S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/28/2018 - 00:53

ముంబయి, నవంబర్ 27: బ్యాంకింగ్, ఐటీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం బలపడ్డాయి. దేశ స్థూలార్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోవడం మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 159 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 57 పాయింట్లు పెరిగింది.

11/28/2018 - 00:40

ముంబయి, నవంబర్ 27: రూపాయి మంగళవారం స్వల్పంగా బలపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎనిమిది పైసలు పుంజుకొని, 70.79 వద్ద ముగిసింది. ఎగుమతిదారుల నుంచి డాలర్ల విక్రయం పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం రూపాయి స్వల్పంగా బలపడటానికి దోహదపడింది.

11/28/2018 - 00:39

ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,020.00
8 గ్రాములు: రూ.24,160.00
10 గ్రాములు: రూ. 30,200.00
100 గ్రాములు: రూ.3,02,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,229.947
8 గ్రాములు: రూ. 25,839.576
10 గ్రాములు: రూ. 32,299.047
100 గ్రాములు: రూ. 3,22,994.07
వెండి

11/28/2018 - 00:37

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఎగుమతి రంగం నిధుల సమస్యను ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఈ సమస్యను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లినట్టు ఆయన చెప్పారు. ఎగుమతి రంగానికి నిధులు తగ్గుతున్నాయని, అందువల్ల ఎగుమతిదారులకు తగినన్ని నిధులు అందుబాటులో ఉండేట్టుగా చూడాలని తాను ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరినట్టు సురేశ్ ప్రభు మంగళవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు.

11/27/2018 - 00:17

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,020.00
8 గ్రాములు: రూ.24,160.00
10 గ్రాములు: రూ. 30,200.00
100 గ్రాములు: రూ.3,02,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,229.947
8 గ్రాములు: రూ. 25,839.576
10 గ్రాములు: రూ. 32,299.47
100 గ్రాములు: రూ. 3,22,994.07
వెండి
8 గ్రాములు: రూ. 330.40

11/27/2018 - 00:16

న్యూఢిల్లీ, నవంబర్ 26: పది గ్రాముల బంగారం ధర సోమవారం 100 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ సెంటిమెంట్ బాగా పని చేయడంతో, దేశీయ నగల వ్యాపారులు కొనుగోలు పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. బులియన్ మార్కెట్ సానుకూల సూచీలను నమోదు చేయడంతో పది గ్రాముల బంగారం ధర 31,850 రూపాయలకు చేరింది. గత వారం 31,750 రూపాయలుగా ఉన్న పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 1,224.30 డాలర్లకు ట్రేడ్ అయింది.

11/27/2018 - 00:16

న్యూఢిల్లీలో సోమవారం ఇన్‌ఫినిక్స్ మొబైల్ ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్న
ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిష్ కపూర్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాకీ

11/27/2018 - 00:13

ముంబయి, నవంబర్ 26: వరుసగా మూడు సెషన్లలో నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు కోలుకుంది. ఈవారం శుభారంభం చేసింది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ), ఆటో రంగాలు కోలుకోవడంతో సెనె్సక్స్ 373.06 పాయింట్లు (1.07 శాతం) పెరిగి, 35,354.08 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంజీసీ, ఆటోతోపాటు బ్యాంకింగ్ స్టాక్స్ ట్రేడింగ్ కూడా ఆశాజనకంగా కొనసాగింది.

11/27/2018 - 00:12

టోక్యో, నవంబర్ 26: వాహనాల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మిత్సుబిషి చైర్మన్ కార్లొస్ గోషన్‌పై వేటు పడింది. అతనిని పదవి నుంచి తొలగిస్తూ పాలక మండలి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇటీవలే గోషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

11/29/2018 - 00:42

ముంబయి, నవంబర్ 27: రిజర్వు బ్యాంకు వద్ద ప్రస్తుతం అవసరానికి మించిన నిధుల నిల్వలు ఉన్నందున సుమారు ఒక ట్రిలియన్ రూపాయల నిధులను ప్రభుత్వానికి బదలాయించవచ్చని అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ నిర్థారించే అవకాశాలున్నాయి. ఈమేరకు అదనపు మూలధనాన్ని నిల్వలను కమిటీ గుర్తించే అవకాశాలున్నట్లు ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది.

Pages