S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/03/2019 - 02:23

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా బొగ్గు అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున 2019-2020 నాటికి 700 లక్షల టన్నుల బొగ్గును ఉత్పిత్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ అధికారులను ఆదేశించారు. గురువారం సింగరేణి భవన్‌లో బోర్డు డైరెక్టర్లలు, జనరల్ మేనేజర్లుతో సీఎండీ భేటీ అయ్యారు. సీఎండీ శ్రీధర్ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తిలక్ష్యం కోసం ఇప్పటి నుంచే అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

05/03/2019 - 02:16

తిరుపతి, మే 2: సుమారు పదేళ్ల క్రితం భక్తులు హుండీలో సమర్పించిన ఐదు, పది పైసల చెల్లని నాణేల విక్రయానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. దీంతో శ్రీవారికి 24 లక్షల 30 వేల రూపాయలు ఆదాయం లభించనుంది. కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి వచ్చే సామాన్య భక్తులు తాము కూడబెట్టుకున్న ఐదు, పది పైసల నుండి రూపాయ కాయిన్‌ల వరకు హుండీలో సమర్పిస్తున్న విషయం పాఠకులకు విధితమే.

05/02/2019 - 22:17

ముంబయి, మే 2: స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప నష్టాల్లో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 50.12 పాయింట్లు (0.13 శాతం) పతనమై, 38,981.43 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 23.40 పాయింట్లు (0.20 శాతం) తగ్గడంతో 11,724.75 పాయింట్ల వద్ద ముగిసింది.

05/02/2019 - 22:15

న్యూఢిల్లీ, మే 2: తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించలేక, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) ఖాతాలను పరిశీలించి, నిరర్ధక ఆస్తులును ప్రకటించవచ్చని బ్యాంకులకు నేషనల్ లా అపెలైట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. చైర్మన్ జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయతో కూడిన ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ గురువారం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

05/02/2019 - 22:14

న్యూఢిల్లీ, మే 2: బులియన్ మార్కెట్ గురువారం నష్టాల్లో నడిచింది. పది గ్రాముల బంగారం ధర ఏకంగా 250 రూపాయలు తగ్గి, 32,620 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర 825 రూపాయలు పతనం కావడంతో, 37,700 రూపాయలుగా స్థిరపడింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయ బులియన్ మార్కె ట్ల సూచీలు కూడా ప్రతికూలంగా ఉండడం వంటి అంశాలే బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణమని అంటున్నారు.

05/02/2019 - 22:12

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,070.00
8 గ్రాములు: రూ.24,560.00
10 గ్రాములు: రూ. 30,700.00
100 గ్రాములు: రూ.3,07,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,283.422
8 గ్రాములు: రూ. 26,267.376
10 గ్రాములు: రూ. 32,834.22
100 గ్రాములు: రూ. 3,28,342.2
వెండి
8 గ్రాములు: రూ. 324.00

05/02/2019 - 22:12

న్యూఢిల్లీ, మే 2: హిందుస్థాన్ పెట్రోలియన్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ విలీనానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వాటాలను పూర్తిగా తుడిచేయాలన్న ప్రతిపానను భారత చమురు, సహజ వాయివు కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) తిరస్కరించినట్టు సమాచారం. గత ఏడాది హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్‌జీసీ 36,915 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది.

05/02/2019 - 22:11

న్యూఢిల్లీ, మే 2: రీటైల్ చైన్ సంస్థ వన్ ఇండి యా మార్ట్ 20 కోట్ల రూపాయల రుణాలు సేకరించింది. ఏపీఏసీ ఫైనాన్షియల్ సిర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్టు వన్ ఇండియా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్ట్‌లను విస్తరించడానికే ఈ రుణాలను సేకరించినట్టు నిసా రిటైల్‌కు చెందిన వన్ ఇండియా తన ప్రకటనలో వివరించింది.

05/02/2019 - 02:42

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అంచనాలను మించిపోతున్నాయి. గత మాసంలో రికార్డు స్థాయిలో 1.06 లక్షల కోట్ల రూపాయలు జీఎస్‌టీ రూపంలో ఖజానాకు చేరాయి. ఈ రికార్డును ఏప్రిల్ అధికమించింది. 1.13 లక్షల కోట్ల రూపాయల వసూళ్లతో కొత్త చరిత్రను సృష్టించింది. 2017 జూలై మాసంలో అత్యధికంగా 75.05 లక్షల కోట్ల రూపాయలు వసూలుకాగా, ఆ రికార్డు మార్చిలో వసూళ్లు బద్దలు చేసింది.

05/02/2019 - 02:40

న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధర బుధవారం ఒక్కో సిలిండర్‌పై 28 పైసల చొప్పున పెరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2014వ సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు దీని ధర ఒక్కో సిలిండర్‌పై రూ. 82కి పైగా పెరిగింది. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర కూడా 2.5 శాతం పెరిగింది. దీని ధర పెరగడం ఇది వరుసగా మూడో నెల.

Pages