S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/04/2019 - 23:03

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,075.00
8 గ్రాములు: రూ.24,600.00
10 గ్రాములు: రూ. 30,750.00
100 గ్రాములు: రూ.3,07,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,190.00
8 గ్రాములు: రూ. 25,520.00
10 గ్రాములు: రూ. 31,900.00
100 గ్రాములు: రూ. 3,19,000.10
వెండి
8 గ్రాములు: రూ. 325.60

05/04/2019 - 23:02

న్యూఢిల్లీ, మే 4: గ్రీన్ సర్ట్ఫికెట్స్ అమ్మకాలు దారుణంగా పడిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రీన్ సర్ట్ఫికెట్ల అమ్మకాలు 65 శాతం పతనమయ్యాయి. పురుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న ఇండియన్ ఎనర్జీ ఎక్ఛ్సేంజ్ (ఐఈఎక్స్), పవర్ ఎక్ఛ్సేంజ్ ఆఫ్ ఇండియా (పీఎక్స్‌ఐఎల్) సంయుక్తంగా రిన్యువబుల్ ఎనర్జీ సర్ట్ఫికెట్స్ (ఆర్‌ఈసీ), విద్యుత్ అమ్మకాలను కొనసాగిస్తున్నాయి.

05/04/2019 - 23:01

న్యూఢిల్లీ, మే 4: ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, ఆతిథ్య రంగంలో పేరుమోసిన అకార్ హోటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా, సుమారు 700 కోట్ల రూపాయలతో విస్తరణకు ఇంటర్‌గ్లోబ్ హోటల్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. 2022 సంవత్సరంలోగా దేశంలో మరో ఆరు హోటళ్లను నిర్మించడమే లక్ష్యంగా ఎంచుకుంది.

05/04/2019 - 23:01

వాషింగ్టన్, మే 4: అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సంబంధిత వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు పెరిగే సూచనలు కనిపించవచ్చునని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

05/03/2019 - 19:59

జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకోవాలని కోరుతూ ముంబయిలోని అజాద్ మైదానంలో మౌన ప్రదర్శన నిర్వహిస్తున్న
ఆ సంస్థ ఉద్యోగులు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ మూసివేత ఖాయంగా కనిపిస్తున్నది. అత్యవసర సాయాన్ని అందించడానికి ప్రధాన రుణతాద ఎస్‌బీఐ నిరాకరించడంతో జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

05/03/2019 - 19:56

ముంబయి, మే 3: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్రమైన ఆటుపోట్ల మధ్య కొనసాగింది. చివరి క్షణాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో, స్వల్ప నష్టం తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ లాభాల్లోనే మొదలైంది. దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో ఒకానొక దశలో సెనె్సక్స్ 39,172.76 పాయింట్ల వరకూ చేరింది.

05/03/2019 - 19:54

న్యూఢిల్లీ, మే 3: ప్రాపర్టీ రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న స్క్వేర్ యార్డ్స్ సంస్థ లాభాల పంట పండిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం 38 శాతం వృద్ధి రేటును సాధించినట్టు కంపెనీ శుక్రవారం సెబీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అమ్మకాలు, ఫీ ద్వారా వచ్చిన ఆదాయం 220 కోట్ల రూపాయలుగా ప్రకటించింది. ఈ సంస్థ ఖాతాదారుల్లో ప్రవాస భారతీయులు ఎక్కువ.

05/03/2019 - 19:53

ముంబయి, మే 3: స్పైస్‌జెట్ కొత్తగా మరో 12 విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ముంబయి, న్యూఢిల్లీ నగరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ సర్వీసులు ఈనెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో ఆరు విమానాలు న్యూఢిల్లీ నుంచి, మరో ఆరు ముంబయి నుంచి నడుస్తాయని వివరించింది. ఈ మార్గాల్లో బోయింగ్ 737 ఎన్‌జీ విమానాలను నడిపిస్తుంది.

05/03/2019 - 19:52

న్యూఢిల్లీ, మే 3: బాదం, వాల్నట్, పప్పు ధన్యాలుసహా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 29 ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచేందుకు గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ నిర్ణయం అమలును ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గత ఏడాది జూన్ మాసంలో, 29 అమెరికా ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్టు కేంద్ర ప్రకటించింది.

05/03/2019 - 19:50

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,060.00
8 గ్రాములు: రూ.24,480.00
10 గ్రాములు: రూ. 30,600.00
100 గ్రాములు: రూ.3,06,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,272.727
8 గ్రాములు: రూ. 26,181.816
10 గ్రాములు: రూ. 32,727.27
100 గ్రాములు: రూ. 3,27,272.70
వెండి
8 గ్రాములు: రూ. 225.60

Pages