S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/30/2019 - 04:03

న్యూఢిల్లీ: సోలార్ ప్రాజెక్ట్ కోసం బిడ్స్ వేసే గడువును సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) పొడిగించింది. 97.5 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్టు కోసం బిడ్స్ వేయడానికి మంగళవారాన్ని చివరి తేదీగా తొలుత ప్రకటించింది.

04/29/2019 - 23:08

లండన్, ఏప్రిల్ 29: భారత దేశంలోని బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ నూటికి నూరుశాతం తీర్చేస్తానని ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న ‘లిక్కర్ కింగ్’ విజయ్ మాల్యా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా అతను ఇదివరకు చాలాసార్లు ఇలాంటి ప్రకటన చేశాడు. మాల్యాను భారత్‌కు అప్పగించే అంశాన్ని హైకోర్టు పరిశీలనలో ఉంది.

04/29/2019 - 23:06

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,140.00
8 గ్రాములు: రూ.25,120.00
10 గ్రాములు: రూ. 31,400.00
100 గ్రాములు: రూ.3,14,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,358.289
8 గ్రాములు: రూ. 26,866.312
10 గ్రాములు: రూ. 33,582.89
100 గ్రాములు: రూ. 3,35,828.9
వెండి
8 గ్రాములు: రూ. 323.20

04/29/2019 - 23:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.30 పెరిగి మొత్తం ధర రూ.33 వేలకు చేరింది. అక్షయ తృతియ పర్వదినం సమీపిస్తుండడంతో వ్యాపారుల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగిందని అఖిల భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది. అలాగే వెండి సైతం కిలోపై రూ.250 పెరిగి మొత్తం ధర 38,700కు చేరింది.

04/29/2019 - 23:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: అత్యధిక మార్కెట్ విలువగల భారతీయ కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ కంపెనీ విలువ 5,420 కోట్లు పెరగడంతో, 8,82,005 కోట్ల రూపాయలకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ విలువ 3,482 కోట్లు పెరిగి, 8,39,896 కోట్ల రూపాయలుగా నమోదైంది.

04/29/2019 - 23:04

వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా పేపర్ ఉత్పత్తులు, ప్రతిష్టాత్మకమైన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌లకు భారత్ అధిక సుంకాలు (టారిఫ్‌లు) వసూలు చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు విమర్శలు గుప్పించారు. భారత్‌తోబాటు చైనా, జపాన్ వంటి దేశాల ఇలాంటి వైఖరి వల్ల అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

04/29/2019 - 03:58

హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ అత్యంత కీలకమైంది. ఈ శాఖ ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్ల ఆదాయం సాధించాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, అనేక కారణాల వల్ల రవాణా శాఖ కేవలం రూ. 3504.88 కోట్లను ఆర్జించింది. లక్ష్యం కంటే రూ. 500 కోట్లు తక్కువగా ఆదాయం వచ్చినప్పటికీ, పరిస్థితి మెరుగ్గా ఉందనే చెప్పాలి. 2017-18లో రవాణా శాఖ రూ.

04/29/2019 - 03:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నిర్ణీత స్థాయికన్నా అధిక టర్నోవర్‌తో జరిగే వ్యాపాల్లో ప్రతి విక్రయానికి సంబంధించి ‘ఈ ఇన్వాయిస్’ను ప్రభుత్వ జీఎస్టీ పోర్టల్ ద్వారా అందజేసేందుకు ఓ ప్రత్యేక సిస్టంను రూపొందించేందుకు జీఎస్టీ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిద్వారా జీఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

04/29/2019 - 03:25

న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ వాటాల ఆధారంగా ఎక్చేంజ్ ట్రేడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ఆంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికను అమలు చేసేందుకు విదేశీ పెట్టుబడిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు ప్రారంభించింది.

04/29/2019 - 02:43

న్యూఢిల్లీ: మార్కెట్ కేపిటలైజేషన్ (ఎంక్యాప్)లో అతివిలువైన టాప్‌టెన్ కంపెనీల జాబితాలోని ఎనిమిది కంపెనీలు గతవారం రూ. 54,151.62 కోట్ల విలువను అదనంగా పెంచుకున్నాయి, ఇందులో సింహ భాగాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంతరించుకోవడం గమనార్హం. మార్కెట్ విలువలో టాప్‌టెన్ కంపెనీల్లో ఈ వారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే నష్టపోయాయి.

Pages