S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/04/2019 - 22:46

ముంబయి, ఏప్రిల్ 4: ఆర్బీఐ రెపో రేటును మరో 0.25శాతం మేర తగ్గిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రస్తుతం వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. తాజా నిర్ణయంతో రివర్స్ రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గుతుంది. గత 18 నెలల్లో రెపో రేటును ఆర్బీఐ సవరించడం ఇది రెండోసారి. రెపో, రివర్స్‌రేపో రేటు తగ్గడంలో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకే రుణాలు ఇచ్చేందుకు వీలవుతుంది.

04/04/2019 - 22:43

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ. 24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ. 3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.8
వెండి
8 గ్రాములు: రూ. 322.86

04/04/2019 - 22:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: వాల్‌మార్ట్ అధీనంలోని ఫ్లిప్‌కార్ట్ మనదేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన పనిప్రదేశంగా గుర్తింపు పొందింది. తర్వాతి స్థానాల్లో అమెజాన్, ఓయో సంస్థలు నిలిచాయి. ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్‌వర్క్ ‘లింకేడ్లిన్’ ఈమేరకు తన నాల్గవ ఎడిషన్ అధ్యయన నివేదికను బుధవారం ఇక్కడ విడుదల చేసింది. 2019 టాప్ కంపెనీల జాబితాలో తొలి పది స్థానాలను ఇంటర్నెట్ కంపెనీలు ఆక్రమించాయి.

04/04/2019 - 04:54

ముంబయి: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ నాలుగు రోజుల పరుగుకు తెరపడింది. మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు ఈ సంవత్సరం వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా నమోదవుతుందనే అంచనాల కారణంగా బుధవారం సెనె్సక్స్ సుమారు 180 పాయింట్లు పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో బలమయిన ర్యాలీ వచ్చినప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం తమ జీవితకాల గరిష్ఠ స్థాయిలను నిలబెట్టుకోలేక పోయాయి.

04/03/2019 - 23:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత అభివృద్ధి విధానం దేశంలో ఉద్యోగ లేమిని పెంచుతోందని, కార్మిక ప్రాధాన్యత కలిగిన రంగాల అభివృద్ధి విధానంలోకి మారడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు వీలుకలుగుతుందని ‘ఆక్స్‌ఫాం ఇండియా’ అధ్యయన నివేదిక వెల్లడించింది. ‘మైండ్ ది గ్యాప్-స్టేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఇండియా’ పేరిట ఆక్స్‌ఫాం ఇండియా తన అధ్యయన నివేదికను ఇటీవల విడుదల చేసింది.

04/03/2019 - 23:29

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ. 24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ. 3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.203
8 గ్రాములు: రూ. 26,609.624
10 గ్రాములు: రూ. 33,262.03
100 గ్రాములు: రూ. 3,32,6200.3
వెండి
8 గ్రాములు: రూ. 352.12

04/03/2019 - 23:27

ముంబయి, ఏప్రిల్ 3: బ్యాంకు రుణాలు తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సరికొత్త నిబంధనలను తీసుకురావాల్సిన అవరసం ఉందని నీతీ ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ బుధవారం నాడిక్కడ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న ద్రవ్య సాధికారిక నిబంధనల్లోని లొసుగులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

04/03/2019 - 22:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ వాటాల విలువ బుధవారం మరో నాలుగు శాతం పడిపోయింది. ఈ సంస్థ తాజాగా మరో 15 విమానాల నిర్వహణను ఆపివేయడంతో స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వచ్చిందని విమానాలు విశే్లషకులు అంచనా వేస్తున్నారు. లీజు, అద్దెల బకాయిలు భారీగా పేరుకుపోయిన క్రమంలో అనివార్యంగా విమానాల నిర్వహణను ఆపివేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

04/03/2019 - 05:09

ముంబయి: వరుసగా నాలుగో రోజూ దేశీయ మార్కెట్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెనె్సక్స్ 185 పాయింట్లు లాభపడి ఆల్‌టైం రికార్డు ఆధిక్యతను నమోదుచేసి 39.055 మార్కును దాటింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 11.700 మార్కును దాటింది. ప్రధానంగా మోటారు వాహనాలు, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెద్ద ఎత్తున వాటాల కొనుగోళ్లు జరిగాయి.

04/02/2019 - 23:01

జెనీవా, ఏప్రిల్ 2: అంతర్జాతీయ వాణిజాభివృద్ధి 2019లో మందగించే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రగతిలో తగ్గుదల నమోదయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మంగళవారం అంచనా వేసింది. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, వాణిజ్యపమైన వత్తిడులు ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతాయని డబ్ల్యూటీవో విశే్లషించింది.

Pages