S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/25/2019 - 23:24

న్యూఢిల్లీ, మార్చి 25: రిజర్వు బ్యాంకు గవర్నర్ శశికాంత దాస్ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ ఆర్థిక స్థితిగతులపై చర్చ జరిగినట్టు సమాచారం. ప్రత్యేకించి 2019-20 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన తొలి నెలవారీ ద్రవ్య విధానంపై చర్చించినట్టు తెలిసింది.

03/25/2019 - 23:23

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,146.00
8 గ్రాములు: రూ.25,168.00
10 గ్రాములు: రూ. 31,460.00
100 గ్రాములు: రూ.3,14,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,366.00
8 గ్రాములు: రూ. 26,928.00
10 గ్రాములు: రూ. 33,660.00
100 గ్రాములు: రూ. 3,36,600.00
వెండి
8 గ్రాములు: రూ. 332.00

03/25/2019 - 23:23

ముంబయి, మార్చి 25: రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం 2 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయని సోమవారం విడుదలైన ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 0.7 శాతం ఉండగా రాబోయే ఏడాది కాలంలోనే 2 శాతానికి చేరవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.

03/25/2019 - 03:15

న్యూఢిల్లీ: నివాసాల ఏసీ సెగ్మెంట్‌లో భారీ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉన్నట్టు మిత్సుబిషి ఎలక్ట్రానిక్స్ అంచనా వేస్తున్నది. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందువల్ల, తమ సంస్థ ఏసీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని జపాన్‌కు చెందిన ఈ కంపెనీ భావిస్తున్నది. మెట్రో నగరాలతోపాటు, చిన్నాపెద్దా నగరాల్లో కూడా మార్కెట్‌ను విస్తరింప చేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంది.

03/24/2019 - 23:48

న్యూఢిల్లీ, మార్చి 24: దివాలా ప్రక్రియకు వెళ్లిన జ్యోతి స్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు కొంత ఊరట లభించింది. గతంలో ఇచ్చిన లిక్విడేషన్ ఉత్తర్వును నేషనల్ కంపెనీ లా అపెలైట్ ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) రద్దు చేసింది.

03/24/2019 - 23:46

న్యూఢిల్లీ, మార్చి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం అస్థిర పరిస్థితుల్లో కొనసాగే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు వేచిచూద్దామన్న మదుపర్ల వైఖరితోపాటు ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుండటం వంటి కారణాలు ఇందుకు దోహదం చేయవచ్చని అంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగిడడంతో రుణ మార్కెట్లకు ద్రవ్య లభ్యత తగ్గవచ్చని అంటున్నారు.

03/24/2019 - 23:45

న్యూయార్క్, మార్చి 24: అమెరికాకు చెందిన ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ శాంషెక్‌లో పెట్టుబడులకు నాయర్ వెంచర్స్ అంగీకారం తెలిపింది. ఎంత మొత్తం అనే విషయాన్ని ప్రస్తావించకుండా, శాంషెక్‌తో ఒప్పందం కుదిరిందని నాయర్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూకే, యూఎస్‌తోపాటు భారత్‌లోనూ మార్కెట్‌ను విస్తరించడానికి అవసరమైన మొత్తాలను, వౌలిక సదుపాయాలను శాంషెక్‌కు సమకూరుస్తున్నట్టు నాయర్ తన ప్రకటనలో వివరించింది.

03/24/2019 - 23:44

న్యూఢిల్లీ, మార్చి 24: అంతర్జాతీయంగా ద్రవ్య లబ్ధత మెరుగు పడడంతో, దేశీయ కేపిటల్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చి చేరాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ) సుమారు 38,211 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టారు. డెబిట్, ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 11,182 కోట్ల రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య లబ్ధతను సరళీకృతం చేశారు.

03/24/2019 - 04:45

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. దేశీయ ప్రయాణీకుల సౌకర్యం కోసం ‘డొమిస్టిక్ అరైవల్స్ టెర్మినల్’ను శనివారం నాటి నుంచి అందుబాటులోకి తెచ్చారు. మొదటిసారి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎస్‌జీ 468 విమాన ప్రయాణీకులు కొత్త సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.

03/23/2019 - 23:36

వాషింగ్టన్, మార్చి 23: లాటిన్ అమెరికన్ దేశాల్లో ఒకటైన వెనెజులాపై తమ దేశం విధించిన ఆంక్షలను భారత కంపెనీలు పాటిస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లోని ప్రైవేటు కంపెనీలన్నీ ఆ దేశం నుంచి ముడిచమురు దిగుమతులను ఆపివేశాయని అమెరికా పరిపాలనా విభాగానికి చెందిన అధికారి ఒకరు ఇక్కడ స్పష్టం చేశారు.

Pages