేరే విద్యార్థులు ఆ విశ్వ విద్యాలయాలకు గుర్తింపు ఉందా? లేదా? అవి నకిలీవా? అనే అప్రమత్తతో అడుగు వేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. దేశంలో 23 యూనివర్సిటీలు నకిలీవి అని, వాటికి తమ గుర్తింపు లేదని యూజీసీ మంగళవారం ప్రకటించింది.

07/23/2019 - 22:38

ముంబయి, జూలై 23: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజైన మంగళవారం సైతం సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల బలహీన త్రైమాసిక ఫలితాలతో ఫైనాన్షియల్ స్టాక్స్ పెద్దమొత్తాల్లో నష్టపోయాయి. తొలుత మెరుగైన లాభాలతోనే ఆరంభమైన బీఎస్‌సీ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనై నష్టాల్లోకి జారుకుంది.

07/23/2019 - 22:36

న్యూఢిల్లీ, జూలై 23: గొప్ప పరిశోధనాత్మక ఆవిష్కరణల ఆర్థిక శక్తుల్లో (దేశాల్లో) ఒకటిగా మనదేశం మరింతగా ఎదుగుతుందని, అంతర్జాతీయ సూచీల్లో తన ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకుంటుందని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ (డీపీఐఐటీ) కార్యదర్శి రమేష్ అభిషేక్ మంగళవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశా రు.

07/23/2019 - 22:35

న్యూఢిల్లీ, జూలై 23: నిద్రలేమితో బాధపడే వారికి చేసే వైద్య చికిత్సలో వినియోగించే జనరిక్ ఔషధ విలువలు కలిగిన సరికొత్త మాత్రలను ఔషధ దిగ్గజ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మంగళవారం అమెరికన్ మార్కెట్లో విడుదల చేసింది. ‘ఎస్‌టీఆర్ 8 ఎంజెన్త్’ పేరిట రూపొందిన ఈ 8 ఎంజీ టాబ్లెట్లకు అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆమోదం లభించిందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో రెడ్డీస్ ల్యాబ్స్ పేర్కొంది.

07/23/2019 - 05:00

న్యూఢిల్లీ : దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గడచిన త్రైమాసికంలో గృహ నిర్మాణ రంగంలో విక్రయాలు 11 శాతం తగ్గాయి. అయితే దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఎలావున్నా హైదరాబాద్ నగరంలో మాత్రం ఈ విక్రయాల్లో 10 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొమ్మిది నగరాల్లో మొత్తం 72వేల యూనిట్లు (వివిధ స్ధాయిల్లో నిర్మించిన గృహాలు) మాత్రమే అమ్ముడయ్యాయి.

07/23/2019 - 02:05

మచిలీపట్నం, జూలై 22: ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రేషన్ డీలర్ల తొలగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధత వీడింది. గడిచిన నెల రోజులుగా ఆందోళనకు గురవుతున్న డీలర్లు అసెంబ్లీ సాక్షిగా సంబంధిత శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చేసిన ప్రకటన ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనుంది.

Pages