S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/06/2019 - 01:04

ముంబయి, జనవరి 5: కొత్త సంవత్సరం మొదటి వారం భారత స్టాక్ మార్కెట్ అనుకున్నంత ఆశాజనకంగా కొనసాగలేదు. చివరిలో కొంత మెరుగుపడి, లాభాల బాట పట్టినప్పటికీ, స్థూలంగా చూస్తే బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు ఆశాజనకంగా లేవనే చెప్పాలి. వారం చివరి రోజైన శుక్రవారం 181.39 పాయింట్లు ఎగబాకి, 35,695.10 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే.

01/06/2019 - 01:03

న్యూఢిల్లీ, జనవరి 5: మన దేశంలోని ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కి చెందిన ఓఎన్‌జీసీ విదేష్ లిమిటెడ్ (ఓవీఎల్) దక్షిణ అమెరికాలోని కొలంబియాలో చమురు అనే్వషణకు శ్రీకారం చుట్టింది. తాజాగా జరిపిన అనే్వషణలో రెండవ చమురు నిక్షేపాలను కనుగొన్నట్టు ఓఎన్‌జీసీ శనివారం తెలిపింది. సముద్రతీర ప్రాంతంలోని సీపీఓ-5 బ్లాక్‌లో గల ఇండికో-1 బావిలో ఈ చమురు నిక్షేపాలు కనుగొన్నట్టు పేర్కొంది.

01/06/2019 - 01:01

న్యూఢిల్లీ, జనవరి 5: 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి గడచిన డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 89 లక్షల టన్నుల నూనె గింజలను, పప్పు దినుసులను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లు తదుపరి కూడా కొనసాగుతాయని శుక్రవారం రాజ్యసభలో వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ వెల్లడించారు.

01/06/2019 - 00:59

న్యూఢిల్లీ, జనవరి 5: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగితేలుతున్న దేశంలోని పెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ భారీ రుణం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ని ఆశ్రయిస్తోంది. అప్పుల నుంచి బయటపడేందుకు 1500 కోట్ల రూపాయలు (215 మిలియన్లు) రుణం రూపేణా అందజేయాలని తాజాగా ఎస్‌బీఐని అభ్యర్థించిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

01/06/2019 - 00:58

న్యూఢిల్లీ, జనవరి 5: వరుసగా మూడు రోజుల పాటు లాభాలు పంచి న పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వారాంతంలో పది గ్రాముల బంగారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 32,690 రూపాయలు పలికింది. డాలర్‌తో రూ పాయి విలువ తగ్గడం ఇందుకు కారణమని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. కాగా వెండి ధరల పెరుగుదల నమోదైంది. కిలో 40 వేల నుం చి 40,140కి పెరిగింది.

01/06/2019 - 00:57

న్యూఢిల్లీ, జనవరి 5: బ్యాంకు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గడంతోపాటు వడ్డీ రేట్లను తగ్గిస్తే భారత్ ఆర్థిక వ్యవస్థలో యూకేను అధిగమించే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జరిగే దేశ సాధారణ ఎన్నికల్లోగా కీలమైన వడ్డీరేట్లను తగ్గించే దిశగా పూనుకుంటే భారత్ యూకే కంటే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

01/05/2019 - 23:27

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,128.00
8 గ్రాములు: రూ.25,024.00
10 గ్రాములు: రూ. 31,280.00
100 గ్రాములు: రూ.3,12,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,345.455
8 గ్రాములు: రూ. 26,763.64
10 గ్రాములు: రూ. 33,454.55
100 గ్రాములు: రూ. 3,34,545.5
వెండి
8 గ్రాములు: రూ. 328.80

01/04/2019 - 22:12

ముంబయి, జనవరి 4: ఈవారానికి చివరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు ఊరట లభించింది. వరుస నష్టాలను ఎదుర్కొన్న సెనె్సక్స్ కొంత వరకు మెరుగుపడింది. 181.39 పాయింట్లు ఎగబాకి, 35,695.10 పాయింట్ల వద్ద ముగిసింది. బుధ, గురు వారాల్లో కొనసాగిన పతనం శుక్రవారం కూడా తప్పదనే అభిప్రాయం బలంగా వినిపించింది.

01/04/2019 - 22:11

బెంగళూరు, జనవరి 4: దేశంలో సేవల రంగం అనుకున్న స్థాయిలో లేకపోగా, మందగించడం పలు వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నది. నవంబర్‌లో 53.3 శాతంగా ఉన్న సేవల సూచీ డిసెంబర్‌లో 52.7 శాతానికి పడిపోయింది. ఈ పరిణామంతో సేవల రంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు భయపడుతున్నారు. అదే విధంగా కొత్తగా ఈ రంగంలో ఉపాధిని వెతుక్కునే వారు కూడా తమ భవిష్యత్తుపై స్పష్టత కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చ్తేన్నారు.

01/04/2019 - 22:09

న్యూఢిల్లీ, జనవరి 4: 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి గడచిన డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 89 లక్షల టన్నుల నూనె గింజలను, పప్పు దినుసులను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లు తదుపరి కూడా కొనసాగుతాయని శుక్రవారం రాజ్యసభలో వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ వెల్లడించారు.

Pages