S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/09/2019 - 23:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి వేసిన 42,000 కోట్ల రూపాయల బిడ్ మొత్తాన్ని కట్టాల్సిందిగా అర్సెలోమిట్టల్ కంపెనీని ఆదేశించే అవకాశాలు ఉన్నాయని నేషనల్ కంపెనీ లా అపెలెట్ ట్రిబ్యూనల్ (ఎన్‌సీఏఎల్‌టీ) తెలిపింది.

04/08/2019 - 22:57

ముంబయి: భారత ఆటో మొబైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని మహీంద్ర అండ్ మహీంద్ర మరోసారి నిరూపించుకుంది. దేశీయ మార్కెట్‌లో అమ్మిన పికప్ వాహనాల సంఖ్య 1.5 లక్షల మైలురాయిని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసిన మార్చి మాసాంతానికి 1,62,000 పికప్ వాహనాలను అమ్మినట్టు మహీంద్ర అండ్ మహీంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

04/08/2019 - 22:55

ముంబయి, ఏప్రిల్ 8: కార్పొరేట్ సంస్థల గత ఆర్థిక సంవత్సర ఫలితాల కోసమేగాక, రాబోయే సార్వత్రిక ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉంటాయోనన్న కారణంగా కూడా మదుపరులు జాగ్రత్త పడడంతో, ఈవారం మొదటి రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో మొదలైంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 161.70 పాయింట్లు పతనమై 38,700.53 పాయింట్లకు పడిపోంది.

04/08/2019 - 22:53

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,105.00
8 గ్రాములు: రూ.24,840.00
10 గ్రాములు: రూ. 31,050.00
100 గ్రాములు: రూ.3,10,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,320.856
8 గ్రాములు: రూ. 26,566.848
10 గ్రాములు: రూ. 33,208.560
100 గ్రాములు: రూ. 3,32,085.60
వెండి
8 గ్రాములు: రూ. 324.00

04/08/2019 - 22:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ మళ్లీ గత వైభవాన్ని సంపాదించే మార్గం కనిపించకపోవడంతో, 75 శాతం వాటాలను అమ్మేయాలని రుణదాతలు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన ఆర్బీఐ ఈనెల 10వ తేదీలోగా బిడ్స్ దాఖలు చేయాలని ఆసక్తిగల పార్టీలకు సూచించింది.

04/08/2019 - 22:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆర్థికంగా నష్టపోయి, అప్పుల్లో కూరుకుపోయిన కోబ్రా వెస్ట్ పవర్ కంపెనీని కొనుగోలు చేసేందుకు అవసరమైన అనుమతిని అదానికి లభించింది. దీనితో కోబ్రా వెస్ట్ పవర్ కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి అదానీకి మార్గం సుగమమైంది. కోబ్రా వెస్ట్ రుణదాతల కమిటీ ఇక్కడ సమమావేశమై, అదానీ బిడ్‌ను అంగీకరించింది. అదానికి లెటర్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఎల్‌ఓఐ)ని కూడా అందించింది.

04/08/2019 - 22:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఔషధ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా తాజాగా కేన్సన్ ఇంజక్షన్‌ను అమెరికా మార్కెట్‌ల విడుదల చేసింది. ‘ఇన్‌ఫ్యూజెమ్’ పేరుతో తయారైన ఈ ఇంజక్షన్‌కు గత ఏడాది జూలైలోనే అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి పొందింది. నరాల ద్వారా ఇచ్చే ఇన్‌ఫ్యూజెమ్ ఇంజక్షన్ ఇక నుంచి అమెరికాలో కూడా లభిస్తుందని సన్ ఫార్మా సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

04/08/2019 - 04:14

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం నుంచి మొదలయ్యే ముందున్న వారంలో ఊగిసలాట ధోరణి నెలకొనే అవకాశం ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటంతో పాటు సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నందున కొంతమంది మదుపరులు లావాదేవీలకు దూరంగా ఉండే అవకాశం ఉందని, అందువల్ల మార్కెట్‌లో డోలాయమానం చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

04/07/2019 - 23:05

న్యూఢిల్లీ: దేశంలో అతివిలువైన కంపెనీ టాప్‌టెన్ జాబితాలోని మూడు కంపెనీల మార్కెట్ విలువ (ఎంక్యాప్) గతవారం రూ.40,597 కోట్లమేర పెరిగింది. ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లాభపడిన సంస్థగా నిలిచింది. మార్కెట్ కేపిటలైజేషన్ (ఎంక్యాప్)లో గడచిన శుక్రవారంతో ముగిసిన వారం రోజుల్లో టాప్‌టెన్ కంపెనీల్లో టీసీఎస్‌తోబాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌లు గణనీయంగా లాభపడ్డాయి.

04/07/2019 - 23:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: సేవా రంగానికి సంబంధించిన పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (ఎంపీఐ) గత ఆర్థిక సంవత్సరంలో సంతృప్తికరంగా ఉంది. 2018 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మాసం వరకూ పీఎంఐ సూచీలను పరిశీలిస్తే, సగటు యాభైకి తగ్గకపోవడం గమనార్హం. కొత్త ఆర్డర్లు, మొత్తం మీద ఆర్డర్ల జాబితా, ఉత్పత్తి, సరఫరా, ఉద్యోగిత అనే ఐదు అంశాల ఆధారంగా ఎంపీఐని నిర్ధారిస్తారు.

Pages