S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/07/2019 - 22:52

న్యూఢిల్లీ, మార్చి 7: అమెరికా, భారత్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదా? ఇప్పటి వరకూ చైనాను మాత్రమే వాణిజ్య పరంగా నూటికినూరు శాతం ప్రత్యర్థిగా భావిస్తున్న అమెరికా, ఇప్పుడు ఆ జాబితాలో భారత్‌ను కూడా చేరుస్తుందా? ఈ ప్రశ్నలు వ్యాపార వేత్తలను, వివిధ పరిశ్రమలతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉన్న వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి.

03/07/2019 - 22:50

ముంబయి, మార్చి 7: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వరుసగా నాలుగో రోజు కూడా లాభాలను ఆర్జించింది. ట్రేడింగ్ ఆశనిరాశల మధ్య కొనసాగినప్పటికీ, చివరికి సెనె్సక్స్ 89.32 పాయింట్లు పెరగడంతో, 36,725.42 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ 5.20 పాయింట్లు పెరిగి, 11,058.20 పాయింట్లుగా నమోదైంది. దేశీయ మదుపరులు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శించడంతో ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లకు డిమాండ్ ఏర్పడింది.

03/07/2019 - 22:48

ముంబయి, మార్చి 7: బులియన్ మార్కెట్‌కు గురువారం ఎవరూ ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. అటు విదేవీ పెట్టుబడిదారులు, ఇటు దేశీయ మదుపరులు కూడా నిరాసక్తంగా వ్యవహరించడంతో, బులియన్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. పది గ్రాముల బంగారం 360 రూపాయలు, కిలో వెండి 520 రూపాయలు చొప్పున నష్టపోయాయి. బులియన్ మార్కెట్‌లో లావాదేవీలు మొదలైన మరుక్షణం నుంచే సూచీ పతనం మొదలైంది.

03/07/2019 - 22:48

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,135.00
8 గ్రాములు: రూ.25,080.00
10 గ్రాములు: రూ. 31,350.00
100 గ్రాములు: రూ.3,13,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,352.941
8 గ్రాములు: రూ. 26,823.528
10 గ్రాములు: రూ. 33,529.41
100 గ్రాములు: రూ. 3,35,294.1
వెండి
8 గ్రాములు: రూ. 332.80

03/07/2019 - 22:47

ముంబయి, మార్చి 7: డిజిటల్ రంగంలో వౌలిక సదుపాయాలు విస్తరించడంతో మనదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ గణనీయమైన ప్రగతిని సంతరించుకుంది. దీని ద్వారా దేశ ఆదాయం వచ్చే 2023 నాటికి 11,900 కోట్ల రూపాయలకు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ ద్వారా 2014లో సుమారు రూ.2000 కోట్ల ఆదాయం రాగా అది 2018లో ద్విగుణీకృతమై రూ.4,400 కోట్లకు చేరింది.

03/07/2019 - 22:46

ముంబయి, మార్చి 7: ప్రభుత్వ నేతృత్వంలో నడస్తున్న ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) సంస్థలో పనిచేసే ఉద్యోగులకు యాజమాన్యం ఫిబ్రవరి నెల జీతాల్లో 50 శా తం కోత విధించింది. దేశంలోని ప్రధాన పరిశోధ నా సంస్థల్లో ఒకటైన ఈ సంస్థ ప్రస్తుతం నిధుల కొ రతను ఎదుర్కొంటుండటం గమనార్హం.

03/07/2019 - 04:08

న్యూఢిల్లీ: చెన్నైలోని ది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక కోచ్‌లను తయారు చేసిన సంస్థగా గుర్తింపు పొందింది. గత నెల ఐసీఎఫ్ 301 కోచ్‌లను తయారు చేసింది. దీనితో ఇక్కడ ఉత్పత్తయిన కోచ్‌ల సంఖ్య 2,919కి చేరింది. దీనితో రైల్‌కార్ తయారీలో, ప్రపంచంలోని మిగతా కోచ్ ఫ్యాక్టరీలను వెనక్కునెట్టి, నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.

03/06/2019 - 23:25

న్యూఢిల్లీ, మార్చి 6: బంగారం, వెండి వాణిజ్యం బుధవారం స్థబ్ధుగా సాగింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) బంగారం ధర 33,430 పలుకగా, వెండి ధరలు సైతం స్థిరంగా కిలో 39,500 రూపాయలు పలికింది. దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బుధవారం బంగారం ధర తులంపై 20 రూపాయలు తగ్గిందని వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. ఇక అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరల్లో వృద్ధి కనిపించింది.

03/06/2019 - 22:58

ముంబయి, మార్చి 6: వరుసగా మూడో రోజైన బుధవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాటపట్టాయి. వాటాల కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడం ఊతమిచ్చింది. ప్రధానంగా ఫైనాన్స్, లోహ, విద్యుత్ కౌంటర్లలో అధికంగా వాటాల కొనుగోళ్లు జరగాయి. సెనె్సక్స్ 193.56 పాయింట్లు ఎగబాకి 36,636.10 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 65.55 పాయింట్ల లాభంతో 11,000 మార్కును దాటింది.

03/06/2019 - 22:55

గురుగ్రామ్, మార్చి 6: డీబీఎస్ బ్యాంక్ ఇండియా గ్రూప్ మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ బ్యాంకు కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రానున్న 18 నెలల కాలంలో 600 నుంచి 800 మంది వరకు వివిధ విభాగాల్లో సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది.

Pages