S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/19/2019 - 02:07

విజయవాడ, జూలై 18: మత్స్యకారులకు మార్కెట్ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించేలా చేపల మార్కెట్లలో ఫిష్ మార్కెట్ ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఏర్పాటు చేసి ట్యాబ్‌లు అందజేస్తున్నామని కొచ్చిన్‌కి చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సైంటిస్ట్ డా. శ్యాం సలీం తెలిపారు.

07/18/2019 - 23:22

న్యూఢిల్లీలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న గో ఎయిర్ వైస్ ప్రెసిడెంట్స్ (ఎడమ నుంచి కుడికి) సమీర్ పటేల్ (నెట్‌వర్క్ ప్లానింగ్), అర్జున్ దాస్‌గుప్తా (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్), షబ్నమ్ సయాద్ (మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్), హెచ్‌ఎస్ బాసిన్ (ఎయిర్‌పోర్ట్స్). గల్ఫ్ ప్రాంతానికి మరో ఐదు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు వారు ప్రకటించారు.

07/18/2019 - 23:18

ముంబయి, జూలై 18: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. హెవీవెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటాకనె్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీవ్ర స్థాయిలో వాటాల విక్రయ వత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌సీ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 318.18 పాయింట్లు కోల్పోయి 0.81 శాతం నష్టాలతో 38,897.46 పాయింట్ల దిగువన స్థిరపడింది.

07/18/2019 - 23:06

ముంబయి, జూలై 17: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో బుధవారం వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగాయి. అటు భారీ లాభాలు గానీ, ఇటు భారీ నష్టాలు గానీ లేకుండా ట్రేడింగ్ కొనసాగింది. చివరికి సెనె్సక్స్ 84.60 పాయింట్లు పెరిగి 39,215.64 పాయింట్లకు చేరింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని విశే్లషకులు ఊహించారు. అయితే, ప్రారంభంలో వివిధ కంపెనీల షేర్లు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపారు.

07/18/2019 - 23:02

న్యూఢిల్లీ, జూలై 17: రిటైల్ రంగంలో విదేశీ కంపెనీలకు చెందిన బ్రాండ్‌లను ప్రోత్సహించాలన్న ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌గోయల్ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో రిటైల్ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. రిటైల్ రంగాన్ని సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని భావిస్తున్నామనీ..

07/18/2019 - 23:00

న్యూఢిల్లీ, జూలై 17: దేశీయంగా చమురు, సహజ వాయుల ఉత్పత్తులను పెంచుకోవాలన్న మనదేశ అంచనాలు సత్ఫలితాలివ్వకపోవడంతో తాజాగా కొన్ని మార్పులతో చేపట్టిన టెండరు విధానం అంతర్జాతీయంగాప్రభావితం చేసే అవకాశాలున్నాయని సహజ వనరుల సంప్రదింపుల సంస్ధ ‘వుడ్ మెకన్జీ’ నివేదిక బుధవారం నాడిక్కడ పేర్కొంది.

07/17/2019 - 04:43

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో వాణిజ్య బ్యాంకుల మొండి రుణ బకాయిలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. గతంలో రూ. 9.34 లక్షల కోట్లు ఉన్న ఈ బకాయిల్లో గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1.02 లక్షల కోట్ల మేర తగ్గాయని ఆమె వివరించారు.

07/17/2019 - 04:02

న్యూఢిల్లీ, జూలై 16: ప్రజలు మంచి సేవలు కావాలనుకుంటే పన్ను (టోల్) చెల్లించాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవని, అందువల్ల టోల్ వ్యవస్థ కొనసాగుతుందని ఆయన తెలిపారు. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల కోసం డిమాండ్లపై లోక్‌సభలో జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయం తెలిపారు.

07/16/2019 - 22:05

ముంబయి, జూలై 16: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్ బ్యాంకు, లార్సన్ అండ్ టర్బో, ఇన్ఫోసిస్ లాభాల పంటతో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో వరుసగా రెండో రోజైన మంగళవారం సూచీలు లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌సీలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 234 పాయింట్ల ఆధిక్యతతో 39,131.04 పాయింట్ల గరిష్ట స్ధాయిలో స్థిరపడింది.

07/16/2019 - 22:03

న్యూఢిల్లీ, జూలై 16: చైనా, వియత్నాం, కొరియాల నుంచి దిగుమతి అవుతున్న అల్యూమినియం, జింక్ పూతకలిగిన వస్తువులపై ‘యాంటీ డంపింగ్ డ్యూటీ’ పేరిట ప్రత్యేక సుంకాన్ని ప్రతి టన్నుకు 199 డాలర్ల మేర విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Pages