S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/28/2019 - 02:57

అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులకు ‘ఏడెక్కో’ సంస్థ ముందుకొచ్చింది. భారత్‌లో పెద్దఎత్తున వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉందని ఇందులో భాగంగా ఏపీలో సంస్థను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు ‘ఏడెక్కో’ సంస్థ కంట్రీ హెడ్ మార్కో వాల్సెచి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ స్వామినాథన్ వెల్లడించారు.

02/28/2019 - 00:03

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తమ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్న ఎస్‌యూవీ క్రెటా మోడల్ కారు అమ్మకాలు ఐదు లక్షల మైలురాయిని అధిగమించినట్టు హ్యుందయ్ మోటార్ ఇండియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 జూలై మాసంలో మార్కెట్‌లోకి విడుదలైన ఈ మోడల్ కారుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్టు తెలిపింది. కేవలం భారత దేశంలోనే 3.7 లక్షల కార్లు అమ్ముడయ్యాయని, విదేశాల్లో అమ్ముడైన కార్ల సంఖ్య 1.40 లక్షలని వివరించింది.

02/28/2019 - 00:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత స్టాక్ మార్కెట్లలో బుధవారం సెనె్సక్స్, నిఫ్టీ పాయింట్లు పతనం కావడం బులియన్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. షేర్లపై పెట్టుబడులకు వెనుకంజ వేసిన పెట్టుబడిదారులు, అందుకు ప్రత్యామ్నాయంగా బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తిని ప్రదర్శించారు. దేశీయ జ్యుయెలరీ తయారీదారులు, రీటైలర్ల నుంచి డిమాండ్ ఉండడంతో, పది గ్రాముల బంగారం ధర 120 రూపాయలు పెరిగి, 34,650 రూపాయలకు చేరింది.

02/28/2019 - 00:00

ముంబయి, ఫిబ్రవరి 27: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) బుధవారం నాటి లావాదేవీలను యుద్ధ భయం వెంటాడింది. ఫలితంగా ఆరంభంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 68 పాయింట్లు కోల్పోయింది. నిష్టీ కూడా సుమారు 29 పాయింట్ల పతనమైంది. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించడం స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

02/27/2019 - 23:58

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,275.00
8 గ్రాములు: రూ.26,200.00
10 గ్రాములు: రూ. 32,750.00
100 గ్రాములు: రూ.3,27,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,502.674
8 గ్రాములు: రూ. 28,021.392
10 గ్రాములు: రూ. 35,026.74
100 గ్రాములు: రూ. 3,50,267.4
వెండి
8 గ్రాములు: రూ. 349.60

02/27/2019 - 23:58

ముంబయి, ఫిబ్రవరి 27: బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముఖ చిత్రం ద్వారా కస్టమర్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) మ్యాపింగ్‌కు తోడ్పడాలన్న సరికొత్త ప్రతిపాదన రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది.

02/27/2019 - 23:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: బలహీన బ్యాంకుల జాబితా నుంచి విముక్తి కలుగజేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ధనలక్ష్మీ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వాటాలు స్టాక్ మార్కెట్‌లో సానుకూలతను సంతరించున్నాయి. బుధవారం ఈ మూడు బ్యాంకుల వాటాలు సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

02/26/2019 - 23:49

ముంబయి: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వాయుసేన దాడులను చేపట్టిన క్రమంలో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌లో మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరచింది. దీంతో సూచీలు మంళవారం నష్టాలను నమోదు చేశాయి. ప్రత్యేకించి బీఎస్‌ఈ సెనె్సక్స్ 240 పాయింట్ల దిగువన నమోదైంది. నిన్న అంతర్జాతీయంగా మంచి సానుకూలతలు అందుకున్న ఈక్విటీలు, ఫైనాన్షియల్, రియాలిటీ వాటాలు సైతం అమ్మకాల వత్తిడికి గురయ్యాయి.

02/26/2019 - 23:47

ముంబయి, ఫిబ్రవరి 26: త్వరలో సరికొత్త సిరీస్ రూ.100 కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడిక్కడ తెలిపింది. మహాత్మా గాంధీ కొత్త సిరీస్ నుంచి విడుదల చేయనున్న ఈ రూ.100 డినామినేషన్ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అధికారులు వివరించారు.

02/26/2019 - 23:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని కంపెనీలకు చెందిన 147.72 కోట్ల విలువైన ఆస్తులను మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ముంబయితోబాటు గుజరాత్‌లోని సూరత్‌లోగల పలు స్థిర, చరాస్తులను ఈ ఈడీ అటాచ్ చేయగా ఈ ఆస్తుల మార్కెట్ విలువ 147 కోట్ల 72 లక్షల 86వేల 651 రూపాయలు అని అధికారులు వెల్లడించారు.

Pages