S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/20/2019 - 22:51

ముంబయి, మార్చి 20: బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్థిరంగా కొనసాగింది. అమ్మకాల ఒత్తిళ్లుగానీ, కొలుగోళ్ల హడావుడిగానీ లేకపోవడంతో, పది గ్రాముల బంగారం ధర 32,970 రూపాయలతో మొదలైన ట్రేడింగ్ అదే ధర వద్ద ముగిసింది. మార్కెట్‌లో బంగారం ఈ విధంగా ఎ లాంటి మార్పు లేకుండా, యథాతథంగా కొనసాగ డం అరుదు. కాగా, కిలో వెండి ధర మాత్రం 40 రూపాయలు పెరిగి, 39,000 రూపాయలకు చేరింది.

03/20/2019 - 22:51

కోల్‌కతా, మార్చి 20: వ్యాపార విశే్లషకులకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. కోల్‌కతాలోని ఎస్‌ఐఎస్, ఐఐఎంలో, ఖరగ్‌పూర్‌లోని ఐటీ లో కోర్సు పూర్తి చేసిన వారికి భారీ జీతాలు ఇచ్చేందుకు కార్పొరేట్ సంస్థ లు ముందుకొస్తున్నాయి. 2017- 2019 విద్యా సంవత్సరంలో కోర్టును పూర్తి చేసిన వారికి, అంతకు ముందు బ్యాచ్ వారితో పోలిస్తే 11 శాతం జీ తం అధికంగా ఆఫర్ చేస్తున్నారు.

03/20/2019 - 04:43

ముంబయి: దేశీయ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఏడోరోజు స్టాక్‌మార్కెట్ కళకళలాడుతోంది. మంగళవారం బీఎఎస్‌సీ సెనె్సక్స్ అమాంతం 268 పాయింట్లు లాభపడగా, అదే సమయంలో నిఫ్టీ కూడా 11,500 పాయింట్ల దగ్గర స్థిరపడింది. గడచిన కొద్దిరోజులుగా విదేశీ పెట్టుబడులు పెరుతుండడంతో ఐటీసీ, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్ వంటి రంగాలు లాభపడ్డాయి. కొనుగోళ్ల అండతో సూచీలు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

03/19/2019 - 22:51

న్యూఢిల్లీ, మార్చి 19: భారతదేశంలో వచ్చేనెలలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా స్టాక్‌మార్కెట్‌లో కొనసాగుతున్న ర్యాలీ కారణంగా రానున్న 12 నెలల కాలంలో నిఫ్టీ 12,500 పాయింట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చునని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ సచ్స్ అంచనా వేస్తోంది.

03/19/2019 - 22:49

న్యూఢిల్లీ, మార్చి 19: ప్రముఖ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీని టేకోవర్ చేసుకునేందుకు లార్సన్ అండ్ టుబ్రో బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు రావడం పట్ల ఆ కంపెనీ ప్రమోటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైండ్‌ట్రీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీ మనుగడకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు.

03/19/2019 - 22:48

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,111.00
8 గ్రాములు: రూ. 24,888.00
10 గ్రాములు: రూ. 31,110.00
100 గ్రాములు: రూ.3,11,100.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,331.00
8 గ్రాములు: రూ. 26,648.00
10 గ్రాములు: రూ. 33,310.00
100 గ్రాములు: రూ. 3,33,100.00
వెండి
8 గ్రాములు: రూ. 332.00

03/19/2019 - 22:48

ముంబయి, మార్చి 19: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్నది. దేశంలోనేగాక, ప్రపంచ దేశాల్లోనూ ఐటీ పరిశ్రమ వృద్ధి చెందుతునే ఉంది. అంతర్జాతీయ ఐటీ మార్కెట్‌లో భారతీయులే కీలక పాత్ర పోషిస్తున్నారన్నది వాస్తవం. ఈనెలతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉంది. తుది నివేదికలో ఇది ఎంత మేర నమోదైందో తెలుస్తుంది.

03/19/2019 - 04:28

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కిరణ్ మజుందార్ షా నియామకానికి షేర్ హోల్డర్లు ఆమోద ముద్ర వేశారు. పాలక మండలి ఇది వరకే ఆమెను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగించాలని నిర్ణయించగా, సోమవారం జరిగిన ఓటింగ్‌లో ఆమెకు తిరుగులేని మద్దతు లభించింది. స్థూలంగా చూస్తే, 92.2 శాతం మంది ఆమె నియామకానికి అనుకూలంగా ఓటు వేస్తే, 7.7 శాతం మంది వ్యతిరేకించారు.

03/18/2019 - 23:08

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ. 24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.203
8 గ్రాములు: రూ. 26,609.624
10 గ్రాములు: రూ. 33,262.03
100 గ్రాములు: రూ. 3,32,620.3
వెండి
8 గ్రాములు: రూ. 332.00

03/18/2019 - 22:50

ముంబయి, మార్చి 18: ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వరుసగా ఆరో రోజు కూడా సానుకూల ధోరణుల్లో కొనసాగింది. ఈవారం లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం 70.75 పాయింట్లు (0.19 శాతం) పెరిగిన సెనె్సక్స్ 38,095.07 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 35.35 పాయింట్లు (0.31 శాతం) పెరిగి, 11,462.20 పాయింట్లకు చేరింది.

Pages