S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/01/2019 - 21:34

న్యూఢిల్లీ, మార్చి 1: భారత స్టాక్, క్యాపిటల్ మార్కెట్‌ను నియంత్రీకరించే భారత సెక్యూరిటీలు అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డు (సెబీ) వసూలు చేస్తున్న వివిధ ఫీజులు తగ్గనున్నాయి. దీనితోపాటు ఇతరత్రా పలు అంశాలకు సంబంధించి శుక్రవారం నాటి సమావేశంలో, స్టాక్ బ్రోకర్లు చెల్లించే ఫీజుతోపాటు, స్టాక్ ఎక్ఛ్సేంజీలు, లిస్టింగ్‌కు దరఖాస్తు చేసుకునే కంపెనీలు చెల్లించే రుసుమును తగ్గిస్తూ తీర్మానాన్ని సెబీ ఆమోదించింది.

03/01/2019 - 21:33

ముంబయి, మార్చి 1: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ లాభాల పట్టాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న టెన్షన్ తగ్గడంతో మార్కెట్లకు ఊతం లభించింది. వరుసగా మూడు రోజులపాటు నష్టాల పాలైన కీలకమైన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ శుక్రవారం బలమైన సానుకూలతలతో ఆరంభమై పరుగులు పెట్టి 36,140.67 పాయింట్లను తాకింది. రోజంతా ఆగకుండా విదేశీ పెట్టుబడులు కొనసాగుతూండటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.

03/01/2019 - 21:31

న్యూఢిల్లీ, మార్చి 1: ఎస్ బ్యాంక్ వాటాలు శుక్రవారం దాదాపు 3శాతం లాభపడ్డాయి. ఈ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మూడేళ్ల కాల వ్యవధికి రవనీత్ గిల్ బాథ్యతలు చేపట్టినట్టు బ్యాంకు అధికారులు ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో ఈ బ్యాంకు వాటాలకు సానుకూలతలు ఆరంభం కావడం గమనార్హం.

03/01/2019 - 21:31

వెల్లింగ్టన్, మార్చి 1: పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఓ పర్యావరణ వైపరీత్యం కారణంగా హాంగ్‌కాంగ్‌కు చెందిన అతిపెద్ద నౌక ఒకటి సోలోమన్ ఐల్యాండ్‌లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలం సమీపంలోకి కొట్టుకుపోయింది. దెబ్బతిన్న ఈ నౌక నుంచి పెద్దయెత్తున చమురు నిల్వలు లీక్ అవుతున్నాయని ఆస్ట్రేలియా దేశపు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

03/01/2019 - 21:30

న్యూఢిల్లీ, మార్చి 1: దేశ, విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో శుక్రవారం బంగారు, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాములు (తులం) బంగారంపై 120 రూపాయలు తగ్గి 34,080 రూపాయలు పలికింది. అలాగే వెండి ధరలు సైతం కిలోపై 370 రూపాయలు తగ్గి 40,680కి దిగివచ్చింది. పరిశ్రమల యూనిట్లు, నాణేల మార్కెట్ల నుంచి డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యాపార వర్గాలు తెలిపాయి.

03/01/2019 - 05:09

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో డీఎక్స్‌ఎన్ పరిశ్రమల్లో ఆరునెలల్లో ఉత్పత్తులు తయారు కాలాలన్నదే తన లక్ష్యమని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ పరిశ్రమతో నియోజక వర్గంలో వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపటమే ధ్యేయమన్నారు. సిద్దిపేట జిల్లా మందపల్లి పారిశ్రామికవాడలో మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించి, డీఎక్స్‌ఎన్ నిర్మాణ పనులను క్షేత్ర పనుల పురోగతిని పర్యవేక్షించారు.

02/28/2019 - 22:19

ముంబయి, ఫిబ్రవరి 28: దేశంలో సిమెంట్ వినియోగం 2020లో 6 నుంచి 8 శాతం పెరిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు గృహ నిర్మాణం, వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడం ఇందుకు దోహదం చేయవచ్చని ఇండియా రేటింగ్స్ అధ్యయన నివేదిక పేర్కొంది. వరుసగా ఈ సంవత్సరం కూడా డిమాండ్ అధికంగా ఉన్నందువల్ల సిమెంట్ తయారీదార్లు సైతం మంచి లాభాలను సంతరించుకునే వీలుందని తెలిపింది.

02/28/2019 - 22:17

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,275.00
8 గ్రాములు: రూ.26,200.00
10 గ్రాములు: రూ. 32,750.00
100 గ్రాములు: రూ.3,27,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,502.674
8 గ్రాములు: రూ. 28,021.392
10 గ్రాములు: రూ. 35,026.74
100 గ్రాములు: రూ. 3,50,267.4
వెండి
8 గ్రాములు: రూ. 349.60

02/28/2019 - 22:15

ముంబయి, ఫిబ్రవరి 28: ద్రవ్యోల్బణం వచ్చే అక్టోబర్ వరకు సుమారు 4 శాతానికి లోబడి ఉండే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లపై 75 నుంచి 100 బేసిక్ పాయింట్ల మేర కోత విధించే అవకాశాలున్నాయి. ఈనెలలో తీసుకున్న కొన్ని విధాన నిర్ణయాల వల్ల మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం లేకపోలేదని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

02/28/2019 - 22:14

ముంబయి, ఫిబ్రవరి 28: వరుసగా మూడోరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో నడిచాయి. అయితే గురువారం ఈ నష్టాలు స్వల్ప స్థాయికే పరిమితం కావడం గమనార్హం. బీఎస్‌ఈ సెనె్సక్స్ 37.99 పాయింట్లు కోల్పోయి 0.11 శాతం నష్టాలతో 35,867.44 వద్ద స్థిరపడగా, నిఫ్టీ సైతం ఊగిసలాటకు గురై 15.70 పాయింట్లు కోల్పోయి 0.13 శాతం నష్టాలతో 10,792.50 వద్ద స్థిరపడింది.

Pages