S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/02/2019 - 01:12

న్యూఢిల్లీ: గోధుమ నిల్వలు క్రమం తప్పకుండా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ, మే మాసం నాటి అత్యధిక నిల్వలు తరిగిపోతున్నాయి. గత ఏడాది మార్చిలో 13.2 మిలియన్ టన్నులుగా ఉన్న గోధుమ నిల్వలు ఏప్రిల్ మాసానికి 35.3 మిలియన్ టన్నులకు పెరిగాయి. మే మాసంలో గరిష్టంగా 43.8 మిలియన్ టన్నులకు చేరాయి.

05/01/2019 - 23:23

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.8
వెండి
8 గ్రాములు: రూ. 320.00

05/01/2019 - 23:22

న్యూఢిల్లీ, మే 1: తేయాకు ఎగుమతులు దగ్గడం అటు ఉత్పత్తిదారులను, ఇటు వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తున్నది. గత ఏడాది ఫిబ్రవరి మాసంలో 2.87 కోట్ల కిలోల తేయాకును భారత్ వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. మార్చి మాసంలో 2.50 కోట్ల కిలోలను ఎగుమతి చేసింది. అయితే, ఎగుమతులు తగ్గి, ఏప్రిల్‌లో 1.44 కోట్ల కిలోలు, మేలో 1.43 కోట్ల కిలోలుగా నమోదైంది. జూన్ నుంచి ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి.

05/01/2019 - 23:21

న్యూఢిల్లీ, మే 1: ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమా వ్యాపారంలో పేరెన్నికగన్న మాక్స్ ఇండియా తన వాణిజ్యాన్ని కొత్తకోణంలో ఆవిష్కరించాలని భావిస్తోంది. ప్రత్యేకించి లైఫ్ ఇన్సూరెన్స్‌తోబాటు స్థిరాస్తి వ్యాపారం, సీనియర్ కేర్, హోటళ్ల రంగం వంటి వాటిలోకి వాణిజ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నట్టు సోమవారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆ కంపెనీ పేర్కొంది.

05/01/2019 - 23:18

న్యూఢిల్లీ, మే 1: కార్పొరేట్ బాండ్స్‌కు డిమాం డ్ తగ్గుతున్నది. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది టర్నోవర్ పతనం స్పష్టంగా కనిపిస్తున్నది. నిధుల సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కార్పొరేట్ సంస్థలు జారీ చేసే ఈ బాండ్స్‌పై ముఖ విలువను నిర్ధిష్ట సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెల్లిస్తుంది. అప్పటి వరకూ, డివిడెండ్లను అందిస్తారు.

04/30/2019 - 23:02

ముంబయి, ఏప్రిల్ 30: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా అనుచిత రుణ పంపిణీల ద్వారా తీవ్ర ఆర్థిక నష్టాలకు గురైన ప్రైవేటు రంగంలోని ఎస్ బ్యాంకు ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. గత మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఎస్ బ్యాంకు రూ. 1,506.64 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

04/30/2019 - 23:00

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బాండ్ల ద్వారా రూ. 3,055.50 కోట్ల మొత్తాన్ని సమీకరించాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) నిర్ణయించింది. వచ్చే మే3వ తేదీన శుక్రవారం ఇందుకు సంబంధించిన బాండ్లను విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానం ద్వారా ఈ బాండ్లను జారీ చేయడం జరుగుతుందని పేర్కొంది.

04/30/2019 - 22:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఎస్ బ్యాంకు వచ్చే 12 నుంచి 18 నెలల కాలంలో లాభాల విషయంలో తీవ్ర వత్తిడిని ఎదుర్కోనుంది. నిరర్థక ఆస్తులకు ఆ బ్యాంకు ప్రాధాన్యతను ఇవ్వడమే ఇందుకు కారణమని అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్’ తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 26న ఈప్రైవేటు బ్యాంక్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి తన నాల్గవ త్రైమాసిక గణాంకాలను విడుదల చేసింది.

04/30/2019 - 22:57

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,125.00
8 గ్రాములు: రూ.25,000.00
10 గ్రాములు: రూ. 31,250.00
100 గ్రాములు: రూ.3,12,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,342.246
8 గ్రాములు: రూ. 26,737.968
10 గ్రాములు: రూ. 33,422.46
100 గ్రాములు: రూ. 3,34,224.6
వెండి
8 గ్రాములు: రూ. 320.00

04/30/2019 - 22:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మనదేశ ముడి ఇనుము (ఉక్కు) ఉత్పత్తిలో గడచిన మార్చి నెలలో దాదాపు ఒక శాతం మేర తగ్గుదల నమోదైంది. ఆ ఏడాది మొత్తం 9,412 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరిగిందని ప్రపంచ ఉక్కు పరిశ్రమల సంఘం నివేదిక వెల్లడించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలంలో దేశీయంగా 9,506 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరిగిందని ఆ నివేదిక పేర్కొంది.

Pages