S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/25/2019 - 22:58

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,095.00
8 గ్రాములు: రూ. 24,760.00
10 గ్రాములు: రూ. 30,950.00
100 గ్రాములు: రూ. 3,09,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,310.16
8 గ్రాములు: రూ. 26,481.28
10 గ్రాములు: రూ. 33,101.6
100 గ్రాములు: రూ. 3,31,016.0
వెండి
8 గ్రాములు: రూ. 321.60

04/25/2019 - 22:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: బులియన్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగియడం, బులియన్ మార్కెట్‌కు కలిసొచ్చింది. పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పెరిగి, 32,870 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర 295 రూపాయలు పెరగడంతో, 38,520 రూపాయలుగా నమోదైంది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో సాగుతున్నదనే సమాచారంతో దేశీయ మదుపరులు బులియన్ మార్కెట్‌పైపు దృష్టి సారించారు.

04/25/2019 - 22:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: స్థిరాస్థి బ్రోకరేజ్ సంస్థ అనారాక్ గడచిన ఆర్థిక సంవత్సరంలో ద్విగుణీకృత ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంస్థ మొత్తం రూ. 188 కోట్ల వార్షికాదాయాన్ని గడించింది. వరుసగా రెండో సంవత్సరం ఇలా నిర్వహణను బలోపేతం చేసుకుని పెరిగిన నివాస గృహాల అవసరాలను అందుకుని పురోగమిస్తున్నామని కంపెనీ చైర్మన్ అనుజ్ పురి గురువారం నాడిక్కడ తెలిపారు.

04/25/2019 - 01:03

విశాఖపట్నం: సొంతంగా బస్సులు కొనుగోలు చేసి నడిపితే ఆర్టీసీకి మిగిలేవి నష్టాలేనని, నష్టాలు తగ్గించుకునే చర్యల్లో భాగంగానే ఆర్టీసీ హైర్ బస్సులు నడుపుతోందని ఆర్టీసీ వైస్ చైర్మన్ కం మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర బాబు స్పష్టం చేశారు.

04/24/2019 - 23:07

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుధవారం ట్రేడింగ్ సానుకూల ధోరణుల్లో కొనసాగింది. సెనె్సక్స్ 489.80 పాయింట్లు మెరుగుపడి, 39,095.35 పాయింట్లకు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 150.20 పాయింట్లు లాభపడి, 11,726.15 పాయింట్లకు పెరిగింది.

04/24/2019 - 23:05

బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినే లాగార్డేకు స్వాగతం పలుకుతున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. చైనా ఆర్థికాభివృద్ధి, వివిధ ప్రణాళికలు, ఐఎంఎఫ్ సాయం వంటి అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.

04/24/2019 - 23:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ముడిచమురు ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. మనదేశ విపణివీధిలో ఈ ధరలు 0.40 శాతం తగ్గి బ్యారెల్ రూ.4,622 పలికింది. వారం మొత్తం జరిగిన దిగుమతిని అంచనా వేస్తే మనదేశ అవసరాలకు సరిపడా ముడిచమురు దిగుమతి జరిగింది. బహుళ వినిమయ వస్తువుల ఎక్చేంచ్ గణాంకాల ప్రకారం వచ్చే మే నెలలో సరఫరా జరిగే ముడిచమురు ధర 0.41 శాతం లేదా రూ. 19 తగ్గి బ్యారెల్ రూ. 4,622 వద్ద ట్రేడయ్యే అవకాశాలున్నాయి.

04/24/2019 - 23:20

హైదరాబాద్, ఏప్రిల్ 24: మైక్రో ఫైనాన్స్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సూర్యాదయ్ తొలి బ్రాంచిని ఏర్పాటు చేసినట్లు ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ బాబు చెప్పారు. ఈ బ్రాంచిని ఎన్‌ఎండీసీ జీఎం ఏకే పాథే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ భాస్కర్ బాబు మాట్లాడుతూ, దేశంలోని పది రాష్ట్రాల్లో 380 బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు.

04/24/2019 - 23:00

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,095.00
8 గ్రాములు: రూ.24,760.00
10 గ్రాములు: రూ. 30,950.00
100 గ్రాములు: రూ.3,09,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,195.00
8 గ్రాములు: రూ. 25,560.00
10 గ్రాములు: రూ. 31,950.00
100 గ్రాములు: రూ. 3,19,500.00
వెండి
8 గ్రాములు: రూ. 321.60

04/24/2019 - 22:59

పారిస్, ఏప్రిల్ 24: ముడి చమురు ధరలు పెరుగుదల కోసం హామీ ఇచ్చిన దానికంటే అధికంగానే సౌదీ అరేబియా ఉత్పత్తిలో కోత విధించిందని అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గురువారం నాడిక్కడ పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ మేరకు ముడిచమురు ఉత్పత్తి జరగడం లేదన్న ప్రమాద సంకేతాలను ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రతినెలా చమురు మార్కెట్ స్థితిగతులపై ప్యారిస్‌కు చెందిన ఐఈఏ అధ్యయనం చేస్తుంది.

Pages