S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/04/2018 - 01:43

ముంబయ, డిసెంబర్ 3: ఈ వారం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో టాప్ పది కంపెనీల్లో ‘రిల్’ రూ.41, 427 కోట్లు పెరగడంతో టాప్‌గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్ రూ.58,293 కోట్లతో రెండో స్థానం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.30,465 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయ.

12/04/2018 - 01:42

ముంబయి, డిసెంబర్ 3: ఉత్పత్తులకు సంబంధించిన కొనుగోళ్ల నిర్వాహణ సూచీ (పీఎంఐ) ఆశాజనకంగా కనిపిస్తున్నది. గత నెల మెరుగైన ఫలితాలు వెల్లడి కావడంతో, ఈనెల కూడా అదే తరహా సూచీలు ఉంటాయని విశే్లషకులు భావిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సప్లై మేనేజ్‌మెంట్ (ఐఎస్‌ఎం) ప్రతినెలా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. నాలుగు వందలకుపైగా భారీ కంపెనీలకు సంబంధించిన ఈ పీఎంఐ నవంబర్‌లో 54.0 శాతంగా నమోదైంది.

12/04/2018 - 01:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వరుసగా నాలుగు రోజులు నష్టాలను ఎదుర్కొన్న బులియన్ మార్కెట్ సోమవారం కోలుకుంది. పది గ్రాముల బంగారం ధర ఒక్క రోజే 390 రూపాయలు పెరగి, 31,850 రూపాయలకు చేరింది. దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఏర్పడడం బంగారం ధర పెరగడానికి ఒక కారణమైతే, రూపాయి మారకపు విలువ పడిపోవడం మరోకారణం. శనివారం 31,460 రూపాయలుగా ఉన్న పది గ్రాముల బంగారం ఈవారం మొదట్లోనే లాభాల బాట పట్టడం విశేషం.

12/03/2018 - 23:52

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,978.00
8 గ్రాములు: రూ.23,824.00
10 గ్రాములు: రూ. 29,780.00
100 గ్రాములు: రూ.2,97,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,185.027
8 గ్రాములు: రూ. 25,480.216
10 గ్రాములు: రూ. 31,850.27
100 గ్రాములు: రూ. 3,18,502.07
వెండి
8 గ్రాములు: రూ. 331.20

12/03/2018 - 01:15

న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్ల నిర్ణయం, సూక్ష్మ ఆర్థిక జాబితాతోబాటు అంతర్జాతీయ పరిస్థితులు ఈవారం స్టాక్‌మార్కెట్ స్థితిగతులను నిర్ధేశించనున్నాయని పరిశీలకులు అంచనావేస్తున్నారు. ఉత్పాదక, సేవా రంగాల్లో ప్రాథమిక పెట్టుబడుల డేటాను అనుసరించి మార్కెట్‌లోని వ్యాపార సెంటిమెంటు ప్రభావితం అవుతుందని అంటున్నారు.

12/02/2018 - 23:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీకి) చెందిన సుమారు 149 చిన్న, మధ్య తరహా ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ విక్రయానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ విభాగాలన్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో ఉన్నాయి. ఇకపై వీటి నిర్వహణను ప్రైవేటు, విదేశీ కంపెనీలపరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

12/03/2018 - 01:17

ముంబై, డిసెంబర్ 2: దేశంలో స్మార్ట్ ఫోన్‌ల వాడకం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో మ్యూజిక్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటూ పాటలు విని ఆనందిస్తున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ‘గానా’ యాప్ సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతా కాదు. రాబోయే రెండేళ్లల్లో 200 మిలియన్ల మంది చందాదారులను కలిగి ఉండాలని గానా కోరుకుంటోంది.

12/02/2018 - 23:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: గడచిన నవంబర్ మాసంలో భారత మూలధన మార్కెట్‌లో విదేశీయులు 12,260 కోట్ల రూపాయలు మదుపుచేశారు. ముడిచమురు ధరల్లో తగ్గుదల, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పెరిగిన నేపథ్యంలో ఇలా విదేశీ పెట్టుబడులకు ఊతం లభించగా ఈ మొత్తం పది నెలల గరిష్టానికి చేరడం గమనార్హం.

12/02/2018 - 01:43

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) లావాదేవీలు ఈవారం జోరుగా కొనసాగాయి. గత రెండు నెలల కాలానికి గరిష్టంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌ను ముగించింది. దూకుడును కొనసాగించిన సెనెక్స్ 36,194.30 పాయింట్లకు చేరుకోవడం మారుతున్న మార్కెట్ గమనాలకు అద్దం పడుతుంది. వరుస నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఈవారం ప్రారంభం నుంచే కోలుకోవడం ప్రారంభమైంది.

12/01/2018 - 22:35

ముంబయి, డిసెంబర్ 1: మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ తన షిప్‌బిల్డింగ్ పార్కుల కార్యక్రమంలోకి మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించింది. ఇందుకోసం లీజు కాలపరిమితిని ప్రస్తుతం ఉన్న పదేళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచుతూ తన ఓడరేవుల విధానం- 2016 (పోర్ట్స్ పాలసి)ను సవరించడానికి కసరత్తు చేస్తోంది.

Pages