S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/26/2018 - 03:46

విజయవాడ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఇంధన అవసరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ చమురు రంగ సంస్థలు ఓవైపు మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు, గ్రామీణ వ్యవసాయదారుల అవసరాలను తీర్చేందుకు సరసమైన ధరలకు నాణ్యమైన పెట్రోలు, డీజిల్ అందేలా తమ రిటైల్ అవుట్‌లెట్ నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించబోతున్నాయి. ఇందుకుగాను రాష్ట్రంలో 2814 ప్రదేశాలను గుర్తించారు.

11/26/2018 - 01:07

హైదరాబాద్, నవంబర్ 25: దేశంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేయడానికి సింగరేణి కాలరీసుకు భారీగా అవకాశాలు దక్కాయి. శనివారం ఒక్కరోజే సింగరేణి బొగ్గు గనుల నుంచి రోజుకు లక్షా 63వేల టన్నుల బొగ్గును సరఫరా చేసి కొత్త రికార్డును సృష్టించింది. సింగరేణి ఏరియాలోని 10 బొగ్గు కేంద్రాల నుంచి రోజూ వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా అవుతుంది.

11/25/2018 - 23:31

న్యూఢిల్లీ, నవంబర్ 25: విదేశీ మదుపర్లు సుమారు 6,310 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు భారత మూలధన మార్కెట్లలో మదుపుచేశారు. గడచిన ఆక్టోబర్‌లో భారీగా ఉపసంహరణలు జరిగిన సంగతి తెలిసిందే. ముడిచమురు ధరలు తగ్గడంతోబాటు, డాలర్‌తో రూపాయి విలువ కూడా పెరగడం వంటి కారణాలు ఇందుకు దోహదం చేశాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

11/25/2018 - 23:29

న్యూఢిల్లీ, నవంబర్ 25: మార్కెట్‌లో వస్తుసేవల విలువ పతనం రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్), టీసీఎస్‌ను కూడా ప్రభావితం చేసింది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ వివరాల పరిశీలిస్తే రిల్ ఏకంగా 15,615 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ కంపెనీ వస్తుసేవలు విలువ 7,14,659 కోట్ల రూపాయల నుంచి 6,99,044 కోట్ల రూపాయలకు పడిపోయింది. అదే విధంగా టీసీఎస్ కూడా భారీగానే నష్టపోయింది.

11/25/2018 - 23:28

పాట్నాకు సమీపంలోని దనియావా గ్రామంలో ఆదివారం ‘డిజిటల్ విలేజ్’ (డిజీగావ్)ను ప్రారంభిస్తున్న కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్.

11/25/2018 - 23:26

ముంబయి, నవంబర్ 25: వోన్డ్ ఒవర్ ది టాప్ (ఓటీటీ) పద్ధతిలో బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్వహిస్తున్న అజిత్‌బాలాజీకి ప్రతినెలా 2.3 మిలియన్ల మంది చురుకైన వినియోగదార్లు సమకూరుతున్నారని బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అజిత్ బాలాజీ సీఈవో నచికేత్ పంట్వైడ్యా తెలిపారు. వచ్చే రెండున్నరేళ్ల కాలంలో 150 కోట్ల ఆదాయం తమ సంస్థకు చేకూరుతుందని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు.

11/25/2018 - 23:25

న్యూఢిల్లీ, నవంబర్ 25: యూరియా దిగుమతులు గణనీయంగా తగ్గాయి. అక్టోబర్ నెలలో 3.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా దేశంలోకి దిగుమతైంది. గత ఏడాది ఇదే నెల దిగుమతులు 5.14 లక్షల మిలియన్ టన్నులు. కాగా, గత ఏడాది నవంబర్‌లో అత్యధికంగా 8.43 లక్షల మిలియన్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఇది 6.20 లక్షల మిలియన్ టన్నులుగా నమోదైంది.

11/25/2018 - 23:23

న్యూఢిల్లీ, నవంబర్ 25: ఈవారం ప్రపంచ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలున్నాయని, అయతే ముడిచమురు ధరలు, అమెరిక్ డాలర్‌తో భారత రూపాయి విలువ ఈ మార్కెట్ల ట్రెండ్‌ను నియంత్రించే అవకాశాలున్నాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. అలాగే సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి తలసరి ఆదాయానికి సంబంధించిన విషయంపై మదుపర్లు దృష్టి పెట్టారని పరిశీలకులు అంటున్నారు.

11/25/2018 - 23:22

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,020.00
8 గ్రాములు: రూ.24,160.00
10 గ్రాములు: రూ. 30,200.00
100 గ్రాములు: రూ.3,02,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,229.947
8 గ్రాములు: రూ. 25,839.576
10 గ్రాములు: రూ. 32,299.47
100 గ్రాములు: రూ. 3,22,994.07
వెండి
8 గ్రాములు: రూ. 330.40

11/25/2018 - 04:41

విశాఖపట్నం: దూర ప్రాంత రైలు ప్రయాణికులకు భోజన వసతి కల్పించే పాంట్రీ కార్‌ల సాంప్రదాయానికి తెరపడనుంది. ఈ విధానాన్ని రైల్వే శాఖ స్వస్తి చెప్పనుంది. పాంట్రీల నిర్వహణ భారం కావడం, ప్రధానంగా కోచ్‌ల కొరత, దీనిద్వారా వెదజల్లే కాలుష్యం వంటి అనేక కారణాలతో పాంట్రీలను పూర్తిస్థాయిలో తొలగించాలనే నిర్ణయానికి రైల్వే శాఖ వచ్చినట్టు తెలిసింది. దీనిపై ఆలోచన చేస్తున్న రైల్వే దశలవారీగా తొలగిస్తుందా?

Pages