S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/02/2019 - 23:00

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.00
8 గ్రాములు: రూ.24,872.00
10 గ్రాములు: రూ. 31,090.00
100 గ్రాములు: రూ.3,10,900.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,220.00
8 గ్రాములు: రూ. 25,760.00
10 గ్రాములు: రూ. 32,200.00
100 గ్రాములు: రూ. 3,22,000.00
వెండి
8 గ్రాములు: రూ. 323.20

04/02/2019 - 22:59

సింగపూర్, ఏప్రిల్ 2: భారత దేశంలో స్థిరస్తి రంగంలో పెట్టుబడులు మంచి లాభాలను పంచుతాయన్న విశ్వాసం మదుపర్లలో నెలకొంది. అయితే కొన్ని ప్రభుత్వ విధానాలవల్ల పారదర్శత లోపించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇక్కడి పా రిశ్రామిక పాలకవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సార్వభౌమ, పింఛన్ నిధుల సహా విదేశీ నిధులు భారత దేశంలో పెద్దమొత్తంలో పెట్టుబడులుగా మారుతున్నాయి.

04/01/2019 - 22:44

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 1.03 లక్షల కోట్లు, మే మాసంలో 94,016 కోట్లు, జూన్‌లో 95,610 కోట్లు, జూలైలో 96,483 కోట్లు, ఆగస్టులో 93,960 కోట్లు, సెప్టెంబర్‌లో 94,442 కోట్లు, అక్టోబర్‌లో 1,00,710 కోట్లు, నవంబర్‌లో 97,637 కోట్లు, డిసెంబర్‌లో 94,725 కోట్ల రూపాయలు చొప్పున జీఎస్‌టీ ద్వారా ఆదాయం లభించింది. జనవరిలో 1.02 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో 97,247 కోట్ల రూపాయల మేరకు జీఎస్‌టీ వసూళ్లు జరిగాయి.

04/01/2019 - 22:42

ముంబయి, ఏప్రిల్ 1: ఈవారం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 164.27 పాయింట్లు పెరగ్గా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 45.25 పాయింట్లు పెరిగింది. ఈ పెరుగుదలతో సెనె్సక్స్ 38,837.18 పాయింట్లకు, నిఫ్టీ 11,669.15 పాయింట్లకు చేరాయి. కాగా, అటు బీఎస్‌ఈలో, ఇటు ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్ అత్యధికంగా లాభపడడం విశేషం.

04/01/2019 - 22:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రిలయన్స్ నిప్పో లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌ఎన్‌ఏఎం) తన ఖాతాదారులకు సరికొత్త నజరానాను అందిస్తున్నది. దేశంలోనే మొట్టమొదటిసారి వాయిస్ ఆధారిత లావాదేవీలను ప్రారంభిస్తున్నది. గూగుల్‌తో కుదిరిన ఒప్పందంతో ఈ అవకాశాన్ని ఆర్‌ఎన్‌ఏఎం కల్పిస్తున్నది.

04/01/2019 - 22:39

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.203
8 గ్రాములు: రూ. 26,609.624
10 గ్రాములు: రూ. 33,262.03
100 గ్రాములు: రూ. 3,32,620.3
వెండి
8 గ్రాములు: రూ. 325.18

04/01/2019 - 22:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: స్థిరాస్థి వ్యాపారాల్లో పేరెన్నికగన్న బ్లాక్‌స్టోన్, ఎంబసీ గ్రూప్ జాయింట్ వెంచర్ ‘ఎంబసీ ఆఫీస్ పార్క్’కు చెందిన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ట్రస్ట్ ‘ఆర్‌ఈఐటీ’ సోమవారం ఆరంభ దశలోనే మార్కెట్‌లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ విభాగానికి చెందిన ఇస్యూ బీఎస్‌ఈలో తొలుత రూ.300గా స్థబ్ధుగా విడుదలైంది. అయితే అనూహ్యంగా ఈ ఇస్యూ ధర సుమారు 5.9 శాతం పెరిగి 317.70 రూపాయలకు చేరింది.

04/01/2019 - 22:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సరఫరా అంకుర సంస్థ ‘బాక్స్‌ప్రెష్’ తమ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారినుంచి సుమారు రూ.2కోట్ల నిధులు సమీకరించింది. సోమవారం ఆ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

04/01/2019 - 22:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఆర్థిక ఇక్కట్లలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు మరో ధరాఘాతం తగిలింది. విమానాల ఇంధన ధరలు సోమవారం ఒక శాతం అదనంగా పెరిగాయి. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇలా ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతర్జాతీయంగా నెలకొన్న ధరల పెరగుదల ప్రభావంతోనే ఈ ధరల పెంపును చేపట్టాల్సి వచ్చిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.

04/01/2019 - 22:48

న్యూఢిల్లీ, మార్చి 31: విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) గత రెండు నెలలుగా మనదేశ మార్కెట్లలోకి భారీగా మదుపుచేస్తుండటం తోబాటు దేశీయ మార్కెట్ల నుంచి పెద్దమొత్తాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం జరుగుతోంది. ఈ కారణంగా దేశీయ మార్కెట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 44,500 కోట్ల రూపాయల విదేశీ నిధులు మనదేశం నుంచి వెనక్కు వెళ్లిపోయాయి.

Pages