S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/28/2018 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఈ ఏడాది మన దేశానికి చెందిన కంపెనీలు వివిధ ఈక్విటీ మార్కెట్ల ద్వారా 63.744 కోట్ల రూపాయల నిధులు ఇప్పటి వరకు సమకూర్చుకున్నాయి. గత సంవత్సరం వచ్చిన ఆల్‌టైం రికార్డు స్ధాయి 1.6 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది సమకూరిన మొత్తం దాదాపు 60 శాతం తక్కువ.

12/27/2018 - 04:24

ముంబయి: విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడాన్ని వ్యితిరేకిస్తూ ఉద్యోగులు బుధవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెతో బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

12/27/2018 - 03:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలను, తీపి గుర్తులను నిక్షిపత్తం చేసుకుంటూ 2018 ముగియబోతోంది. వేలాది కోట్ల రూపాయల రుణాల ఎగవేతలు, అప్పులు తీసుకున్న వ్యక్తుల పరారీ, సీఈవోలకు ఉద్వాసన వంటివి ఈ రంగాన్ని కుదేలు చేశాయి. వివిధ బ్యాంకులను ఆదుకునేందుకు ఎస్‌బీఐలో పలు బ్యాంకులను ప్రభుత్వం విలీనం చేయడం ఓ కీలక పరిణామం.

12/27/2018 - 01:25

ముంబయి, డిసెంబర్ 26: ఆరంభంలో కొంత ఊగిసలాటకు గురైనప్పటికీ బుధవారం స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికన్ మార్కెట్లలో తలెత్తిన సానుకూల పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. ఈక్విటీలు ఆరంభంలో బెంచ్ మార్కుకన్నా దిగువన ట్రేడై నష్టాల బాటపట్టినా తర్వాత బాగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ మూడు రోజుల నష్టాల పరంపరను దాటి బుధవారం 179.79 పాయింట్లు ఎగబాకి 0.51 శాతం లాభాలతో 35,649.94 వద్ద ముగిసింది.

12/27/2018 - 01:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: విద్యుత్ ఉత్పాదనకు బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకుని వచ్చే యేడాది కోల్ ఇండియా లిమిటెడ్స్ (సీఐఎల్)కి అదనంగా గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సీఐసీకి కేటాయించిన బొగ్గుగనులతోబాటు అదనంగా 10 గనులు కేటాయించడం జరుగుతుందని, తద్వారా ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత అధికార వర్గాలు బుధవారం నాడిక్కడ వెల్లడించాయి.

12/26/2018 - 22:46

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,047.00
8 గ్రాములు: రూ.24,376.00
10 గ్రాములు: రూ. 30,470.00 గ్రాములు: రూ.3,04,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,258.824
8 గ్రాములు: రూ. 26,070.592
10 గ్రాములు: రూ. 32,588.24
100 గ్రాములు: రూ. 3,25,882.4
వెండి
8 గ్రాములు: రూ. 321.20

12/26/2018 - 22:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు అంతర్జాతీయంగా ఉన్న ఆస్తులు, వాటిద్వారా సమకూరుతున్న ఆదాయ వివరాలను వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) బుధవారం ఆదేశించింది. ఈ యేడాది ఏప్రిల్ నాటికి ఎయిర్ ఇండియా ఆస్తుల ద్వారా వస్తున్న కిరాయి, లీజు వివరాలు, మొత్తం ఆస్తుల విలువ, విస్తరణ తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా కోరుతూ అసీమ్ తక్యార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు.

12/26/2018 - 22:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: మన దేశ ప్రధాన మార్కెట్లలోకి గత నవంబర్ మాసంలో పార్టిసిపేటరీ నోట్ల ద్వారా (పీ-నోట్స్) విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మొత్తం 79,247 కోట్ల రూపాయలు విదేశీయలు మన మార్కెట్లలో మదుపు చేశారు. తొమ్మిదిన్నరేళ్ల గరిష్ట స్థాయికి ఈ పెట్టులు చేరడం గమనార్హం.

12/26/2018 - 22:44

విజయవాడ, డిసెంబర్ 26: ప్రభుత్వ రంగంలోని విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసే ప్రయత్నాలను నిరసిస్తూ దేశ వ్యాప్త పిలుపు మేరకు బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలోని బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. దీంతో దాదాపు 5వేల వివిధ బ్యాంక్‌ల బ్రాంచీలు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి.

12/26/2018 - 03:38

న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హయాంలో రద్దయిన వారసత్వ పన్ను అంశాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా తెరపైకి తెచ్చారు. అమెరికా, యూరప్ లాంటి అనేక పశ్చిమ దేశాల్లో ఈ పన్ను అమలులో ఉండటం వల్ల అక్కడి ఆసుపత్రులు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలకు భారీగా విరాళాలు అందుతున్నాయని, కాని భారత్‌లో అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు.

Pages