S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/10/2019 - 03:28

ముంబయి, మార్చి 9: సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి ఖలీద్ అల్‌ఫలీ మరోసారి భారత్ వచ్చారు. మూడు వారాల్లో ఆయన రావడం ఇది రెండోసారి. భారతీయుల్లో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడైన ఆకాశ్ అంబానీ వివాహానికి ఆయన హాజరయ్యారు. భారత చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆయన కొంత సేపు చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు.

03/10/2019 - 03:24

పారిస్‌లో బెలూన్లు చేతబట్టి భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ఎల్లోవెస్ట్స్ నిరసనకారులు. ఫ్రెంచ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు లోపభూయష్టంగా ఉన్నాయని, వీటి వల్ల ధనవంతులే లాభపడుతున్నారని ఎల్లోవెస్ట్స్ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

03/10/2019 - 03:20

ముంబయి, మార్చి 9: ఈవారం స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే, ట్రేడింగ్ లాభసాటిగా సాగిందనే చెప్పాలి. సోమవారం మహాశివరాత్రి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లావాదేవీలు జరగలేదు. ఆతర్వాత వరుగా మూడు రోజుల ట్రేడింగ్ మదుపరులకు లాభాలను ఆర్జించిపెట్టింది. అయితే, వ్యాపారానికి చివరి రోజైన శుక్రవారం మాత్రం స్వల్ప నష్టాలను ఎదుర్కొంది.

03/08/2019 - 21:50

చెన్నై, మార్చి 8: అశోక్ లేలాండ్‌కు గుజరాత్ నుంచి భారీ ఆర్డర్ లభించింది. అక్కడి రోడ్డు రవాణా కార్పొరేషన్ (జీఎస్‌ఆర్‌టీసీ) నుంచి 1,200 బస్సుల సరఫరాకు ఆర్డర్‌ను పొందింది. దీనితో ఇటీవల కాలంలో మొత్తం 2,580 బస్సులకు ఆర్డర్లు లభించినట్టు హిందూజా గ్రూప్‌లోని ఒక విభాగమైన అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే. దాసరి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

03/08/2019 - 21:49

ముంబయి, మార్చి 8: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఫలితంగా నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్, జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ స్వల్పంగా పతనమయ్యాయి.

03/08/2019 - 21:47

న్యూఢిల్లీ, మార్చి 8: జాగర్‌నాట్ బుక్స్ పబ్లిషింగ్ హౌస్‌తో హార్పర్‌కొలిన్స్ ఇండియా వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం, జాగర్‌నాట్ ప్రచురించిన పుస్తకాల అమ్మకాలు, సరఫరా బాధ్యతలను హార్పర్‌కొలిన్స్ స్వీకరించింది. ఈ మేరకు ఒప్పందం పత్రాలపై సంతకాలు జరిగినట్టు ఈ రెండు పబ్లిషింగ్ సంస్థల ఉన్నతాధికారులు ప్రకటించారు.

03/08/2019 - 21:45

న్యూఢిల్లీ, మార్చి 8: దేశంలోని పెద్ద ఔషధ కంపెనీల్లో ఒకటైన జూబిలెంట్ లైఫ్ సైనె్సస్ విస్తరణ ప్రణాళికకు అడ్డుకట్ట పడే ప్రమాదం కనిపిస్తున్నది.

03/08/2019 - 21:44

న్యూఢిల్లీ, మార్చి 8: బులియన్ మార్కెట్ శుక్రవారం మళ్లీ లాభాల బాట పట్టింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు పడిపోగా, కిలో వెండి ధర 520 రూపాయలు పతనమైంది. విదేశీ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించకపోవడంతోపాటు, దేశీయ నగల వర్తకులు కూడా వెనుకంజ వేయడంతో బులియన్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. అయితే, శుక్రవారం నాటి ట్రేడింగ్ అందుకు భిన్నంగా సాగింది.

03/08/2019 - 21:42

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,135.00
8 గ్రాములు: రూ.25,080.00
10 గ్రాములు: రూ. 31,350.00
100 గ్రాములు: రూ.3,13,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,352.941
8 గ్రాములు: రూ. 26,823.528
10 గ్రాములు: రూ. 33,529.410 గ్రాములు: రూ. 3,35,294.10
వెండి
8 గ్రాములు: రూ. 328.80

03/08/2019 - 01:25

న్యూఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో అంధులకు ఉపయోగకరంగా ఉండే ప్రత్యేక నాణాలను విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, షిప్పింగ్ శాఖ మంత్రి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు.

Pages