S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/28/2018 - 22:45

ముంబయి, డిసెంబర్ 28: సెనె్సక్స్ బెంచిమార్కును అధిగమించి వరుసగా మూడోరోజూ లాభాల బాటలో నడిచింది. శుక్రవారం 269.44 పాయింట్లు ఎగబాకి 36,076.72 పాయంట్ల వద్ద స్థిరపడింది. విదేశీ ఇనె్వస్టర్లు పెద్దయెత్తున అమ్మకాలకు పాల్పడినప్పటికీ రూపాయి విలువ బలపడడంతో భారతీయ మార్కెట్లు లాభాల బాటలోనే నడిచాయి.

12/28/2018 - 22:35

ముంబయి, డిసెంబర్ 28: బంగారు నగలకు డిమాండ్ మరింతగా పెరుగుతున్నదని ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్‌ఏ) సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వే విడుదల చేసిన ప్రకటనను అనుసరించి, వ్యవస్థీకృత రంగంలో బంగారు నగలకు డిమాండ్ 6 నుంచి 7 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది.

12/28/2018 - 22:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తూర్పు సముద్ర తీర ప్రాంతంలో తుపాను పీడిత ఓఎన్‌జీసీ సెమీ సబ్‌మెర్సిబుల్ క్షేత్రం ‘ఒలిండా స్టార్’లో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన నిపుణుల బృందం రక్షణ చర్యలు చేపట్టింది. రికార్డు స్థాయిలో రిగ్‌ను పునరుద్ధరించింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో ఈనెలారంభంలో పెథాయ్ తుపాను విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

12/28/2018 - 22:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో నడుస్తున్న ఆరు అనుబంధ సంస్ధలు త్వరలో ‘షేర్ల అమ్మకాల ఆఫర్ల’తో ముందుకు రానున్నాయి. టీహెచ్‌డీసీఐఎల్, టీసీఐఎల్, రైల్ టెల్ సహా ఇరు ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలు ఈ ఆఫర్లు చేయనున్నాయని, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ కంపెనీ (కేఐఓసీఐఎల్) మాత్రం ‘్ఫలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎప్‌ఓపీ)తో ముందుకొస్తుందని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

12/28/2018 - 22:31

ముంబయి, డిసెంబర్ 28: మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడడంపై సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు కంపెనీలతోపాటు ఇద్దరు వ్యక్తులకు మొత్తం 45 లక్షల రూపాయల మేరకు జరిమానా విధించింది. జై జ్యోతి ఇండియా, లిబరల్ ప్రాపర్టీస్, డబుల్‌డాట్ ఫైనాన్స్ కంపెనీలేగాక, లలిత్ గులాటీ, లోకేష్ కుమార్ కూడా స్టాక్ మార్కెట్‌లో మోసపూరితంగా వ్యవహరించినట్టు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది.

12/28/2018 - 03:59

విశాఖపట్నం: దేశీయ మార్కెట్‌లో అటవీ ఉత్పత్తులకు మరింత ఆదరణ లభించే విధంగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రద్దీగా ఉండే విమానాశ్రయాలను ఉపయోగించుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. దీనివల్ల అటవీ ఉత్పత్తుల అమ్మకాలతోపాటు, వ్యాపార అభివృద్ధి, గిరిజన యువతకు ఉపాధి కూడా దొరుకుతుందని సంస్థ భావిస్తోంది.

12/28/2018 - 01:16

ముంబయి, డిసెంబర్ 27: వరుసగా రెండోరోజూ బీస్‌ఈ బెంచ్ మార్కులో సెనె్సక్స్ లాభాల బాటలో నడిచింది. గురువారం మొత్తం 157 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. రోజు ప్రారంభంలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ర్యాలీ జోరు కొనసాగింది.

12/28/2018 - 01:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ద్రవ్యలోటును ఎదుర్కొంటున్న ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 28,615 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది. రీ కేపిటలైజేషన్ బాండ్లు ద్వారా ఈ నిధులను కేంద్రం సమకూర్చనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం నాడిక్కడ వెల్లడించాయి. అవసరాలకు అనుగుణంగా మూలధనాన్ని సమకూర్చుకుని పనితీరును మెరుగుపరచుకునేందుకు ఈ ఆర్థిక సాయం తోడ్పడుతుంది.

12/28/2018 - 01:17

న్యూఢిల్లీలో గురువారం జరిగిన యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో భాగంగా
రెండో డెల్టా ర్యాంకింగ్స్‌ను విడుదల చేస్తున్న నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్, ఇతర సభ్యులు.

12/28/2018 - 01:01

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

Pages