S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/01/2019 - 23:37

న్యూఢిల్లీ, జనవరి 1: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో తగ్గాయి. గడచిన యేడాది డిసెంబర్‌లో మొత్తం 94,726 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. గడచిన యేడాది ఇదే కాలంలో రూ.97,637 కోట్లు వసూలైట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా జీఎస్‌టీఆర్-3బి ద్వారా మొత్తం 72.44 లక్షల సేల్స్ రిటర్స్ ఫైళ్లు గత నెలలో దాఖలయ్యాయి. నవంబర్‌లో దాఖలైన 69.6 లక్షల ఫైళ్లకంటే ఇది అధికం.

01/01/2019 - 23:36

ముంబయి, జనవరి 1: భారతీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఆంగ్ల కొత్త సంవత్సరాదిని సానుకూల వాతావరణంలోనే ఆరంభించాయి. సెనె్సక్స్ బీఎస్సీ బెంచ్ మార్కును దాటి 186 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్ రంగాన్ని పునరుద్ధరించేందుకు రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం 36,254.57 పాయింట్ల వద్ద ముగిసింది.

01/01/2019 - 23:35

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,066.00
8 గ్రాములు: రూ. 24,528.00
10 గ్రాములు: రూ. 30,660.00
100 గ్రాములు: రూ. 3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,279.144
8 గ్రాములు: రూ. 26,233.152
10 గ్రాములు: రూ. 32,791.440
100 గ్రాములు: రూ. 3,27,914.40
వెండి
8 గ్రాములు: రూ. 332.20

01/01/2019 - 17:11

ముంబయి: కొత్త సంవత్సరంలో మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 186 పాయింట్లు లాభపడి 36,254 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 10,910 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.65గా కొనసాగుతోంది.

01/01/2019 - 03:43

ముంబయి: ఈ ఏడాది చివరి రోజైన సోమవారం సెనె్సక్స్ నామమాత్ర పతనంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూలంగానే స్పందించినప్పటికీ, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సమాయత్తమైన మదుపరులు స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలపై అం తగా ఆసక్తి కనబరచలేదు. ఫలితంగా 30 షేర్ బాం బే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) సూచీ 8.39 పాయిం ట్లు లేదా 0.02 శాతం పతనమై, 36,068.33 పా యింట్ల వద్ద ముగిసింది.

01/01/2019 - 03:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అత్యధిక పోటీ ఉన్న మార్కెట్లో కొత్త యేడాదిలో ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగం మరింతగా బలపడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రంగంపై నియంత్రణను ప్రభుత్వం మరింత కఠినతరం చేసిన దృష్ట్యా చిన్నాచితకా వ్యాపారులు పోటీకి నిలవలేని పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు. ఈ రంగంలో కొత్త సంవత్సరంలోప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు మరింతగా పెరగనున్నాయి.

01/01/2019 - 03:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: డాలర్ బలపడడం, చమురు ధరలు, వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు రూపాయి విలువ, దిశ, దశను నిర్దేశించనున్నాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. వచ్చే ఆరు నుంచి 12 నెలలు కూడా దేశ ఆర్థిక రంగం బాగా ఉంటుందని, ఊపులో ఉండే అవకాశం ఉందని స్టాండర్డ్ చార్టర్డ్ నివేదికలో పేర్కొంది. భారత కరెన్సీ రూపాయి కళకళలాడుతుందంటున్నారు.

01/01/2019 - 02:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: గృహ వినియోగ వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి. సబ్సిడీ సిలిండర్ మీద 5.91 రూపాయలు తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. మార్కెట్లో ఇంధన ధరలు తగ్గిన క్రమంలో వరుసగా నెల రోజుల వ్యవధిలో ఈ గ్యాస్ ధర తగ్గడం ఇది రెండోసారి.

12/31/2018 - 23:10

హాంకాంగ్‌లోని హాంకాంగ్ బ్యాంక్ వద్ద కనిపిస్తున్న షేర్ల సూచీ. ఈ ఏడాది చివరి రోజైన సోమవారం హాంకాంగ్ షేర్ మార్కెట్ 1.3 శాతం లాభపడింది. అందులో భారత్ వాటా 0.3 శాతం కావడం విశేషం. భారీగా నష్టపోయన దేశాల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.

12/31/2018 - 23:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అప్పుల్లో కూరుకుపోయిన ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) గ్రూప్ సంస్థ ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది. తద్వారా రుణాలను తీర్చాలని తీర్మానించింది. ఈ క్రమంలో ఈ సంస్థ ముంబయి, కేరళలో గల వాణిజ్య, నివాస ఆస్తుల విక్రయానికి టెండర్లు ఆహ్వానించింది.

Pages