S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/03/2019 - 23:18

న్యూఢిల్లీ, జనవరి 3: గిర్‌నార్ సాఫ్ట్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ పోర్టల్ ‘కార్ దేఖో’ కంపెనీ విస్తరణకు రూ.770 కోట్లు (110 మిలియన్ డాలర్లు) నిధులు సమీకరించింది. మూలధనంలో సిరీస్-సీ ఫండింగ్ విధానం ద్వారా వివిధ రకాల పెట్టుబడిదారుల నుంచి ఈ నిధుల సమీకరణ జరిగిందని కంపెనీ గురువారం నాడిక్కడ వెల్లడించింది.

01/03/2019 - 04:33

న్యూఢిల్లీ: విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీనితో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించేందుకు మార్గం సుగమమైంది. ఈ విలీనం తర్వాత, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌కు ఉన్న వ్యాపార లావాదేవీలన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదిలీ అవుతాయి. ఆస్తులు, అప్పులు, ఇతరత్రా ఖాతాలు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసిపోతాయి.

01/02/2019 - 23:43

ముంబయి, జనవరి 2: కొత్త సంవత్సరం ప్రారంభ ఉత్సాహం బుధవారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఏమాత్రం కనిపించలేదు. ఉదయం లావాదేవీలు ప్రారంభమైన మరుక్షణం నుంచే అమ్మకాల ఒత్తిళ్లు పెరిగాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ నీరసపడడంతో, దాని ప్రభావం బీఎస్‌ఈపైనా కనిపించింది. పెరుగుతున్న అమ్మకాలకు అడ్డుకట్ట పడే అవకాశం కనిపిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

01/02/2019 - 23:41

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,066.00
8 గ్రాములు : రూ. 24,528.00
10 గ్రాములు : రూ. 30,660.00
100 గ్రాములు : రూ. 3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,279.144
8 గ్రాములు : రూ. 26,233.152
10 గ్రాములు : రూ. 32,791.44
100 గ్రాములు : రూ. 3,27,914.4
వెండి
8 గ్రాములు : రూ. 331.20

01/02/2019 - 23:41

ముంబయి, జనవరి 2: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)కు సంబంధించిన మొండి బకాయిల విషయంలో రిజర్వుబ్యాంకు తీసుకున్న నిర్ణ యం పట్ల బ్యాంకర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో బ్యాంకులకు పెద్దయెత్తున ఉన్న వత్తిడి దీనివల్ల తగుతుందని స్థానిక బ్రోకరేజ్ కంపెనీ అధ్యయన నివేదిక వెల్లడించింది.

01/02/2019 - 23:40

ముంబయి, జనవరి 2: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) హౌసింగ్ ఫైనాన్స్ విభాగం తాజాగా ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీ) ద్వారా 265 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకుంది. డిసెంబర్ నెల చివరి వారంలో ఈ నిధులను సమకూర్చుకున్నామని, దీనిని గృహ రుణాల కోసం వినియోగిస్తామని మీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

01/02/2019 - 23:39

ముంబయి, జనవరి 2: రిజర్వు బ్యాంకు కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చే వారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సంస్ధలు (ఎంఎస్‌ఎంఈ), నాన్ బ్యాంకింగ్ రంగంలోని ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఏక దఫా రుణ పునర్వ్యవస్థీకరణ (వన్ టైం లోన్ రీస్ట్రక్చరింగ్) పథకాన్ని రిజర్వు బ్యాంకు మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఆ బ్యాంకు గవర్నర్ దాస్ ఇలా తనభేటీ విషయాన్ని ట్వీట్ చేశారు.

01/02/2019 - 23:39

ముంబయి, జనవరి 2: గత రెండు సంవత్సరాలుగా పైపులైన్ల ఏర్పాటుకు సంబంధించి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తుండటంతో నిర్మాణరంగం స్థిరంగా, ఆశాజనకంగా ఉందని ప్రముఖ రేటింగ్ ఏజన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రంగానికి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తుండటంతో ఈ రంగం స్థిరంగా కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్మాణరంగంలో పెద్దయెత్తున ప్రాజెక్టులను చేపడుతోంది.

01/02/2019 - 02:08

విశాఖపట్నం, జనవరి 1: విశాఖ ఉక్కు కార్మాగారం గణనీయమైన ప్రగతి దిశగా నడుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14,687 కోట్ల టర్నోవర్ సాధించి 29 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఉక్కు టర్నోవర్ రూ.11,395 కోట్లు. ఉక్కు విక్రయాల్లో కూడా కర్మాగారం ఇదే ప్రగతి కనబరచింది. గతేడాది వృద్ధి రేటుతో కంటే 8 శాతం మెరుగుపరచుకుందని సీఎండీ పీకే రథ్ పేర్కొన్నారు.

01/01/2019 - 23:38

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను విక్రయించడం ద్వారా గడచిన యేడాది కేంద్ర ప్రభుత్వం 77.417 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఇదే రకమైన పెట్టుబడులను వెనక్కు తీసుకునే (డిసినె్వస్ట్‌మెంట్) కార్యక్రమం కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Pages