S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/10/2019 - 23:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రెండు రోజుల క్రితం మనసైన్యం అమ్ములపొదిలోకి చేరిన పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రతిష్టాత్మక ఫిరంగి ‘ధనుష్’కు అవసరమైన ప్రత్యే క రకమైన ఉక్కును తమ కర్మాగారం సరఫరా చేసిందని దేశంలో పేరెన్నికగన్న ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం ‘సెయిల్’ బుధవారం ఇక్కడ ప్రకటించింది.

04/10/2019 - 23:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశంలో సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగాలిచ్చినట్టు ఆతిథ్య రంగంలో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓయో రూమ్స్ సంస్థ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2020 చివరి నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.

04/10/2019 - 23:05

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,125.00
8 గ్రాములు: రూ.25,000.00
10 గ్రాములు: రూ. 31,250.00
100 గ్రాములు: రూ.3,12,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,342.246
8 గ్రాములు: రూ. 26,737.968
10 గ్రాములు: రూ. 33,422.46
100 గ్రాములు: రూ. 3,34,224.6
వెండి
8 గ్రాములు: రూ. 326.90

04/09/2019 - 23:19

రెంటన్ (వాషింగ్టన్)లోని కంపెనీ ఆవరణలో నిలిపి ఉంచిన బోయింగ్ 737 మాక్స్ 8 జెట్ విమానాలు. అమెరికా ఎయిర్‌లైన్స్, ఎయిర్ కెనడా కోసం బోయింగ్ కంపెనీ వీటిని తయారు చేసింది. బోయింగ్ తయారు చేస్తున్న విమానాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న 737 మాక్స్ 8 విమానాల ఉత్పత్తిని కంపెనీ ఈనెల నుంచి తగ్గించనుంది. ఈ మోడల్ విమానాలు రెండు ఇటీవల

04/09/2019 - 23:18

న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్. సార్వత్రిక ఎన్నికలకు అన్ని విధాలా సహకరిస్తామని ఆయన ప్రకటించారు.

04/09/2019 - 23:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: కార్పొరేట్ అవసరాల కోసం 500 కోట్ల రూపాయల వరకూ నిధులను సమీకరించుకోవడానికి శ్రేయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ మంగళవారం బాండ్స్‌ను విడుదల చేసింది. బదిలీకి వీల్లేని డిబెంచర్లు (ఎన్‌సీడీ) రూపంలో జారీ చేసే బాండ్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకొక్కటి 1,000 రూపాయల ముఖ విలువగల బాండ్లను 100 కోట్ల రూపాయలు సేకరించేందుకు వీలుగా కంపెనీ జారీ చేసింది.

04/09/2019 - 23:15

ముంబయి, ఏప్రిల్ 9: ఈవారం మొదటి రోజు నష్టాల్లో ప్రారంబైన స్టాక్ మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. సోమవారం సెనె్సక్స్ 161.70 పాయింట్లు, నిఫ్టీ 61.45 పాయింట్లు పతనంకాగా, మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 238.69 పాయింట్లు పెరిగి, 38,939.22 పాయింట్లకు చేరింది.

04/09/2019 - 23:13

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,105.00
8 గ్రాములు: రూ. 24,840.00
10 గ్రాములు: రూ. 31,050.00
100 గ్రాములు: రూ. 3,10,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,320.856
8 గ్రాములు: రూ. 26,566.848
10 గ్రాములు: రూ. 33,208.56
100 గ్రాములు: రూ. 3,32,085.6
వెండి
8 గ్రాములు: రూ. 324.00

04/09/2019 - 23:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రెండు కంపెనీలకు చెందిన నిరర్ధక ఖాతాల ఆస్తులు (ఎన్‌పీఏ)ను విక్రయించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆస్తుల పునర్వ్యవస్థీకృత కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)ను ఆహ్వానించింది. ఈ నిరర్థక ఖాతాల ఆస్తుల విక్రయం ద్వారా దాదాపు రూ.423 కోట్ల రూపాయలు సమీకరించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.

04/09/2019 - 23:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఎస్ బ్యాంక్‌తో వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకుంటామని ఆప్టో సర్క్యూట్స్ ఇండియా సంస్థ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీ ఎస్ బ్యాంక్‌కు మొత్తం 33.51 కోట్ల రూపాయలు బకాయి పడింది. అయితే, ఆ మొత్తాన్ని తీర్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్న ఆప్టో సర్క్యూట్స్ 8.5 కోట్ల రూపాయలు చెల్లించి, వన్‌టైమ్ సెటిల్మెంట్‌కు ముందుకొచ్చింది.

Pages