S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/06/2019 - 22:55

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రస్తుతం వాడుకలో లేని నయాగన్ సిమెంట్ ఫ్యాక్టరీ యూనిట్‌ను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించామని, దీనికి ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నామ ని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) ప్రకటించింది.

03/06/2019 - 22:54

న్యూఢిల్లీ, మార్చి 6: అమెరికా రాజధానిలోని బ్రాండెడ్ క్రీడా దుస్తుల తయారీ సంస్థ ‘అండర్ ఆర్మర్’ భారత్‌లో తమ శాఖా కార్యాలయం ద్వారా వాణిజ్యాన్ని ఆరంభిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. పూర్తి స్థాయి సొంత శాఖ ద్వారా ఈ కార్యకలాపాలను సాగిస్తామని అండర్ ఆర్మర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ గోకుల్‌దాస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

03/07/2019 - 02:48

రాజమహేంద్రవరం: సాగు, తాగు నీటి కోసం యుద్ధాలే జరుగుతున్న ప్రస్తుత కాలంలో ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోని పలు పరిశ్రమల పాలిట గోదావరి నది జీవనవాహినిగా మారింది. పరిశ్రమలకు నీటి అవసరాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. అంతేకాదు పరిశ్రమల మనుగడకు అత్యావశ్యకమైన ఈ జీవ జలాలు అత్యంత చౌకగా అందుతున్నాయి. పూర్వం ఎపుడో నిర్ణయించిన ధరలకే నేటికీ జలాలను పొందుతున్న వైనం కన్పిస్తోంది.

03/06/2019 - 03:48

హైదరాబాద్: ఎట్టకేలకు హైదరాబాద్ నగరవాసులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఆర్టీసీ సీఎండీ సునీల్‌శర్మ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. తొలి దశలో 40 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేశారు. మియాపూర్, కంటోనె్మంట్ బస్సు డిపోల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడుపుతున్నారు.

03/05/2019 - 22:54

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఎగుమతి సుంకపు రాయితీల ఎత్తివేత నిర్ణయం వల్ల మన దేశపు ఎగుమతులపై ఎలాంటిపై ప్రభావం ఉండబోదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడిక్కడ స్పష్టం చేసింది. ‘జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెనె్సస్ (జీఎస్‌పీ) పథకం కింద కొన్ని ఉత్పత్తులపై అమెరికా ఎగుమతుల సుంకంపై ఇప్పటి వరకు రాయితీలు వచ్చేవి.

03/05/2019 - 22:52

ముంబయి, మార్చి 5: వాహన, ఫైనాన్షియల్, విద్యుత్ కౌంటర్లలో వాటాల కొనుగోళ్లు భారీగా జరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు అందుకున్నాయి. సెనె్సక్స్ 378.73 పాయింట్లు ఎగబాకి 36,442.54 మార్కును తాకింది. ఇక నిఫ్టీ సైతం 123.95 పాయింట్లు లాభపడి 10,987.45 పాయంట్లకు చేరింది. సెనె్సక్స్ విభాగంలో సుమారు 23 స్టాక్స్ లాభపడగా, ఏడు కౌంటర్లు నష్టపోయాయి.

03/05/2019 - 22:50

న్యూఢిల్లీలో మంగళవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రతినిధుల బృందంతో సమావేశమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.

03/05/2019 - 22:48

న్యూఢిల్లీ, మార్చి 5: జర్మనీకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్ధ ఆడీ మంగళవారం సరికొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘సెడాన్ లైఫ్‌స్టైల్’ పేరిట రూపుదిద్దుకున్న ఈ కొత్త ఎడిషన్ కారు ధర 49.99 లక్షలు. రియర్ సీట్ ఎంటర్‌టెయినె్మంట్, మొబైల్ కాఫీ మిషన్ ఎస్‌ప్రెసోమోబిల్, ఎంట్రీ, ఎగ్జిట్ లైట్లు వంటి అధునాతన హంగులతో ఈ కారు ఆకట్టుకుంటుంది.

03/05/2019 - 22:47

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,236.00
8 గ్రాములు: రూ.25,888.00
10 గ్రాములు: రూ. 32,360.00
100 గ్రాములు: రూ.3,23,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,460.963
8 గ్రాములు: రూ. 27,687.704
10 గ్రాములు: రూ. 34,609.63
100 గ్రాములు: రూ. 3,46,096.3
వెండి
8 గ్రాములు: రూ. 332.80

03/05/2019 - 22:46

ఢిల్లీ, మార్చి 5: నిబంథనలను అమలు చేయని అలహాబాద్ బ్యాంక్ తీరుపై భారతీయ రిజర్వుబ్యాంక్ (ఆర్‌బీఐ) మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ప్రత్యేకించి నోస్ట్రో ఖాతాలపై ఇచ్చిన సూచనలను అమలు చేయకపోవడంపై ఆర్బీఐ మండిపడింది. ఒక బ్యాంకు తన విదేశీ కరెన్సీని మరో బ్యాంకులో మదుపు చేయడానికి ఏర్పాటుచేసే ఖాతాను నోస్ట్రో ఖాతా అంటారు.

Pages