S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/29/2019 - 02:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం ప్రధానంగా ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువపై ఆధారపడి కదలాడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కంపెనీల ఆదాయ గణాంకాలు కూడాప్రభావితం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈవారం వాణిజ్య రాజధానిలో మూడే వ్యాపార దినాలు జరుగనున్నారు.

04/29/2019 - 02:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: గోధుమ దిగుమతులపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం 30 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. దిగుమతులను సాధ్యమైనంత వరకూ తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక గోధుమ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలంటే, దిగుమతులను తగ్గించాలనే సూత్రాన్ని కేంద్ర సర్కారు అనుసరిస్తున్నది. పైగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో గోధుమ ఉత్పత్తి జరిగింది. కాబట్టి, గోధుమ కొరత ఉండదు.

04/29/2019 - 02:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నాణ్యతా ప్రమాణాల లోపం కారణంగా అమెరికా నుంచి కొన్ని ఔషధాలను డాక్టర్ రెడ్డీస్, సిప్లా కంపెనీలు వెనక్కు తెప్పించుకుంటున్నాయి. మూర్ఛ, మైగ్రేన్ తలనొప్పి వంటి వ్యాధులను నయం చేయడానికి వాడే డివాల్‌ప్రొయెక్స్ సోడియం ఎక్స్‌టెండెండ్ రిలీస్ టాబ్లెట్లు ఉన్న 33,958 బాటిళ్లను అమెరికా మార్కెట్ నుంచి తెప్పిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ఒక ప్రకటనలో తెలిపింది.

04/29/2019 - 02:37

ముంబయి, ఏప్రిల్ 28: ఎస్ బ్యాంక్ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. బ్యాంక్‌ను నష్టాల బాట నుంచి తప్పించడమేగాక, ఆర్బీఐ నిబంధనలకు అనుకూలంగా విధివిధానాలను నిర్ధారించడం కూడా అత్యంత కీలకమని కొత్త చీఫ్ ఎగ్జికూటివ్ ఆఫీసర్ (సీఈవో) రవ్‌నీత్ గిల్ నిర్ణయించారు. ముందుగా నష్టాలకు కారణాలను ఆయన అనే్వషిస్తున్నారు. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ల్లో ఎస్ బ్యాంక్‌ది ఐదో స్థానం.

04/28/2019 - 04:52

న్యూఢిల్లీ: విమానాశ్రయాలు, బొగ్గు గనులు, నగర ప్రజల వంట గ్యాస్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ కాంట్రాక్టులను బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని ‘అదానీ గ్రూప్’ సంస్థ తాజాగా హస్తగతం చేసుకుంది. ఇందులో జాతీయ రహదారి నిర్మాణాలు సైతం ఉన్నాయి. కొత్త రంగాల్లోకి సైతం అడుగిడాలన్న లక్ష్యం మేరకు ఈ సంస్థ ముందుకెళుతోందని విశ్వసనీయ సమాచారం.

04/27/2019 - 23:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో శరవేగంగా దూసుకెళుతున్నప్పటికీ, ఒడాఫోన్, ఐడియా ఒకే కంపెనీగా అవతరించడంతో, ఎక్కువ శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి వైర్‌లెస్ వినియోగదారులు గ్రామీణ ప్రాంతంలో 527.77 మిలియన్ల మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 654.20 మంది ఉన్నారు. మొత్తం వీరి సంఖ్య 1,181.97. ఫిబ్రవరి మాసాంతంలో ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులను చూడవచ్చు.

04/27/2019 - 23:26

కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ తన ఢిల్లీ విభాగం ‘మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్’ (ఎమ్‌టీఎన్‌ఎల్) ఉద్యోగులకు త్వరలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం (వీఆర్‌ఎస్)ను ఆఫర్ చేయనుంది. ఒకవేళ ఈ ప్రతిపాదనతో టెలికాం సంస్థ ముందుకు వస్తే ఇక్కడ పనిచేసే 9,500 మంది ఉద్యోగులు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని, తద్వారా టెలికాం శాఖకు రూ. 1.080 కోట్ల వరకు జీతాల ఖర్చు ఆదా అవుతుందని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు.

04/27/2019 - 23:23

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,140.00
8 గ్రాములు: రూ.25,120.00
10 గ్రాములు: రూ. 31,400.00
100 గ్రాములు: రూ.3,14,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,358.289
8 గ్రాములు: రూ. 26,866.312
10 గ్రాములు: రూ. 33,582.89
100 గ్రాములు: రూ. 3,35,828.9
వెండి
8 గ్రాములు: రూ. 323.60

04/27/2019 - 23:23

ముంబయి, ఏప్రిల్ 27: ఈవారం స్టాక్ మార్కెట్ అనేక రకాలుగా ఆటుపోట్లకు గురైంది. ఒకసారి బేర్ ఆధిపత్యాన్ని కనబరిస్తే, మరోసారి బుల్ రన్ కొనసాగింది. వారం మొత్తంలో జరిగిన ఐదు రోజుల లావాదేవీల్లో సెనె్సక్స్ మూడు రోజులు పతనంకాగా, రెండు రోజులు లాభాలను నమోదు చేసింది. గతవారం సెనె్సక్స్ 39,140.28 పాయింట్ల వద్ద ముగిసింది. అదే తీరులో తొలిరోజైన సోమవారం మార్కెట్ లాభాలను ఆర్జిస్తుందని అంతా ఊహించారు.

04/27/2019 - 23:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న హోటల్ లీలావెంచర్‌కు చెందిన ఆస్తుల విక్రయంపై మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ బుధవారం ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ నిర్వహించరాదని ఆదేశించింది.

Pages