S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/27/2019 - 22:47

న్యూఢిల్లీ, మార్చి 27: వౌలిక సదుపాయాల రంగంలో జెయింట్‌గా పేరొందిన ఎల్‌అండ్‌టి మరో ఘనతను సాధించింది. దేశంలోనే అతిపెద్దదైన బాహుబలి లాంటి హైడ్రో క్రేకర్‌ను తయారు చేసి విశాఖలోని హెచ్‌పీసిఎల్ రిఫైనరీకి తరలించినట్టు ప్రకటించింది. ఈ హైడ్రోక్రేకర్ బరువు 1,858 టన్నులు. అంతేకాకుండా ప్రస్తుతం ఎల్ అండ్ టీ రెండు వేల టన్నుల కంటే బరువైన పలు హైడ్రోక్రేకర్ రియాక్టర్లను తయారు చేస్తోంది.

03/27/2019 - 22:47

ముంబయి, మార్చి 27: టాటా ట్రస్టు గ్రూపుల నుంచి ఎన్‌ఏ సూనావాలా అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు. ఈ మేరకు ట్రస్టు గ్రూపు ఒక ప్రకటన విడుదల చేస్తూ సర్ దోరబ్జీ టాటా ట్రస్టు, సర్ రతన్ టాటా ట్రస్టుల నుంచి సూనావాలా (83) అనారోగ్య, వయోభారం కారణంగా తప్పుకుంటున్నారని ప్రకటించింది.

03/27/2019 - 22:46

హాంకాంగ్, మార్చి 27: బిట్ కాయిన్స్ ధరల్లో చోటుచేసుకున్న ఒడిదుడుకుల వల్ల క్రిప్టోకాయిన్స్ మైనింగ్ చిప్స్‌పై మార్కెట్లోకి వెళ్లాలనుకున్న ఆలోచనలను వదులుకున్నట్లు బిట్‌మైన్ టెక్నాలజీస్ పే ర్కొంది. ఐపీవోల జారీ ప్రతిపాదనలకు స్వస్తి చెప్పినట్లు ఆ సంస్థ పేర్కొంది. క్రిప్టో కాయిన్స్ మైనింగ్ చిప్స్ ఐపీవోల ద్వారా 3 బిలియన్ అమెరికన్ డాలర్లను సేకరించాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ప్రణాళిక ను ఖరారు చేసింది.

03/26/2019 - 22:46

ముంబయి, మార్చి 26: పెండింగ్‌లో ఉన్న వేతన బకారుూలు చెల్లించాలని జెట్ ఎయిర్‌వేస్ దేశీయ పైలెట్ల సంఘం జాతీయ వైమానికుల గిల్డ్ (నాగ్) నేతృత్వంలో మంగళవారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసింది. ‘నాగ్’ నేతలు ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌ను కలిసి చర్చలు జరిపారు.

03/26/2019 - 22:45

ముంబయి, మార్చి 26: అంతర్జాతీయంగా సానుకూలతలు నెలకొనడంతోబాటు, దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ నిధులు వెల్లువలా రావడంతో మంగళవారం సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. వరుసగా రెండు రోజులు తీవ్ర నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెనె్సక్స్ మళ్లీ లాభాల పరుగు అందుకుని 425 పాయింట్లు లాభపడి 38,000 మార్కును దాటింది. హెవీ వెయిట్స్ రిలయన్స్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా లాభాలను సంతరించుకున్నాయి.

03/26/2019 - 22:43

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

03/26/2019 - 22:43

న్యూఢిల్లీ, మార్చి 26: నిష్పక్షపాతమైన అధ్యయన కమిటీని ఏర్పాటుచేసి దేశ వృద్ధిరేటు గణాంకాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిరేటు 7వాతం ఉంటే మరి ఎందుకు అవసరమైనన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడలేదని ఆయన ప్రశ్నించారు.

03/26/2019 - 22:42

న్యూఢిల్లీ, మార్చి 26: రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై రిజర్వు బ్యాంక్ కొరడా ఝళిపించింది. రూ.2కోట్ల జరిమానా వి ధించింది. ప్రపంచ వ్యాప్త బ్యాంకుల అంతర్గత ఆర్థిక టెలికమ్యూనికేషన్స్ సొసైటీ (స్విఫ్ట్) నిబంధనలను పీఎన్‌బీ అమలు చేయకపోవడాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. పీఎన్‌బీ స్వయంగా మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

03/25/2019 - 23:27

ముంబయి, న్యూఢిల్లీ, మార్చి 25: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌కు ఆర్థిక ఊతం లభించింది. 26 ఏళ్లపాటు బోర్డు సభ్యునిగా కొనసాగిన వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో రుణ దాతలు ముందుకు వచ్చి ఈ ఎయిర్‌లైన్స్‌ను గట్టెక్కించేందుకు 1500 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకించించారు.

03/25/2019 - 23:25

ముంబయి, మార్చి 25: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశాలున్నాయన్న అంచనాలు దేశ, విదేశాల్లోని ఇనె్వస్టర్లలో ఆందోళన రేపాయి. దీంతో సోమవారం పెద్దయెత్తున వాటాల అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా బ్యాంకింగ్, రియాలిటీ కౌంటర్లలో భారీగా వాటాల అమ్మకం చోటుచేసుకోవడంతో సెనె్సక్స్ 38,000 పాయింట్ల మార్కుకు దిగువకు చేరుకుంది.

Pages