S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/01/2018 - 22:29

ముంబయిలో:
==========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,975.00
8 గ్రాములు: రూ.23,800.00
10 గ్రాములు: రూ. 29,750.00
100 గ్రాములు: రూ.2,97,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,160.00
8 గ్రాములు: రూ. 25,280.00
10 గ్రాములు: రూ. 31,600.00
100 గ్రాములు: రూ. 3,16,000.00
వెండి

12/01/2018 - 22:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: నాఫ్తాగా పిలిచే మట్టితైలం వినియోగం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. కేంద్రం ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే, గత ఏడాది సెప్టెంబర్ మాసాంతానికి 1,171 వేల మిలియన్లుగా ఉన్న మట్టితైలం వినియోగం ఈ ఏడాది అదే సమయానికి 1,133 వేల మిలియన్ టన్నులుగా నమోదైంది. గత ఏడాది కంటే ఇది 38 వేల మిలియన్ టన్నులు తక్కువ.

12/01/2018 - 22:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: గత కొంతకాలంగా ఒడిదుడుకుల మధ్య సాగుతున్న బంగారం ధర ఈవారం మొదటి నుంచి చివరి వరకూ నష్టాలనే ఎదుర్కొంది. శనివారం నాటి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 15 రూపాయలు తగ్గడంతో, 31,460 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ సరళి ఆశాజనకంగా లేకపోవడం, బలహీన పడడం దేశీయ బులియన్ మార్కెట్‌ను దెబ్బతీసింది. వారం మొత్తం మీద బంగారం ధర 390 రూపాయలు పడిపోవడం గమనార్హం.

12/01/2018 - 00:23

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం లావాదేవీలు అత్యంత సానుకూల ధోరణులను ప్రదర్శించాయి. ఫలితంగా సెనె్సక్స్ గత రెండు వారాల గరిష్టంతో ముగిసింది. ఈవారం ఆరంభం నుంచి లాభాల బాటలో నడిచిన సెనె్సక్స్, లావాదేవీలకు చివరి రోజైన శనివారం స్వల్పంగా 23.89 పాయింట్లు (0.07 శాతం) పెరిగి, 36,194.30 పాయింట్ల వద్ద ముగిసింది.

12/01/2018 - 00:11

న్యూఢిల్లీ, నవంబర్ 30: జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వరుసగా మూడో రోజు కూడా తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర 65 రూపాయలు తగ్గి, 31,475 రూపాయలకు చేరింది. మొత్తం మీద గత మూడు రోజుల్లో బంగారం ధర 310 రూపాయలు తగ్గడం బులియన్ మార్కెట్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. విదేశీ పెట్టుబడిదారులేగాక, దేశీయ మదుపరులు సైతం ఆసక్తిని ప్రదర్శించకపోవడం బంగారం ధర పడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.

11/30/2018 - 23:52

ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,980.00
8 గ్రాములు: రూ.23,840.00
10 గ్రాములు: రూ. 29,800.00
100 గ్రాములు: రూ.2,98,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,165.00
8 గ్రాములు: రూ. 25,320.08
10 గ్రాములు: రూ. 31,650.00
100 గ్రాములు: రూ. 3,16,500.00
వెండి
8 గ్రాములు: రూ. 328.80

11/30/2018 - 23:50

ముంబయి, నవంబర్ 30: ఆర్‌బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలను తీసుకునే హక్కు ఉందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మమణియన్ అనుమానం వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ రిజర్వులను భారీగా పెంచుతున్నదని మోదీ, జైట్లీ ఆర్థిక విధానాలు, వాటి ప్రభావంపై త్వరలోనే విడుదల కానున్న తన పుస్తకంలో వ్యాఖ్యానించారు.

11/30/2018 - 23:49

ముంబయి, నవంబర్ 30: భవన నిర్మాణ రంగం జోరుగా సాగుతున్నప్పటికీ, గత మూడు నెలలుగా దేశంలో సిమెంట్ ఉత్పాదన తగ్గుతున్నది. నిరుటి ఉత్పత్తితో పోలిస్తే పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ, ఈ ఏడాది మార్చి, జూన్ మాసాలతో పోలిస్తే నిరాశాజనకంగానే ఉంది. నిరుడు సెప్టెంబర్‌లో 2,29,12,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అది 2,56,25,000 మెట్రిక్ టన్నులకు చేరింది.

11/30/2018 - 02:43

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత తలసరి ఆదాయ అభివృద్ధి (జీడీపీ) రేటును సవరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం సమర్థించుకున్నారు. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) ఈ సవరించిన సంఖ్యను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

11/29/2018 - 23:08

ముంబయి, నవంబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు గురువారం భారీగా లాభపడ్డాయి. రూపాయి విలువలో భారీ ర్యాలీ వచ్చిన తరుణంలో నవంబర్ నెల డెరివేటివ్‌ల సిరీస్ కాలపరిమితి ముగియడంతో మదుపరులు షార్ట్ కవరింగ్‌కు పూనుకోవడం వల్ల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం 450 పాయింట్లు పుంజుకుంది.

Pages