S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/22/2019 - 23:33

న్యూయార్క్, జూలై 22: భారత ప్రభుత్వం చేపడుతున్న జీఎస్టీ వంటి వ్యవస్థీకృత సంస్కరణల వల్ల ఆర్థిక వృద్ధిరేటు ఇనుమడిస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 8 శాతానికి పైగా ప్రగతి రథం పరుగులు పెడుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ అన్నారు.

07/22/2019 - 23:06

ముంబయి, జూలై 22: దేశీయ సాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజైన సోమవారం సైతం పెద్ద మొత్తాల్లో నషాలపాలయ్యాయి. సెనె్సక్స్ రెండు నెలల కనిష్ట స్థాయికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, శీఘ్ర విక్రయ వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ) సాక్స్ తీవ్ర నష్టాలను చవిచూడటంతోబాటు, అంతర్జాతీయ ప్రతికూలతలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగాప్రభావితం చేశాయని విశే్లషకులు అంచనా వేశారు.

07/22/2019 - 22:59

ముంబయి, జూలై 22: వివిధ రకాల చెల్లింపులు నిర్వహిస్తున్న పేమెంట్ బ్యాంకులకు భవిష్యత్ ఆశాజనకంగా లేదు. ఈ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా నిధులు జొప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నానికి రెగులేటరీ సైతం అవసరమన్న విషయాన్ని గుర్తించాలని సోమవారం నాడిక్కడ విడుదలైన ఎస్‌బీఐకి చెందిన వాణిజ్య నిపుణుడి అధ్యయన నివేదిక పేర్కొంది.

07/22/2019 - 03:55

శ్రీకాకుళం : ఫైబర్‌నెట్ డేటా స్పీడ్‌లో ఎటువంటి సందేహం అవసరం లేదు. సగటున 14 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్, 6 ఎంమీపీఎస్ అప్లోడ్ స్పీడ్‌తో లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్‌ను పొందవచ్చునంటూ ప్రభుత్వం ప్రకటించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న వారంతా ఎంతో ఆశతో ఎదురుచూసి ఆ సైబర్నెట్ సేవలు కస్టమర్లకు అందించేందుకు జిల్లా అంతటా నాలుగు లక్షల మంది ఆపరేటర్లు ముందుకు వచ్చారు.

07/22/2019 - 02:09

న్యూఢిల్లీ, జూలై 21: ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తొలి 50 రోజుల్లోనే రానున్న ఐదేళ్ల కాలంలో దేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో వృద్ధిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

07/22/2019 - 03:59

విశాఖపట్నం : విద్యావంతులైన పేద, మధ్యతరగతి గిరిజన యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది త్వరలో అమల్లోకి రానుంది. ఫ్రాంచైజ్ ఔట్‌లెట్లను నిర్వహించేందుకు సంస్థ యాజమాన్యం వీరికి అవకాశం కల్పించనుంది. వీటిద్వారా గిరిజన యువతను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమిస్తుంది.

07/21/2019 - 23:16

న్యూఢిల్లీ, జూలై 21: ప్రభుత్వ రంగంలోని హెలికాప్టర్ సేవల సంస్థ ‘పవన్ హాన్స్’ను ప్రైవేటీకరించేందుకు గత ఏడాది చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో చివరికి కేంద్ర ప్రభుత్వం నిబంధనల సడలింపుచర్యలకు ఉపక్రమించింది. ఇందులోప్రధానంగా ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం, ఆస్తుల విక్రయం, పన్ను విధానానికి సంబంధించిన అంశాలను బిడ్డర్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

07/21/2019 - 23:14

న్యూఢిల్లీ, జూలై 21: ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను నిర్దేశించనున్నాయని మార్కెట్ విశే్లషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా హెచ్‌యూఎల్, మారుతి సుజుకీ, కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ల ఫలితాలు మార్కెట్‌ను అధికంగా ప్రభావితం చేస్తాయంటున్నారు. మొత్తం వాణిజ్య సెంటిమెంటు ప్రస్తుతం బలహీనంగా ఉంది.

07/21/2019 - 23:13

న్యూఢిల్లీ, జూలై 21: రైల్వే శాఖ, దాని ప్రయాణికుల నుంచి ‘జాతీయ రవాణా, పర్యాటక బీమా పథకం’ ద్వారా ప్రైవేటు బీమా సంస్థలు గత రెండేళ్ల కాలంలో రూ. 46 కోట్ల రూపాయలు పాలసీ ప్రీమియంల ద్వారా ఆర్జించాయి. ఐతే ఈ కాలంలో కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే క్లెయిమ్‌ల ద్వారా ఆ కంపెనీలు బాధితులు లేదా వారి కుటుంబాలకు చెల్లించడం జరిగింది.

07/21/2019 - 23:11

న్యూఢిల్లీ, జూలై 21: దేశంలో 345కు పైగా వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అధిక నిర్వహణ ఖర్చు అంచనాలతో సతమతమవుతున్నాయి. ఈ కంపెనీలు ఒక్కొక్కటి సుమారు రూ. 150 కోట్ల చేసేవికాగా మొత్తం రూ. 3.28 లక్షల కోట్ల అదనపుఖర్చు అంచనాల భారాన్ని అవి నమోదు చేశాయి. ఈ పరిస్థితికి ప్రధానంగా కొనుగోళ్లలో జాప్యం తదితరాలను ఆ ప్రాజెక్టుల ఏజెన్సీలు చూపుతున్నాయి. మొత్తం 1453 ప్రాజెక్టుల ఏర్పాటుకు వాస్తవ ఖర్చు అంచనాలు రూ.

Pages