S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/07/2019 - 04:14

ముంబయి: అమెరికా-చైనా వాణిజ్య చర్చలు విఫలమవుతాయన్న వార్తలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ప్రధానంగా బీఎస్‌ఈలో సెనె్సక్స్ సోమవారం 362.92 పాయింట్లు కోల్పోయింది. అంతర్జాతీయంగా వాటాల అమ్మకాల వత్తిడి నెలకొంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 114 పాయింట్లు నష్టపోయి 11,600 పాయింట్ల దిగువకు చేరింది.

05/07/2019 - 04:13

న్యూఢిల్లీ, మే 6: సుమారు ఐదేళ్లుగా సాగుతున్న కోర్టు వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా తాము ప్రయత్నాలు సాగిస్తున్నామని భాగస్వామ్య కంపెనీలు మెక్‌డోనాల్డ్స్, విక్రమ్‌బక్షి సోమవారం నాడిక్కడ వెల్లడించాయి. ఈమేరకు జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యులతో కూడిన నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ధర్మాసనానికి ఆ కంపెనీలు తమ రాజీ వైఖరిని తెలియజేశాయి.

05/07/2019 - 04:11

ముంబయి, మే 6: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి తమ ప్రగతికి తోడ్పడుతుందని ఆర్థిక సేవల దిగ్గజం ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎల్) సోమవారం నాడిక్కడ పేర్కొంది.

05/07/2019 - 04:10

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,074.00
8 గ్రాములు: రూ.24,592.00
10 గ్రాములు: రూ. 30,740.00
100 గ్రాములు: రూ.3,07,400.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,287.701
8 గ్రాములు: రూ. 26,301.608
10 గ్రాములు: రూ. 32,877.01
100 గ్రాములు: రూ. 3,28,770.1
వెండి
8 గ్రాములు: రూ. 316.64

05/06/2019 - 04:44

ముంబయి: భారత స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా అనిశ్చిత పరిస్థితిలోనే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ సూచీలు ప్రతికూలంగా నమోదు కావడంతోపాటు రూపాయి మారకం విలువ పతనం, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

05/05/2019 - 23:23

న్యూఢిల్లీ, మే 5: దేశంలోని 1.5 లక్షల తపాలా కార్యాలయాల నెట్‌వర్క్ ఆధునీకరణకు దోహదం చేసే ఓ సమగ్ర పరిష్కారం (ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్)ను రూపొందించి, మోహరింపజేశామని అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇటీవల ప్రకటించింది.

05/05/2019 - 23:21

న్యూఢిల్లీ, మే 5: ముడిచమురు దిగుమతులను కనీసం 10 శాతం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నా ఫలితం దక్కడంలేదు. పలు అవసరాల కోసం పెట్రోలియం ఉత్పత్తులను దేశం భారీగా దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో 84 శాతం ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారిక లెక్కలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

05/05/2019 - 23:20

సుజనర్ (రాజస్థాన్), మే 5: ఇంద్రధనస్సు రంగులన్నీ వారి కళలో ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా వస్త్రాలపై డిజైన్లను వంగపండు రంగుతో ప్రారంభించి ఎరుపురంగు షేడ్‌తో ముగించే వారి కళాకృతి ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది. కాని వారి జీవితాల్లోనే నల్లటి నీడే తప్ప రంగన్నది మచ్చుకైనా కన్పించదు. ఇది రాజస్థాన్‌లోని అద్దక పరిశ్రమ కార్మికుల దుస్థితి.

05/04/2019 - 23:05

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 381.51 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన ఫెడరల్ బ్యాంక్ శనివారం సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రైవేటు రంగంలోని ఈ బ్యాంక్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 144.99 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 3,444 కోట్ల రూపాయలు కాగా, అన్ని ఖర్చులనుపోను నికరంగా 145 కోట్ల రూపాయల లాభం నమోదైంది.

05/04/2019 - 23:03

న్యూఢిల్లీ, మే 4: స్టాక్ మార్కెట్‌లో ఈ వారం అనిశ్చితి పరిస్థితి కొనసాగింది. కేవలం మూడురోజుల లావాదేవీలు మాత్రమే సాధ్యమయ్యాయి. ఈవారంలో మొత్తం 104.07 సెనె్సక్ పతనమయ్యాయి. 29,067.33 సెనె్సక్స్ పాయింట్లతో ప్రారంభమైన బీఎస్‌ఈ ట్రేడింగ్ మంగళవారం 39,031.55 పాయింట్లతో పతనమైంది.

Pages