S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/01/2019 - 06:25

న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం సోమవారం నుంచి మొదలుకానుండగా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ పేర్లు గత చరిత్రగా మిగలనున్నాయి. ఈ రెండు బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విలీనం కావడంతో, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవి ఉనికిని కోల్పోనున్నాయి. ఇకపై విజయా, దేనా బ్యాంక్ పేర్లు కనిపించవు. వాటిని కూడా బీఓబీగానే పేర్కొంటారు.

03/31/2019 - 23:40

కొత్త ఆర్థిక సంవత్సరంతోపాటు ప్రారంభం కానున్న కొత్త వారంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే నడుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మార్కెట్ నిపుణులతోపాటు, విశే్లషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో హఠాత్ పరిణామాలు ఏవీ చోటు చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఏవైనా అనుకోని ఉపద్రవాలు ఎదురైతే తప్ప స్టాక్ మార్కెట్‌కు వచ్చే వారం ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా.

03/31/2019 - 23:37

న్యూఢిల్లీ, మార్చి 31: రుణాలపై వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర రిజర్వు బ్యాంకు కోత విధించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధిలో నెలకొన్న మందగమన పరిస్థితులతో దేశీయంగా ఏర్పడిన ప్రతికూల పనిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్బీఐ వచ్చే గురువారం ఈ వడ్డీ రేట్ల కోత విధింపుచర్యలు చేపట్టే వీలుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

03/31/2019 - 23:36

ముంబయి, మార్చి 31: విమాన యాన సంస్థ ఇండిగో అంతర్జాతీయ నిర్వహణ ఇబ్బందుల్లో పడిన దృష్ట్యా దాని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మైఖేల్ స్వియాటెక్ సంస్థ నుంచి తప్పుకున్నారు. 2018 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థకు చెందిన అత్యున్నత స్థాయి వ్యక్తులు ఇలా తప్పుకోవడం రెండోసారి. స్వియాటెక్ గత సంవత్సరం ప్రథమార్థంలో ఇండిగో సంస్థలో చేరారు.

03/31/2019 - 05:48

న్యూఢిల్లీ: మన దేశంలో గడచిన 2018లో ప్రైవేటు ఈక్విటీ (పీఈ), వెంచర్ కేపిటల్ (వీసీ) పెట్టుబడులు 20.5 బిలియన్ డాలర్ల మేర రాగా, అందుకు సంబంధించి 786 లావాదేవీలు జరిగాయి. సాంకేతిక రంగంలో విస్తరించిన అంకుర సంస్థలు, ఈకామర్స్, సమాచార పరమైన సేవల కారణంగా ఈ పెట్టుబడు లు వచ్చాయని ‘ది అస్యూరెన్స్ అండ్ ట్యాక్స్, అడ్వయిజరీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్’ అధ్యయనం వెల్లడించింది.

03/31/2019 - 05:43

ముంబయి, మార్చి 30: బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈవారం బుల్ రన్ కొనసాగింది. ట్రేడింగ్ లాభనష్టాల మధ్య కొనసాగినప్పటికీ, చివరికి వారం మొత్తం మీద సెనె్సక్స్ 508.30 పాయింట్లు పెరిగింది. వారం మొదటి రోజే భారీ నష్టాన్ని చవిచూసి స్టాక్ మార్కెట్ ఆ తర్వాత కోలుకుంది.

03/31/2019 - 05:41

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రభుత్వ రంగ సంస్థ మెటల్‌స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎంఎస్‌టీసీ) లిమిటెడ్ శుక్రవారం ఆరంభంలోనే స్టాక్ మార్కెట్‌లో బలహీనమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఈ సంస్థకు చెందిన వాటాలు 7.5 శాతం నష్టాలను చవిచూసి వాటా ధర రూ.120 నుంచి దగువకు చేరుకుంది. బీఎస్‌ఈలో తొలుత రూ.111 ఇస్యూ ధరతో ఆరంభమైన ఈ వాటాలు 7.5 శాతం నష్టాలను చవిచూశాయి.

03/31/2019 - 05:39

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ. 24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ. 3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.203
8 గ్రాములు: రూ. 26,609.624
10 గ్రాములు: రూ. 33,262.03
100 గ్రాములు: రూ. 3,32,620.03
వెండి
8 గ్రాములు: రూ. 332.00

03/31/2019 - 05:39

ముంబయి, మార్చి 30: దేశ మార్కెట్‌లోకి వస్తున్న విదేశీ రుణాల్లో తగ్గుదల నమోదైంది. గత నెల 2.81 బిలియన్ డాలర్ల వరకు విదేశీ రుణాలు తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే కాలానికి వచ్చిన విదేశీ రుణాలతో పోలిస్తే, ఇది 9 శాతం తక్కువ.

03/31/2019 - 05:38

న్యూఢిల్లీ, మార్చి 30: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) అనుబంధ సంస్థల్లో ఒకటైన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌కు చెందిన వాటాల్లో కొంత భాగాన్ని అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ సంస్థ ‘జనరల్ అట్లాంటిక్ గ్రూప్’నకు అలాగే ప్రత్యామ్నాయ పెట్టుబడుల సంస్థ ‘వార్దే పార్ట్‌నర్స్’కు విక్రయించేందుకు నిర్ణయం జరిగింది.

Pages