S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/07/2019 - 03:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మార్కెట్‌లో ఇండియో 43.2 శాతాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాతి స్థానం స్పైస్ జెట్ ఆక్రమించింది. 13.7 శాతం మార్కెట్‌ను స్పైస్ జెట్ సొంతం చేసుకోగా, ఎయిర్ ఇండియా 12.8 శాతంతో మూడో స్థానంలో ఉంది. జెట్ ఎయిర్‌వేస్ 10 శాతం, గో ఎయిర్ 9 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

04/05/2019 - 21:39

ముంబయి, ఏప్రిల్ 5: అమెరికా, చైనా దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయని, దీనితో ఇరువురి మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి త్వరలోనే తెరపడుతుందని వచ్చిన వార్తల ప్రభావం భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లపై కూడా పడింది.

04/05/2019 - 21:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశంలో విమాన ప్రయాణ చార్జీలు గత కొన్ని నెలల నుంచి పెరుగుతున్నాయి. ప్రధానంగా బోయింగ్ 737 మాక్స్ విమానాల నిర్వహణను నిలిపివేసినప్పటి నుంచి ఈప్రభావం విమాన చార్జీలపై పడిందని ఫిచ్ రేటింగ్స్ అధ్యయన నివేదిక వెల్లడించింది.

04/05/2019 - 21:27

ముంబయి, ఏప్రిల్ 5: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు ఇంధన సరఫరాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం నిలిపివేసింది. సరఫరా చేసిన ఇంధనానికి చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడం వల్లనే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇంధన సరఫరా నిలిపివేయాల్సి విచ్చిందని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్ధ ఐఓసీ పేర్కొంది. ఇందుకు సంబంధించి జెట్ ఎయిర్‌వేస్ నుంచి స్పందన రావాల్సివుంది.

04/05/2019 - 21:27

వాషింగ్టన్, ఏప్రిల్ 5: అమెరికా, చైనా దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందోనని ఎదురు చూస్తున్న వారికి ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయన్న వార్త ఊరటనిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాషింగ్టన్‌లో సమావేశమైన చైనా ఉప ప్రధాని లియూ హీ ఎంత వరకూ తమ వాదనను బలంగా వినిపిస్తాడన్న అంశం ఆసక్తిని రేపుతున్నది.

04/05/2019 - 21:25

సియోల్ (దక్షిణ కొరియా)లోని కేఈబీ హనా బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో దిక్కుతోచక కూర్చున్న కరెన్సీ ట్రేడర్. శుక్రవారం చైనా ఫోరెక్స్ మార్కెట్‌కు సెలవుదినంకాగా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో విదేశీ మారకం విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా కరెన్సీ ట్రేడర్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. కాగా, వచ్చే వారం ఫోరెక్స్ మార్కెట్ కుదుటపడుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు.

04/05/2019 - 21:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు, లేదా వ్యక్తిగత ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంచనాలతో ఐటీ రిటర్స్ ఫారాలను సమర్పించాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వేతన జీవులు, కొన్ని సంస్థలు సమర్పించాల్సిన ఐటీఆర్-1 లేదా ‘సహజ్’లో ఎలాంటి మార్పుల్లేవని, ఐతే ఐటీఆర్ 2,3,5,6,7లోని కొన్ని సెక్షన్లను మాత్రం హేతుబద్ధీకరించడం జరిగిందని అధికారులు తెలిపారు.

04/05/2019 - 21:22

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

04/04/2019 - 22:51

ముంబయి, ఏప్రిల్ 4: ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించడమేగాక, 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి తగ్గవచ్చని అంచనా వేయడంతో, దాని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడింది.

04/04/2019 - 22:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పన్ను ఎగవేతదారులపై బుధవారం కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (సీబీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pages